అమెరికా రోడ్లపై అడుక్కుతింటున్న అలనాటి స్టార్ హీరోయిన్.. అసలు విషయం చెప్పి షాక్!

అలనాటి అందాల తార.. లయ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అచ్చమైన తెలుగమ్మాయి. ఏపీలో విజయవాడకు చెందిన ఈ క్యూట్ బ్యూటీ సినిమాలపై తనకు ఉన్న ఆసక్తితో హీరోయిన్ గా మారింది. ఆమె ఇంటర్ లో ఉండగానే స్వయంవరం సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అలా తొలి చిత్రంతోనే విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం ఆమెరికాలో సెటిల్ అయిపోయింది.

అయితే అమెరికాలో ఉన్న లయ అక్కడి రోడ్లపై అడుక్కు తింటుందంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అలాగే తినేందుకు డబ్బులు కూడా అనేక పనులు చేస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆ వార్తలపై స్పందించింది. అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన ఆమె షాకింగ్ విషయాలు చెప్పింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Heroine Laya Reveal Secrets Behind She Begging in Roads of America Check Details

భద్రం కొడుకో సినిమాలో బాల నటిగా చేసిన లయ స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ప్రేమించు, మనోహరం, మనసున్న మారాజు, నీ ప్రేమకై, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, దొంగరాముడు, పెళ్లాంతో పనేంటి, దేవుళ్లు, ఎంత బావుందో, గెలుపు, కోదండరాముడు, నేను పెళ్లికి రెడీ, కొండవీటి సింహాసనం, మా ఆవిడమీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది, మా బాలాజీ, నాలో ఉమ్మ ప్రేమ, నువ్వు లేక నేను లేను, రామ చిలక, రామ్మా చిలకమ్మా, రామ సక్కనోడు, శివరామరాజు, మహాచండి. అదిరిందయ్యా చంద్ర, విజయేంద్ర వర్మ, స్వరాభిషేకం, టాటా బిర్లా మధ్యలో లైలా, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

అయితే కెరియర్ పీక్స్ లో ఉండగానే.. అమెరికాలో స్థిరపడ్డి ఓ వ్యాపారిని పెళ్లి చేసుకుంది. 2006లో వీరికి వివాహం జరిగింది. అయితే భర్తతో కలిసి ఉండాలని అమెరికా వెళ్లిపోయిన ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక ఆ తర్వాత నుంచి తెరమరుగు అయిన ఈమెపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అమెరికాలో అడుక్కు తింటుందని ప్రచారం సాగింది. అయితే తాజాగా ఈ వార్తలపై లయ స్పందించింది. అలీతో సరదాగా షోకు వచ్చిన ఈమె అనేక విషయాల గురించి మాట్లాడింది. ముఖ్యంగా తన భర్త, అమెరికాలో తన లైఫ్ స్టైల్ గురించి చెప్పుకొచ్చింది.

Heroine Laya Reveal Secrets Behind She Begging in Roads of America Check Details

తాను ఇక్కడ లకపోవడంతో.. తనపై అనేక రకాల వార్తలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. అవన్నీ అబద్ధాలే అని.. తన భర్త ఓ బిజినెస్ మేన్ అని చెప్పుకొచ్చింది. మరీ అంతగా ఆస్తులు లేకపోయినా... అడుక్కు తినే స్థాయికి మాత్రం ఎప్పుడూ రాలేదని స్పష్టం చేసింది. అసలు ఎందుకిలా ఫేక్ వార్తలు సృష్టించి అందరికనీ జనాలు ఇబ్బంది పెడతారో కూడా తనకు అర్థం కాదంటూ చెప్పుకొచ్చింది. పూర్తి వివరాలు తెలియాలంటే 24వ తేదీ రోజు వచ్చే ఈ పూర్తి ఎపిసోడ్ ను చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X