బిగ్‌బాస్ ఇంట్లో సిల్లీ ఫెలోస్.. డీఎన్‌ఏ టెస్ట్ చేయించాన్న దీప్తి.. పెద్దరాయుడిలా నాని!
ఆదివారం బిగ్‌బాస్ ఇళ్లు సందడి సందడిగా, అల్లరి అల్లరిగా మారబోతున్నట్టు స్పష్టమవుతున్నది. ఈ రోజు ఇంట్లో జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్ చూస్తూ ఆదివారం ఇంట్లో జోష్ రెండింతలు పెరిగినట్టు కనిపిస్తున్నది.
సిల్లీఫెలోస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సునీల్, నరేష్ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇంటి సభ్యులతో సంతోషంగా గడిపినట్టు కనిపించింది. నరేష్‌ను నానీ బాగానే ఆటపట్టించినట్టు అర్దమైంది. ఇక ఈ రోజు నాని పెద్దరాయుడిలా మారిపోయాడు.

ఇంట్లో ఏదో మాటల సందర్భంగా జలుబుకు డీఎన్ఏ టెస్ట్ చేయించాలని దీప్తి అనడంతో .. జలుబుకు డీఎన్ఏ టెస్టా అంటూ నాని తలపట్టుకొన్నాడు. విజయవాడ వాళ్లు అంతే అంటూ నాని సెటైర్ వేశాడు.
నరేష్‌కు, సునీల్‌కు గుమ్మడికాయలు పగలగొట్టే పోటీ నిర్వహించాడు. వీరిద్దరూ మోకాలి మీద గుమ్మడి కాయలు పగలకొట్టాలనే షరతు విధించాడు. దాంతో ఇద్దరి మధ్య జరిగిన పోటీలో సునీల్ విజయం సాధించాడు.
ఎవడు పుట్టగానే ఆస్తి రూ.5 కోట్లు అయ్యాయో అంటూ నరేష్.. ఏదో చెప్పబోయి తడబడిన అమిత్.. నసపెట్టి చంపిన గీతామాధురి అంశాలు ఈ రోజు హుషారును కలిగించేలా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











