బిగ్ బాస్ హౌస్‌లో శృంగారం.. బెడ్‌రూం, బాత్రూంలో అలా: శివాజి సంచలన వ్యాఖ్యలు

ఇండియాలో చాలా కాలం క్రితమే ప్రారంభం అయినా.. తెలుగులోకి ఆలస్యంగా వచ్చినా.. భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించిన కార్యక్రమమే బిగ్ బాస్. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.

ఫలితంగా రికార్డు స్థాయి రేటింగ్‌తో దేశంలోనే నెంబర్ వన్ షోగా నిలిచింది. ఇందులో కంటెస్టెంట్లకు వచ్చే పర్సనల్ లేదా శృంగారానికి సంబంధించిన ఫీలింగ్స్ గురించి ఏడో సీజన్ కంటెస్టెంట్ శివాజి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసమే!

Hero Sivaji Sensational Comments On Personal Feelings In Bigg Boss Show

టైటిల్ ఫేవరెట్‌గా వచ్చినా: చాలా కాలం పాటు సినిమాల్లో మెప్పించి.. సుదీర్ఘ కాలంగా తెరకు దూరంగా ఉన్నాడు శివాజి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి టైటిల్ ఫేవరెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే మైండ్ గేమ్‌తో మెప్పించడంతో ఈ సీజన్‌లో విజేతగా నిలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా శివాజి ఫినాలే ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయి మూడో స్థానంలో నిలిచాడు.

Hero Sivaji Sensational Comments On Personal Feelings In Bigg Boss Show

వెబ్ సిరీస్ సక్సెస్‌తో జోష్: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి ముందే శివాజి '#90s' అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇది ఇటీవలే ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు అన్ని వర్గాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా దీనికి రికార్డు వ్యూస్ లభిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్‌ ఘన విజయంతో శివాజి ఫుల్ జోష్‌లో ఉన్నాడని చెప్పుకోవచ్చు.

Hero Sivaji Sensational Comments On Personal Feelings In Bigg Boss Show

వరుసగా ఇంటర్వ్యూలతో: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో అదరగొట్టి.. '#90s' వెబ్ సిరీస్‌లో సక్సెస్ సాధించిన శివాజి.. మరోసారి హైలైట్ అయిపోయాడు. ఫలితంగా అతడు దాదాపు నెల రోజులుగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే ఎన్నో కార్యక్రమాల్లోనూ భాగం అవుతున్నాడు. దీంతో ఇప్పుడు కూడా శివాజి పేరు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

బిగ్ బాస్ షోలో శృంగారం: బిగ్ బాస్ హౌస్‌లో జరిగే అన్ని రకాల అంశాల గురించి ప్రేక్షకులకు చాలానే డౌట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రసారం అయ్యే కంటెంట్ గురించి చాలా మంది క్లారిటీ ఇచ్చినా అవన్నీ ఫేక్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లకు శృంగారానికి సంబంధించిన ఫీలింగ్స్ వస్తాయా రావా అన్న దానిపై శివాజి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

Hero Sivaji Sensational Comments On Personal Feelings In Bigg Boss Show

అలాంటివి రానే రావంటూ: తాజా ఇంటర్వ్యూలో శృంగార కోరికల గురించి శివాజి స్పందించాడు. 'బిగ్ బాస్ హౌస్‌లో 15 వారాల పాటు ఉంటారు. వాళ్లకు ఫీలింగ్స్ వస్తాయా? లేదా? అన్న దానిపై చాలా మందికి డౌట్ ఉంది. దీనిపై నేను కచ్చితంగా చెప్పాలి. అసలు హౌస్‌లో ఉన్నప్పుడు అలాంటి ఫీలింగ్స్ రావు. గేమ్‌లో ఎలా నెగ్గుకు రావాలి అన్న ఆలోచనలు తప్ప అలాంటివి ఏమీ రావు' అని చెప్పుకొచ్చాడు.

బాత్రూం, బెడ్ రూంలోనూ: ఆ తర్వాత శివాజి కంటిన్యూ చేస్తూ.. 'బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి చోటా కెమెరాలు ఉంటాయి. బెడ్‌రూంలో, బాత్రూం బయట కూడా ఉంటాయి. ఒక కంటెస్టెంట్ బాత్రూంలోకి వెళ్లే వరకూ ప్రతీది కనిపిస్తుంది. కాబట్టి ఎవరికీ కోరికలు, ఆలోచనలు రావు. ప్రతి ఒక్కరూ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా గేమ్ పైనే దృష్టి పెడతారు' అంటూ వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X