Pallavi Prashanth: శివాజీ ఏమైంది.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయినా ఈ సైలెన్స్ ఏంటి?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎన్నో ఆసక్తి పరిణామాల మధ్య ముగిసింది. కానీ వివాదాలు మాత్రం వెంటాడుతునే ఉన్నాయి. ఇక ఈ సీజన్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్... అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని పోలీసులు హెచ్చరించినప్పటికీ ట్రోఫీ గెలిచిన అనంతరం పల్లవి ప్రశాంత్ ర్యాలీతో బయలుదేరాడు. మరోవైపు పలువరు కంటెస్టెంట్స్ కార్లపై, బస్సులపై అభిమానులు రచ్చ చేశారు. ఈ క్రమంలోనే ఆయన అరెస్టు అయినట్లు తెలుస్తోంది. అయితే రైతు బిడ్డ అంటూ సపోర్ట్ ఇచ్చిన శివాజీ.. ఇంత జరిగినా స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలేలో ఈసారి విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజున పల్లవిప్రశాంత్ ఫ్యాన్స్ తో కలిసి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 5కి బయలు దేరాడు. పోలీసులు హెచ్చరించినా సరే.. నేను ఒక రైతు బిడ్డను.. బిగ్ బాస్ విజేతను ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశాంత్ వాదించాడు. ఇక భారీ ఎత్తున అభిమానులతో కలిసి ర్యాలీ నిర్వహించాడు. మరోవైపు తన తోటీ కంటెస్టెంట్స్ పై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు.

ఇక ఆ దాడిలో బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్, గీతు రాయల్, అశ్విని కార్లు ధ్వంసం అయ్యాయి. అంతే కాదు టీఎస్ ఆర్టీసీ బస్సులు సైతం ధ్వంసం అయ్యాయి. ఇక వీటన్నింటీని సుమోటగా తీసుకున్న పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పర్చగా.. 14రోజుల రిమాండ్ విధించింది కోర్టు.
ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు ప్రశాంత్. ఆయనతో పాటు ఆయన అభిమానులను, అన్నలను, డ్రైవర్లను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇక కేసు నుంచి బయటకు వచ్చేందుతు పల్లవి ప్రశాంత్ బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. అయితే ఇంత జరుగుతున్నా... శివాజీ మాత్రం చప్పుడు చేయడం లేదు. హౌస్ లో రైతు బిడ్డను కార్నర్ చేశారంటూ అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంకలపై మండిపడ్డ శివాజీ ఇప్పుడు ఎందుకు మౌనం వహించాడని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

శివాజీ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ప్రశాంత్ కు సపోర్టుగా నిలిచాడు. అతన్ని గెలిపించేందుకు తాపత్రయ పడుతున్నట్లు కనిపించాడు. చివరి వరకు ప్రశాంత్ ను సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అంతే కాదు ఇలా ఆడాలి అలా ఆడాలి అంటూ కోచింగ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడేమో.. ప్రశాంత్ కష్టాల్లో ఉంటే కనీసం స్పందించడం లేదు.
నిన్న శివాజీ ప్రెస్ మీట్ పెడుతున్నట్లు అనౌన్స్ చేసి.. మళ్లీ క్యాన్సిల్ చేసాడు. అయితే ప్రశాంత్ మీద క్వశ్చన్స్ అడుగుతారాని ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇక అయితే శివాజీ పద్దతి చూసిన నెటిజన్స్.. హౌస్ లో ప్రశాంత్ ను అడ్డుపెట్టుకుని ఓ మైండ్ గేమ్ ఆడాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











