Bigg Boss Guest: ఫినాలేకు ఊహించని హీరో.. చివర్లో చేతులెత్తేసిన నాగార్జున.. ఇది కోలుకోలేని షాకే!

అసలు అంచనాలు లేకుండానే వచ్చినా.. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా.. తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్‌ను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. ఆరంభం నుంచే రికార్డు స్థాయిలో టీఆర్పీని అందుకుంటోన్న ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, ప్రస్తుతం నడుస్తోన్న ఆరో సీజన్ చివరి దశకు చేరడంతో మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. దీనికి గెస్టుగా ఎవరు రాబోతున్నారన్న దానిపై ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

ఒకరు ఔట్.. ఫినాలేలో ఐదుగురే

ఒకరు ఔట్.. ఫినాలేలో ఐదుగురే


ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో మొత్తంగా 15 మంది ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఆరంభంలో ఆరుగురు సభ్యులు మాత్రమే హౌస్‌లో ఉన్నారు. అందులో మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో శ్రీ సత్య వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు కీర్తి భట్, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఆది రెడ్డి మాత్రమే టైటిల్ రేసులో నిలిచారు.

టైటిల్ విజేత అతడే అని టాక్

టైటిల్ విజేత అతడే అని టాక్


బిగ్ బాస్ ఆరో సీజన్‌లో విజేత అయ్యేది ఎవరన్న దానిపై ఆరంభం నుంచీ ఎన్నో రకాల చర్చలు జరిగాయి. కానీ, మొదటి నుంచీ ఈ సీజన్‌లో సింగర్ రేవంత్‌ మాత్రమే విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఫినాలే వీక్‌లో అతడికే ఎక్కువ ఓట్లు పోలయ్యాయని అంటున్నారు. అలాగే, శ్రీహాన్ రెండో స్థానంలో ఉన్నాడని తెలిసింది.

ఈ ఆదివారమే గ్రాండ్ ఫినాలే

ఈ ఆదివారమే గ్రాండ్ ఫినాలే

దాదాపు పదిహేను వారాల పాటు అలరించిన బిగ్ బాస్ ఆరో సీజన్ డిసెంబర్ 18 అంటే ఆదివారంతో పూర్తి కాబోతుంది. రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం కాబోతుంది. దీంతో స్పెషల్ ఎపిసోడ్‌ను ఎంతో సందడిగా జరపనున్నారు. దీని కోసం నిర్వహకులు భారీ ఖర్చు చేయడంతో పాటు ఎన్నో సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

 వాళ్లతో రచ్చ చేసేలా ఏర్పాటు

వాళ్లతో రచ్చ చేసేలా ఏర్పాటు


డిసెంబర్ 18 ఆదివారం జరగబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు మాజీ కంటెస్టెంట్లు రాబోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. అంతేకాదు, వీళ్లలో చాలా మంది ఆటపాటలతో అలరించబోతున్నారని కూడా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయిందని తెలుస్తోంది.

గెస్టుల విషయంలో ప్రచారం

గెస్టుల విషయంలో ప్రచారం


ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌ గ్రాండ్ ఫినాలేకు గెస్టులుగా వచ్చేది ఎవరన్న దానిపై కూడా చాలా రకాల చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. బాలయ్య ఈ ఎపిసోడ్ కోసం వస్తారని అన్నారు. ఆ తర్వాత కూడా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఈ విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు.

 ఫినాలేకు ఆయన మాత్రమే

ఫినాలేకు ఆయన మాత్రమే


బిగ్ బాస్ ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ను గతంలో కంటే ఎక్కువ సర్‌ప్రైజ్‌లతో ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీని కోసం వీలైనంత ఎక్కువ మంది గెస్టులను తీసుకు రాబోతున్నారట. ఇందులో భాగంగానే టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్‌ ఫినాలే రోజు హౌస్‌లోకి రావడంతో పాటు స్టేజ్‌పై చాలా సేపు సందడి చేస్తారని తెలిసింది. అలాగే, మరికొందరు కూడా వస్తారని టాక్.

చేతులెత్తేసిన కింగ్ నాగార్జున

చేతులెత్తేసిన కింగ్ నాగార్జున


వాస్తవానికి బిగ్ బాస్ షో ఫినాలే ఎపిసోడ్ కోసం హోస్ట్ నాగార్జునే స్వయంగా గెస్టులను పిలుస్తూ వస్తున్నాడు. కానీ, ఆరో సీజన్ విషయంలో మాత్రం ఆయన చేతులెత్తేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే షో నిర్వహకులు పెద్ద స్టార్ల కోసం ప్రయత్నం చేసినా విఫలం అయినట్లు తెలిసింది. దీంతో దొరికిన వాళ్లనే తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X