‘దానికి పెళ్లెందుకు... సహజీవనం ఉందిగా’
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కుటుంబంలో ఆయన తనయుడు నాగార్జున తర్వాత సినీరంగ ప్రవేశం చేశారు సుమంత్. ఏఎన్ఆర్ మనవడిగా, నాగార్జున మేనల్లుడిగా ఆయన ఎంట్రీ జరిగింది. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు సుమంత్. అయితే ఆ తర్వాత వరుస పరాజయాలతో రేసులో వెనుకబడ్డారు. ఇటీవలి కాలంలో ఓటీటీలతో తిరిగి సత్తా చాటుతున్నారు సుమంత్. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
2004లో హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లాడారు సుమంత్. అయితే వీరి వైవాహిక బంధం సజావువగా సాగలేదు. పెళ్లయిన ఏడాదికే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పటికీ కీర్తీ నాకు మంచి ఫ్రెండ్ అని.. అప్పుడప్పుడు యోగ క్షేమాలు తెలుసుకుంటూనే ఉంటానని సుమంత్ పలుమార్లు తెలిపారు. నాటి నుంచి ఒంటరిగానే ఉంటున్న సుమంత్.. త్వరలో రెండో పెళ్లి చేసుకుంటారని పలుమార్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని ఆయన ఖండించారు. తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి హాజరైన సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.

తొలుత శ్రీదేవి డ్రామా కంపెనీ వారి వివాహ ఆహ్వాన శుభపత్రిక.. సాయి చేతన్‌కు చరిష్మతో వివాహం చేస్తున్నట్లు ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు ముహూర్తం నిశ్చయించినట్లు చూపించారు. ఆ వెంటనే బుల్లితెర ప్రముఖులు వధూవరులను పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి చేస్తుండగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చరిష్మ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. తాళి కట్టించుకోవడానికే తలదించుకున్నాను.. ఇలా జీవితాంతం తలదించుకోవాల్సి వస్తే అని చరిష్మా అడగ్గా.. నాకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. తాళి కట్టేముందే బెండ్ అయ్యా.. అదే పెళ్లయితే లైఫ్ లాంగ్ బెండ్ కావాల్సిందేనని చెప్పగా వధూవరుల కుటుంబాలు గొడవపడతాయి.
ఇంతలో నటుడు పృథ్వీ బబ్లూ ఎంట్రీ ఇస్తాడు. 2 నిమిషాలు లేటైంది నేను రాలేదని పెళ్లే ఆపేస్తావా అంటూ పంచ్‌లు విసురుతాడు. ఆ వెంటనే బబ్లూకి రష్మి ఇచ్చిన టాస్క్‌లో అతను ఫెయిల్ అవుతాడు. మ్యారేజ్ లైఫ్‌లో ఒక లా గురించి చెప్పాలంటే ఏం చెబుతారని అవసరాల శ్రీనివాస్‌ని రష్మి అడగ్గా.. మీకు ఎలా చెబితే అలా చేసుకుంటూ పోవాలని అంటాడు. తర్వాత పండు, టేస్టీ తేజాలు తమ స్కిట్స్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు. అనంతరం నటుడు రవివర్మ మాట్లాడుతూ... నాకు వంట రాదు, పాపం కష్టపడి వాళ్లు వంట చేస్తారు కాబట్టి గిన్నెలు నేనే తోముతానని చెప్పడంతో అంతా నవ్వేస్తారు.
అనంతరం రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత... అవసరాల శ్రీనివాస్ - ఆటో రాంప్రసాద్‌లతో కలిసి ఓ పంచాయతీ పెడతాడు పృథ్వీ. కడుపునిండా తిండి కావాలంటే పెళ్లి చేసుకుంటే పెళ్లాలు వండి పెడతారు కదా అంటుంది సుజాత. జైలుకెళ్తే ఖైదీలకు కూడా కడుపు నిండా వండిపెడతారని అవసరాల పంచ్ విసురుతాడు. తర్వాత ఇద్దరూ పెళ్లి గురించి కొట్టుకుంటూ ఉండగా.. మీకు వయసొచ్చిన తర్వాత మీకు తోడు కావాలి, మీకొక తోడు కావాలంటే లగ్గం చేసుకోవాలని చెబుతుంది సుజాత. అలా లగ్గం చేసుకుంటే తోడు పెరుగుకు కూడా మనల్నే పంపిస్తారని అంటాడు అవసరాల శ్రీనివాస్. పెళ్లి చేసుకుంటే చిలకా గోరింకల లాగా ఒకే ఇంట్లో చాలా హ్యాపీగా ఉండొచ్చని రాకేష్ అంటాడు.. ఆ వెంటనే సుమంత్ మాట్లాడుతూ దానికి లివ్ ఇన్ ఉంది కదా అని కౌంటర్ వేస్తాడు. జడ్జి పృథ్వీ కూడా లివింగ్ మంచిదే కదా అని అనడంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


