మొట్ట మొదటిసారిగా నోరు విప్పిన తరుణ్.. బిగ్ బాస్ 4పై ఊహించని రియాక్షన్!!

బిగ్ బాస్ షోపై అధికారిక ప్రకటన వచ్చిన తరువాత ఒక్కసారిగా సోషల్ మీడియా వేడెక్కింది. త్వరలోనే ఆట మొదలవుతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. షో గురించి ప్రకటన రావడంతోనే.. పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అందులో హీరో, హీరోయిన్ల పేర్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా లవర్ బాయ్ తరుణ్ గురించి నిత్యం వచ్చిన వార్తలపై ఓ క్లారిటీ వచ్చింది.

అధికారిక ప్రకటన..

అధికారిక ప్రకటన..

బిగ్‌బాస్ నాల్గొ సీజన్‌పై గత కొన్ని రోజులుగా నిత్యం ఏవో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. త్వరలో ప్రారంభం కాబోతోంది, కంటెస్టెంట్లు వారే, ఆ హీరోలు, హీరోయిన్లు పార్టిసిపేట్ చేయబోతోన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అవన్నీ కాసేపు పక్కనబెడితే.. నాల్గో సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతోందని నిన్ననే అధికారికంగా ప్రకటించారు.

లిస్ట్ వైరల్..

లిస్ట్ వైరల్..

ఇక అఫీషియల్ ప్రకటన రావడమే ఆలస్యం.. నాల్గో సీజన్ కంటెస్టెంట్ల లిస్ట్ ఇదేనంటూ ఓ జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందులో హీరో తరుణ్ పేరు ఎన్నో రోజుల నుంచి వస్తూనే ఉంది. అయితే తాజాగా తన బిగ్ బాస్ ఎంట్రీపై తరుణ్ అఫీషియల్ నోట్ విడుదల చేశాడు.

ఆసక్తి లేదు..

ఆసక్తి లేదు..

గత కొన్ని రోజులుగా వస్తోన్న బిగ్ బాస్ వార్తలపై తాజాగా తరుణ్ స్పందించాడు. ఈ మేరకు ఓ ప్రకటన చేశాడు. ‘హలో ఎవ్రీవన్.. ఇలాంటి క్లిష్ట సమయంలో మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నా.. సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్స్‌లో వస్తోన్న రూమర్స్ గురించి నేను ఓ క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. బిగ్‌బాస్‌లో నేను పాల్గొనబోతోన్నాననే వార్తలు అవాస్తవం. మరోసారి నేను క్లారిటీ ఇవ్వదలచాను. నాకు ఆ షోతో ఎలాంటి సంబంధం లేదు. అసలు నాకు ఆ షో అంటేనే ఆసక్తి లేదు.

Recommended Video

Parannageevi First Song | ఈ పాట RGV గనక వింటే అంతే సంగతి
కేవలం రూమర్సే..

కేవలం రూమర్సే..

అవి కేవలం రూమర్సే. ఆ తప్పుడు వార్తలను మీరు నమ్మొద్దు. జాగ్రత్తగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి. మీ అందరి ప్రేమ, మద్దతుకి ధన్యవాదాలు' అని బిగ్ బాస్ వార్తలను ఖండించాడు. మరి మిగతా వారు కూడా రియాక్ట్ అవుతారో లేదో చూడాలి. మొత్తానికి బిగ్ బాస్ వార్తలు సోషల్ మీడియాను వేడెక్కిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X