Bigg Boss 7 Telugu: షోలో శివాజి వింత ప్రవర్తన.. బొ** పగల**తా అంటూ.. చివరి ట్విస్టుకు నరాల్ కట్

ఇంగ్లీష్ షో ఆధారంగా వచ్చి.. ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరింది బిగ్ బాస్. కొందరు కంటెస్టెంట్లను ఓ ఇంట్లో ఉంచి.. వాళ్లకు టాస్కులు ఇచ్చి.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న వాళ్లను విజేతగా ప్రకటించడమే ఈ కార్యక్రమం నేపథ్యం. తెలుగులో అనూహ్యంగా ఆరంభంలోనే దీనికి ప్రేక్షకుల భారీ రెస్పాన్స్‌ను అందించడంతో వరుసగా సీజన్లను జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఏడోది కూడా ఇటీవలే మొదలైంది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హీరో శివాజి పెర్ఫార్మెన్స్‌ హైలైట్‌గా నిలిచింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

మొదట్లోనే సరికొత్త ప్లాన్లతో:మిగిలిన భాషల కంటే బిగ్ బాస్ షోకు తెలుగులోనే ఎక్కువ రెస్పాన్స్ లభిస్తోంది. అందుకు అనుగుణంగానే దీన్ని సరికొత్త కంటెంట్‌తో తీసుకు వస్తున్నారు. ఇక, గత వారంలో మొదలైన ఏడో సీజన్‌ను కూడా ఎన్నో ప్రయోగాలతో నడిపిస్తున్నారు. దీన్ని మరింత కొత్తగా మార్చేందుకు వినూత్నమైన ప్లాన్లతో ముందుకు వస్తున్నారు. దీంతో ఈ సీజన్‌ ఆసక్తికరంగానే సాగిపోతోంది.

Hero Sivaji Secret Task Highlight In Bigg Boss Show

మొదటిసారి ఐదు వారాల:బిగ్ బాస్ షో అంటే ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఏడో సీజన్‌ ఆరంభంలోనే ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి వారంలోనే ఏకంగా 'ఐదు వారాల ఇమ్యూనిటీ'ని అందించే టాస్కులను జరుపుతున్నారు. ఇందులో పోటీదారులుగా వచ్చిన వాళ్లకు షోలో కంటెస్టెంట్లుగా కన్ఫర్మేషన్ ఇస్తున్నారు.

Hero Sivaji Secret Task Highlight In Bigg Boss Show

రెండో రౌండ్‌ బిగ్ బాస్‌దే:తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల్లో కొందరికి బిగ్ బాస్ టాస్కులు ఇచ్చాడు. ఇందులో ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్లను ఇమ్యూనిటీ టాస్కుకు ఎంపిక చేస్తానని చెప్పాడు. ఇందులో భాగంగానే ప్రిన్స్‌కు ఫ్లర్ట్ చేసే టాస్క్ ఇచ్చాడు. తర్వాత అమర్‌దీప్, గౌతమ్‌కు బల్లుల్లా మారాలని చెప్పాడు. శోభా శెట్టి, తేజకు ఒక టాస్క్.. ఇలా అందరికీ చాలా రకాల ఛాలెంజ్‌లు ఇచ్చాడు.

Hero Sivaji Secret Task Highlight In Bigg Boss Show

షోలో శివాజి ఉగ్రరూపం:ఒకవైపు టాస్కులు జరుగుతుండగానే హీరో శివాజి చూపించిన వింత ప్రవర్తన ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులను ఉలిక్కి పడేలా చేసింది. అతడు తనకు కాఫీ కావాలని, తన టాబ్లెట్లు పంపించలేదని బిగ్ బాస్‌పై విరుచుకుపడ్డాడు. 'బొక్కైనా భయపడను.. అన్నీ పగలనూకుతా.. డోర్స్ తీసేయవయ్యా నేను వెళ్లిపోతా' అంటూ నానా రచ్చ చేసి అందరినీ భయపెట్టేశాడు.

Hero Sivaji Secret Task Highlight In Bigg Boss Show

బిగ్ బాస్ యమ కామెడీ:ఒకవైపు తనకు కాపీ, ట్యాబ్లెట్లు కావాలని శివాజి గొడవ చేస్తుండగా.. బిగ్ బాస్ మాత్రం ఒకసారి బ్లడ్ ప్లెజర్ చెక్ చేసే మెషిన్‌ను, మరోసారి స్తెతస్కోప్‌ను పంపించాడు. వాటి ద్వారా శివాజీ బీపీ చెక్ చేయాలని డాక్టర్ అయిన గౌతమ్‌కు చెప్పాడు. అప్పుడు శివాజీకి కోపం మరింతగా పెరిగింది. ఆ సమయంలో ఇంటి సభ్యులు ఆయనను కూల్ చేస్తూనే బిగ్ బాస్‌కు ఎన్నో రిక్వెస్టులు చేశారు.

లోపలికి పిలిచిన బాస్:ఇంట్లో శివాజి రెచ్చిపోతుండడంతో ఏమైపోతుందా అని అందరూ టెన్షన్ పడ్డారు. ఆ సమయంలోనే అతడిని బిగ్ బాస్ యాక్టివిటీ ఏరియాలోకి పిలిచాడు. అక్కడకు వెళ్లగానే అసలు మేటర్ రివీల్ చేశాడతను. అసలేం జరిగిందంటే.. బిగ్ బాస్ శివాజికీ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అందుకే అలా ప్రవర్తించాడు. ఇది తెలిసిన తర్వాత ఆడియెన్స్‌తో పాటు శివాజి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Hero Sivaji Secret Task Highlight In Bigg Boss Show

ఏం యాక్టింగ్ చేశావయ్యా:యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లగానే శివాజి 'ఏంటయ్యా బాబూ.. నేనేదో కష్టపడి యాక్టింగ్ చేస్తుంటే.. నన్ను ఎందుకు పిలిచావు? ఇప్పుడు అంతా అర్థం అయిపోయి ఉంటుంది' అన్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న కాఫీ తీసుకొచ్చి తన కోపానికి బిగ్ బాస్ తలొగ్గాడు అన్నట్లుగా హౌస్‌మేట్స్ ముందు నమ్మించాడు. మొత్తానికి శివాజీ యాక్టింగ్ చూసిన వాళ్లంతా అతడిని ప్రశంసిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X