పోలీసులకు దొరికిపోయిన శివాజి.. సీక్రెట్‌గా కూతురిని కన్నాడని: పెదవి విప్పిన బిగ్ బాస్ స్టార్

చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చి.. ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత హీరోగా సత్తా చాటాడు శివాజి. ఇలా సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తనదైన సినిమాలతో మెప్పించిన అతడు.. కొన్నేళ్ల పాటు రాజకీయాలపై కూడా ఫోకస్ చేశాడు. అయితే, గత ఏడాది బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఎనలేని క్రేజ్‌ను పెంచుకున్నాడు. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో పాల్గొన్న శివాజి.. సీక్రెట్‌గా ఓ అమ్మాయికి తండ్రవడం, పోలీసులకు చిక్కడంపై స్పందించాడు. వివరాల్లోకి వెళ్తే...

బిగ్ బాస్ షోతో మరోసారి:సుదీర్ఘ కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శివాజి.. బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే మైండ్ గేమ్‌తో మెప్పించడంతో ఈ సీజన్‌లో విజేతగా నిలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా శివాజి ఫినాలే ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయి మూడో స్థానంలో నిలిచాడు. దీనితోపాటు క్రేజ్‌ను కూడా రెట్టింపు చేసుకున్నాడు.

Hero Sivaji Responds On Dubai Incident and Daughter Rumors in Alitho Saradaga Show

వెబ్ సిరీస్ సూపర్ హిట్:బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శివాజి '#90s' అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ఇది ఇటీవలే ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు అన్ని వర్గాల నుంచి అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్ లభించాయి. ఈ వెబ్ సిరీస్‌ ఘన విజయంతో శివాజి ఫుల్ జోష్‌లో ఉన్నాడు.

వరుసగా ఇంటర్వ్యూలు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో అదరగొట్టడంతో పాటు '#90s' వెబ్ సిరీస్‌లో సక్సెస్ సాధించి శివాజి మరోసారి హైలైట్ అయిపోయాడు. ఫలితంగా అతడు దాదాపు రెండూ మూడు రోజులుగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే ఎన్నో కార్యక్రమాల్లోనూ భాగం అవుతున్నాడు. దీంతో ఇప్పుడు కూడా శివాజి పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది.

Hero Sivaji Responds On Dubai Incident and Daughter Rumors in Alitho Saradaga Show

అలీతో సరదాగా షోలో:బిగ్ బాస్ షో తర్వాత ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసిన హీరో శివాజి తాజాగా 'అలీతో సరదాగా' షోలో పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో అతడు తన సినిమా కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను పంచుకున్నాడు. ముఖ్యంగా కొన్ని కాంట్రవర్శీలపై స్పందించాడు. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

ఐదు లక్షలు వచ్చాయి:అలీతో సరదాగా షోలో శివాజి తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. 'ప్రేమంటే ఇదేరా షూటింగ్‌కు పొల్లాచ్చి వెళ్తుంటే ట్రైన్‌లో ఒకాయన నాకు మందు బాటిల్ ఇచ్చాడు' అని చెప్పాడు. తర్వాత అలీ '#90s' వెబ్ సిరీస్‌ గురించి ప్రశ్నించగా.. 'నేను బాపినీడు గారి దగ్గరకు వెళ్లాను. ఆయన ఏదైనా చెయ్ అన్నారు. ఆ సిరీస్‌తో 5 లక్షల మంది సబ్‌స్కైబర్స్ వచ్చారు' అన్నాడు.

కూతురిని పెంచుతాను:ఇదే షోలో అలీ 'నీకు ఇద్దరు అబ్బాయిలు కదా. కానీ, నీకు కూతురు కూడా ఉందని బయట టాక్ వచ్చింది ఏంటి' అని ప్రశ్నించాడు. దీంతో శివాజి 'ఏమో మరి.. నాకు కూతురు ఎక్కడుందో తీసుకు వచ్చి ఇస్తే నేనే హ్యాపీగా పెంచుకుంటాను' అన్నాడు. తర్వాత శివాజి పెళ్లి ఫొటోను చూపించి అలీ కామెడీ చేశాడు. అనంతరం అతడి పదవ తరగతి మార్కుల గురించి జోక్ చేశాడు.

మళ్లీ దుబాయ్ ఇష్యూ:గతంలో హీరో శివాజి ఓ కేసులో రూపం మార్చుకుని దుబాయ్ పోలీసులకు పట్టుబడ్డాడు అని ప్రచారం జరిగింది. తాజాగా జరిగిన అలీతో సరదాగా షోలో అలీ దీనిపై ప్రస్తావించాడు. దీనికి శివాజి 'వేషం మార్చి పోలీసులకు దొరికిపోయిన శివాజి అన్నారు. అప్పటికప్పుడు జరిగింది. ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటేనే రాజకీయం చేయాలి' అన్నాడు. ఇలా ఈ ప్రోమో ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X