twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ 3 అప్‌డేట్: భాగం కాబోతున్న లవర్ బోయ్.. సర్‌ప్రైజింగ్ రోల్

    |

    Recommended Video

    Bigg Boss Telugu Season 3 : Tollywood Lover Boy To Enter Into Bigg Boss House || Filmibeat Telugu

    బుల్లితెరకు బాగా దగ్గరైన షోస్ లో బిగ్ బాస్ షో ముందు వరుసలో ఉంటుంది. రియాలిటీ షోస్ పరంగా అన్ని భాషల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న బిగ్ బాస్.. సదరు టీవీ ఛానల్స్ టీఆర్పీ రేటింగ్స్ అమాంతం పెంచేసింది. బిగ్ బాస్ షో స్టార్ట్ అయిందంటే చాలు ఇంటిల్లిపాది ఒక్కటై బుల్లితెర ముందు ఎంజాయ్ చేస్తుండటం గమనించాం. ప్రత్యేకించి తెలుగు బిగ్ బాస్ విషయానికొస్తే.. ఇప్పటికే రెండు సీజన్స్ ద్వారా ఆకట్టుకున్న ఈ షో మూడో సీజన్ కోసం రెడీ అయింది. అయితే ఈ షో వివరాలపై రోజుకో ఆసక్తికర పేరు వినిపిస్తుండటం బుల్లితెర ఆడియన్స్ లో ఆత్రుత నింపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా లవర్ బోయ్ తరుణ్ పేరు బయటకు వచ్చింది.

     అమ్మాయిల గుండెలను కొల్లగొట్టిన తరుణ్.. ప్రస్తుతం

    అమ్మాయిల గుండెలను కొల్లగొట్టిన తరుణ్.. ప్రస్తుతం

    చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న తరుణ్.. పెద్దయ్యాక హీరోగా నటించి అమ్మాయిల గుండెలను కొల్లగొట్టాడు. లవర్ బోయ్‌గా వెండితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆయనకు సరైన ఆఫర్స్ లేకపోవడంతో వ్యాపార సంబంధమైన కార్యక్రమాలతో బిజీ అయిపోయాడు తరుణ్.

    ఇంతలో బిగ్ బాస్ 3 కోసం అప్రోచ్

    కాగా త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 3 లో పార్టిసిపెంట్‌గా ఉండాలని తరుణ్‌ని అప్రోచ్ అయ్యారట బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే అందుకు తరుణ్ సుముఖత వ్యక్తం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో వచ్చిన బిగ్ బాస్ 2 పార్టిసిపెంట్ లిస్టులో కూడా తరుణ్ పేరు వినిపించింది. కానీ ఆ తర్వాత అది రూమర్ అని తరుణ్ కొట్టిపారేశాడు. దీంతో ఈ సారైనా తరుణ్ పార్టిసిపేట్ చేస్తున్నాడా? లేక ఇది కూడా రూమరేనా? అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి.

    రేణు దేశాయ్, బండ్ల గణేష్, శ్రీముఖి

    రేణు దేశాయ్, బండ్ల గణేష్, శ్రీముఖి

    ఇదిలా ఉంటే ఇప్పటికే బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్ లిస్టులో ఆసక్తికర పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, సేసెషనల్ కామెడీ స్టార్ బండ్ల గణేష్, హాట్ యాంకర్ శ్రీముఖి ఉండనున్నారని తెలియడంతో బుల్లితెర ఆడియన్స్‌ యమ ఆతృతగా ఉన్నారు. దీనికి తోడు తాజాగా వినిపిస్తున్న తరుణ్ పేరు వారి ఆతృతను రెట్టింపు చేసింది.

    హోస్ట్ అంటారా..?

    హోస్ట్ అంటారా..?

    ఇక బిగ్ బాస్ 3 హోస్ట్ విషయానికొస్తే కింగ్ నాగార్జున పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనే ఈ సారి బిగ్ బాస్ డీల్ చేయడమనేది దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే మొదటి సీజన్ లో ఎన్టీఆర్, రెండో సీజన్ లో నాని దుమ్మురేపారు. ఇక ఇప్పుడు నాగార్జున వంతు వచ్చేసింది. హోస్ట్ గా నాగార్జున వెరీ సూటబుల్ అని జనం కూడా చెప్పుకుంటున్నారు.

    బిగ్ బాస్ 3 ప్రోమో

    బిగ్ బాస్ 3 ప్రోమో

    మరి కొద్ది రోజుల్లోనే ఈ షో ప్రారంభం కానుండటంతో.. ముందుగా ఈ షో అఫీషియల్ ప్రోమో రిలీజ్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇది ముగిసిన వెంటనే 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 3 మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలై 21 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది.

    English summary
    Big Boss season 3 will starts in july ending or september first week. In this show Sreemukhi, Renu Desai and Tarun Kumar participeted as participents as per latest news.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X