Lahari Shari in Bigg Boss Telugu 5: వాళ్లను చూస్తే అలాంటి మూడ్ రావడం లేదు.. స్కూల్ పిల్లల్ని పంపించారేంటో అంటూ

Photo Courtesy: Disney+hotstar and Star Maa

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 5లో ఇంటి సభ్యులు తొటి కంటెస్టెంట్స్‌తో తమ భావాలను పంచుకొనే ప్రయత్నంలో పడ్డారు. ఇంటిలో సభ్యుల తీరు, వారి హావభావాల గురించి చెప్పకొంటూ కంటెస్టెంట్ల గురించి బేరిజు వేసుకొనే పనిలో ఉన్నారు. ఇంటిలోకి వెళ్లిన సభ్యులు ఆ వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తూనే తమ స్ట్రాటజీలు అమలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ లహరి షారి, ఆర్జే కాజల్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. తాజా ఎపిసోడ్‌లో లహరి షారి చెప్పిన విషయాలు ఏమిటో చూద్దాం పదండి..

పెళ్లి గురించి ఆలోచించడం లేదు

పెళ్లి గురించి ఆలోచించడం లేదు

లహరి షారితో ఆర్జే కాజల్ ముచ్చటిస్తూ.. పెళ్లి ప్రస్తావన తెచ్చింది. పెళ్లి గురించి ఏం మాట్లాడారు అని కాజల్ అడిగితే.. దాని గురించి ఆలోచించడం లేదు. కంగారు ఏమీ లేదు. అంత తొందర కూడా ఏమిలేదు. నేను ఎవరిని సెలెక్ట్ కూడా చేసుకోలేదు అని లహరి షారి సమాధానం చెప్పింది. అయితే ఇక్కడ ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారా అంటే.. నాకు ఎవరితో కనెక్టింగ్ ఫీలింగ్ రాలేదంటే.. ఒక్కరోజే కదా.. ఆ ఫీలింగ్ వస్తుంది అంటూ లహరి షారితో కాజల్‌ అంటూ కనిపించింది.

అప్పుడే బ్రేకప్ చెప్పావా?

అప్పుడే బ్రేకప్ చెప్పావా?

లహరి షారి ఇంటిలోని అబ్బాయిల గురించి మాట్లాడుతూ.. వీజే సన్నీతో నాకు బయట మంచి పరిచయం ఉంది. చిల్ క్యారెక్టర్. నాకు బ్రదర్ లాంటి క్యారెక్టర్ అంటూ లహరి షారి చెబుతుంటే.. ఓహో.. అప్పడే బ్రేకప్ చేశావా? అంటూ కాజల్ నవ్వుల్లో మునిగిపోయింది. దాంతో అలా అయితే.. వీజే సన్నీకి చాలా మంది బ్రేక్ చూసి ఉంటారు. సన్నీ భయ్యాను చూస్తే హార్ట్ టచింగ్ ఫీలింగ్స్ ఏమీ రావు. అతడు బేసిగ్గా చిల్ క్యారెక్టర్ అంటూ లహరి షారి చెప్పుకొంటూ పోయారు.

శ్రీరామచంద్రను చూస్తే అలాంటి ఫీలింగ్ లేదు

శ్రీరామచంద్రను చూస్తే అలాంటి ఫీలింగ్ లేదు

ఇక సింగర్ శ్రీరామచంద్ర గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. విశ్వ అల్రెడీ మ్యారీడ్. నటరాజ్ మాస్టర్‌కు కూడా పెళ్లి అయిపోయింది. యాంకర్ రవిగారికి పెళ్లి అయిపోయింది. హార్ట్‌లో ఫీలింగ్ రావడానికి ఇంకా ఇంటిలో ఎవరు ఉన్నారు అని లహరి షారి అంటే.. ఇంకా ఎవరున్నారు.. అంతా అయిపోయింది అంటూ కాజల్ కూడా అనడం కనిపించింది.

 ఆ వైబ్రేషన్స్ లేవు అంటూ లహరి షారి

ఆ వైబ్రేషన్స్ లేవు అంటూ లహరి షారి

ఇక శ్రీరామచంద్రను చూస్తే ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఆయనను చూస్తే ఎలాంటి వైబ్రేషన్స్ కూడా కలుగలేదు. మీరే చూస్తున్నారు కదా.. ఆయనతో ఎలా మాట్లాడానో.. అందరితో మాట్లాడినట్టే నేను ఆయనతో మాట్లాడాను. అంతకంటే ఎక్కువగా ఫీల్ అయ్యింది లేదు. చూద్దాం ఏం జరుగుతుందో అంటూ లహరి షారి తన మనసులోని మాటను బయటపెట్టింది.

Recommended Video

Bigg Boss Telugu 5 కు నాగార్జున రెమ్యూనరేషన్ అన్ని కోట్లా ? || Filmibeat Telugu
 వాళ్లు స్కూల్ పిల్లల మాదిరిగా ఉన్నారంటూ..

వాళ్లు స్కూల్ పిల్లల మాదిరిగా ఉన్నారంటూ..

అయితే లహరి షారి మాటలు విన్న కాజల్ ఆ చర్చను మరింత పొడిగిస్తూ.. షోలోకి పెళ్లి అయిన వారిని కాకుండా సింగిల్స్, బ్యాచ్‌లర్స్‌ను తీసుకురావాల్సింది అని కాజల్ అంటే.. అవును సింగిల్స్‌ కోసం సింగిల్స్‌ను తీసుకొచ్చారు. కానీ కనెక్ట్ అవ్వడం లేదు అని లహరి షారి అని అంటే.. జస్వంత్, వీజే సన్నీ, శ్రీరామచంద్ర ముగ్గురు సింగిల్స్ ఉన్నారు అని కాజల్ చెప్పింది. అయితే సన్నీ, మిగితా వాళ్లను చూస్తే.. స్కూల్ పిల్లల మాదిరిగా ఉన్నారు. పొరపాటున బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాడేమో అనిపిస్తున్నది అని లహరి షారి అంటే.. కాజల్ నవ్వుల్లో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X