For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రీముఖిపై ప్రముఖ హీరోయిన్ సంచలన పోస్ట్: ఆమె బాడీ, డ్రెస్‌లు గురించి షాకింగ్‌గా!

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా సందడి చేస్తోన్నా.. వాళ్లందరిని వెనక్కి నెట్టేసేలా వరుసగా షోల మీద షోలు చేస్తూ హవాను చూపిస్తూ దూసుకుపోతోంది బోల్డు బ్యూటీ శ్రీముఖి. మరెవరికీ సాధ్యం కాని రీతిలో ఏకకాలంలో పదుల సంఖ్యలో కార్యక్రమాలు చేస్తోన్న ఈ చిన్నది.. తనకు తానే సాటి అని చాటి చెప్పుకుంటోంది. అదే సమయంలో ఆ షోలలో వేసుకునే డ్రెస్‌లతోనూ యమ హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో శ్రీముఖి ధరించిన డ్రెస్‌పై ప్రముఖ హీరోయిన్ మాధవి లత షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ సంగతులు మీకోసమే!

  అలా ఎంట్రీ... ఫుల్ పాపులర్

  అలా ఎంట్రీ... ఫుల్ పాపులర్

  శ్రీముఖి 'జులాయి' అనే సినిమాతో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో ఎంతో ముఖ్యమైన పాత్రల్లో నటించింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ చేసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుని ఫుల్ పాపులర్ అయింది.

  గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

  ఇప్పుడు షోలు, సినిమాలతో

  ఇప్పుడు షోలు, సినిమాలతో

  సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే శ్రీముఖి 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా మారింది. దీని తర్వాత 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలు చేసింది. ఇలా చాలా కాలంగా టీవీ షోలు చేస్తూ బిగ్ బాస్ తర్వాత నుంచి సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

  శ్రీముఖి రచ్చ.. ఎన్నో షోలు

  శ్రీముఖి రచ్చ.. ఎన్నో షోలు

  ఈ మధ్య కాలంలో యాంకర్ శ్రీముఖి చేతి నిండా ఆఫర్లతో హవాను చూపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఉన్న ఛానెళ్లు అన్నింట్లోనూ ఆమె సందడి చేస్తోంది. అలాగే, సినిమాలు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలోనూ భాగం అవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'జాతి రత్నాలు', 'మిస్టర్ అండ్ మిస్సెస్', 'సారంగ దరియా', 'స్టార్ మా పరివార్' వంటి షోలు చేస్తోంది.

  Kajal Aggarwal: భర్తతో కాజల్ అగర్వాల్ రొమాన్స్.. ఏకంగా పెదాలను లాక్ చేసి మరీ!

  బీబీ జోడీ అంటూ మరో షో

  బీబీ జోడీ అంటూ మరో షో


  ఇప్పటికే ఎన్నో షోలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయిన శ్రీముఖి.. ఇటీవలే 'బీబీ జోడీ' అనే మరో డ్యాన్స్ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బిగ్ బాస్ సీజన్లలో కంటెస్టెంట్లుగా వచ్చిన సెలెబ్రిటీలను జంటలుగా మార్చి పోటీ నిర్వహిస్తున్నారు. దీనికి రాధ, సదా, తరుణ్ మాస్టర్‌లు జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని గత వారామే లాంచ్ చేశారు.

  హాట్ డ్రెస్‌తో.. తెగ హైలైట్

  హాట్ డ్రెస్‌తో.. తెగ హైలైట్


  'బీబీ జోడీ' షోలో భాగంగా వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. ఇందులో యాంకర్ శ్రీముఖి బుల్లి నిక్కరు మాత్రమే ధరించి కనిపించింది. దీంతో ఈమె వేసుకున్న ఈ డ్రెస్ ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోంది. చాలా మంది దీనిపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఫలితంగా శ్రీముఖి పేరు విపరీతంగా మారుమ్రోగిపోతోంది.

  యాంకర్ రష్మీ గుట్టురట్టు చేసిన కమెడియన్: ఆ పని చేసి డబ్బు సంపాదిస్తుందంటూ షాకింగ్‌గా!

  శ్రీముఖిపై హీరోయిన్ పోస్టు

  శ్రీముఖిపై హీరోయిన్ పోస్టు

  'బీబీ జోడీ' షోలో యాంకర్ శ్రీముఖి ధరించిన షార్ట్ డ్రెస్‌పై సామాన్యులే కాకుండా సెలెబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ మేరకు తెలుగు హీరోయిన్ మాధవి లత దీనిపై తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ కూడా పెట్టింది. అందులో శ్రీముఖి బాడీకి ఆ డ్రెస్ సెట్ కాలేదు అంటూ కామెంట్ చేసింది. అలాగే, కొన్ని విలువైన సలహాలను కూడా ఇచ్చింది. దీంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది.

  నీ బాడీకి సెట్ కావు అంటూ

  నీ బాడీకి సెట్ కావు అంటూ

  మాధవి లత తన పోస్టులో 'శ్రీ.. నువ్వు మోడ్రన్, అల్ట్రా మోడ్రన్ డ్రెస్‌లు వేసుకో. కానీ, అవి నీ బాడీకి సెట్ అయ్యేలా చూసుకో. కళ్లకు నచ్చితే కాదు.. బాడీకి నప్పాలి. అప్పుడు చూడ్డానికి బాగుంటుంది' అంటూ చెప్పుకొచ్చింది. తద్వారా ఈ షార్ట్ డ్రెస్ శ్రీముఖికి అస్సలు సెట్ కాలేదని ఆమె అభిప్రాయపడింది. దీంతో మాధవి లత పోస్టును చాలా మంది షేర్ చేస్తున్నారు.

  English summary
  Actress and Television Presenter Sreemukhi Wear Short Dress in BB Jodi Show. Now Heroine Maadhavi Latha Did Shocking Post on her Dress.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X