హైపర్ ఆది నోటి దురుసు.. స్టార్ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగిందంటే?
హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఆయన చుట్టూ నడిచే వివాదాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. హైపర్ ఆది కి ఓ స్టార్ హీరోయిన్ తో గొడవ జరగగా, ఆ హీరోయిన్ ఆది మళ్లీ నోరు తెరవకుండా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మరి వీళ్ళిద్దరికీ ఏ విషయంలో గొడవ జరిగింది? స్టార్ హీరోయిన్ రిప్లై ఏంటి అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
బుల్లితెర ప్రేక్షకుల నుంచి వెండి తెర ప్రేక్షకుల దాకా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మూవీ లవర్స్ కు బాగా పరిచయం ఉన్న ఫేస్ హైపర్ ఆది. టైమింగ్ తో పాటు కామెడీ పంచులకు పెట్టింది పేరు ఆది. ఈ కమెడియన్ వేసే జబర్దస్త్ పంచులకు కడుపుబ్బ నవ్వుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. హైపర్ ఆది ప్రస్తుతం చేస్తున్న షోలలో ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కూడా ఒకటి.

ఈ సీజన్లో సెలబ్రిటీలు పోటీ పడబోతున్నారు. హైపర్ ఆదితో పాటు శ్రీ సత్య టీం లీడర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ప్రతి ఎపిసోడ్ లో సెలబ్రిటీలు అతిథులుగా వచ్చి సంఘటన చేస్తారు. ఇక గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్ తో పాటు స్టార్ హీరోయిన్ హన్సిక కూడా ఈ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఈ షోకి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమోలో హీరోయిన్ హన్సిక, హైపర్ ఆది మధ్య గొడవ జరిగినట్టుగా చూపించారు.
గొడవ అంటే అదేదో సీరియస్ మేటర్ కాదు. షోలో భాగంగా ఫన్నీగా ఇద్దరూ ఒకరిపై ఒకరు పంచులు వేసుకున్నారు. అయితే హన్సిక ఏమాత్రం తగ్గకుండా హైపర్ ఆది నోరు మూయించింది. ఆమె వేసే పంచులకి హైపర్ ఆది తిరిగి మాట్లాడలేకపోయాడు. షోలో ఉన్న వారందరూ నవ్వులే నవ్వులు. ఇక వీళ్లిద్దరి మధ్య ఎలాంటి పంచులు నడిచాయి అంటే..

హన్సిక నాకు ఇది నచ్చలేదు అంటూ ఆది డైలాగ్ కొట్టగా, డోంట్ జడ్జ్ ద జడ్జ్ జడ్జ్ విల్ జడ్జ్ యు అంటూ బాలయ్య రేంజ్ లో డైలాగ్ చెప్పింది. దీంతో హైపర్ ఆది అదసలు అర్థం కాలేదు అన్నట్టుగా నోరు వెళ్ళబెట్టాడు. వెంటనే క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా హన్సిక అందుకొని డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ట్రబుల్ యు అంటూ మరో డైలాగ్ కొట్టగా అందరూ నవ్వేశారు. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య నడిచిన ఈ ఫన్నీ కన్వర్జేషన్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
వీడియోను పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే భారీ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఇదంతా చూస్తుంటే హన్సిక ఇక సినిమాలు వదిలేసి షోలకే పరిమితం అయిపోయేలా కనిపిస్తోంది. జడ్జిగా ఆమె అన్ లిమిటెడ్ గా ఎంటర్టైన్ చేస్తుండడంతో బుల్లితెర ప్రేక్షకులకి ఈ బ్యూటీ మరింతగా దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లయ్యాక హన్సికకు అవకాశాలు తగ్గిన విషయం తెలిసిందే. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా కలిసి రావట్లేదు. ఏదైతేనేం బుల్లితెరపై అడుగు పెట్టి తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతోంది ఈ మిల్కీ బ్యూటీ.


Click it and Unblock the Notifications











