Bigg Boss Buzz: హోస్టుగా టాప్ కంటెస్టెంట్ ఫిక్స్.. అసలైనోడినే దింపుతున్నారుగా!

ఎన్నో సందేహాల నడుమ ప్రారంభం అయినా.. చాలా తక్కువ సమయంలోనే సక్సెస్‌ఫుల్ షోగా మారిపోయింది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా.. కొత్త కొత్త గేమ్‌లతో సాగే ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకునే విధంగా సాగుతోంది. అంతేకాదు, నిత్యం గొడవలు, కొట్లాటలు, లవ్వాటలు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల ఎమోషన్స్‌ను కూడా ఇందులో చూపించడంతో మరింత వినోదం దక్కుతోంది. ఇలా ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, ఈ ఏడాది ప్రసారం కానున్న 8వ సీజన్ బజ్ హోస్టును తాజాగా ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఆ వివరాలు మీకోసమే!

అన్ని సీజన్లు.. సూపర్ హిట్ : వేరే భాషల కంటే ఆలస్యంగానే వచ్చినా తెలుగులో నెంబన్ వన్ అయిన షోనే బిగ్ బాస్. అందుకే నిర్వహకులు అస్సలు గ్యాప్ లేకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను ఇది కంప్లీట్ చేసుకుంది. ఇవన్నీ భారీ రేటింగ్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్‌లుగా నిలిచి సత్తా చాటాయి.

Hero Sivaji To Host Bigg Boss Telugu 8 Buzzz Talk Show

ఏడో సీజన్‌ టాప్ రేటింగ్‌తో : ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు సక్సెస్ అవడంతో బిగ్ బాస్ టీమ్ ఇటీవలే ఏడో దానిని మొదలు పెట్టింది. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో వచ్చిన ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఎన్నో ట్విస్టులతో సాగిన ఏడో సీజన్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఈ ఫినాలేకు దేశంలోనే టాప్ రేటింగ్ లభించింది.

ఓటీటీ సీజన్.. ఆపేశారని : బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ సెకెండ్ సీజన్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించి ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో నిర్వహకులు ఉన్నారని తెలిసింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టేశారని అన్నారు. కానీ, ఊహించని విధంగా ఈ సీజన్‌ను రద్దు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

Hero Sivaji To Host Bigg Boss Telugu 8 Buzzz Talk Show

ఎనిమిదో సీజన్ ముందే : బిగ్ బాస్ ఏడో సీజన్ సూపర్ సక్సెస్ అయినా నిర్వహకులు ఓటీటీ వెర్షన్ సీజన్‌ను తీసుకు వచ్చేందుకు మొగ్గు చూపడం లేదట. అందుకే ఎనిమిదో సీజన్‌ను కాస్త ముందుగానే మొదలు పెట్టేందుకు ప్లాన్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మార్చి నుంచే పనులు మొదలుపెట్టాలని చూస్తున్నారట. ఎలాగైనా జూలై లేదా ఆగస్టు నుంచి దీన్ని స్టార్ట్ చేస్తారని టాక్.

బిగ్ బాస్ బజ్ హోస్టుపై : బిగ్ బాస్ సీజన్ నడిచిన ప్రతిసారి 'బిగ్ బాస్ బజ్' అనే టాక్ షోను కూడా నిర్వహిస్తుంటారు. ఇందులో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూలు చేస్తుంటారు. గతంలో తనీష్, రాహుల్ సిప్లీగంజ్, ఆరియానా గ్లోరీ, యాంకర్ రవి, యాంకర్ శివ, గీతూ రాయల్ వంటి వాళ్లు దీన్ని హోస్ట్ చేశారు. ఇప్పుడు ఎనిమిదో సీజన్ కోసం కొత్త హోస్టును తీసుకు రాబోతున్నారు.

Hero Sivaji To Host Bigg Boss Telugu 8 Buzzz Talk Show

టాప్ కంటెస్టెంట్ సెలెక్ట్ : బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మొదలైన తర్వాత ప్రారంభించే బిగ్ బాస్ బజ్ టాక్ షోకు హోస్టుగా ఎవరు ఉంటారన్న దానిపై చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ షోను శివాజి హోస్ట్ చేయబోతున్నాడట. ఈ విషయాన్ని మాజీ కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో రివీల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X