Bigg Boss Telugu ఎన్టీఆర్ బెస్ట్ హోస్ట్.. నాగార్జున భరించలేకపోతున్నారు.. మాధవీలత మండిపాటు

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు 5 షో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. గతవారం కంటెస్టెంట్ మెడలో ఓ బోర్డు వేసి శిక్షించిన తీరుపై సోషల్ మీడియాలో దారుణంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అనాగరిక చర్య అంటూ సినీ నటి మాధవీలత ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో ఆమె ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. హోస్ట్ నాగార్జునను పరుష పదజాలంతో తప్పుపట్టారు. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

హోస్ట్ అంటే జడ్జీలా వ్యవహరించాలి

హోస్ట్ అంటే జడ్జీలా వ్యవహరించాలి

ఏడాదిలో ఏదైనా షో చూస్తానంటే అది బిగ్‌బాస్. అయితే ఆ షోను ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాను. అయితే హోస్ట్ నాగార్జున తీరు చూస్తే నాకు నచ్చడం లేదు. హోస్ట్ అంటే జడ్జిలా వ్యవహరించాలి. షోలోని కంటెస్టెంట్లు తప్పు చేస్తే వారిని సరిదిద్దాలి. అయితే ఆయన వ్యవహారం అలా కనిపించడం లేదు. కేవలం ఇద్దరు, ముగ్గురు కంటెస్టెంట్లకు సపోర్ట్ చేస్తూ కొందరిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తున్నది. ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదవి వెళ్లిపోతున్నారు అంటూ మాధవీలత కామెంట్ చేసింది.

ఎన్టీఆర్ చక్కగా డీల్ చేశారంటూ ..

ఎన్టీఆర్ చక్కగా డీల్ చేశారంటూ ..

బిగ్‌బాస్ షోలో ఏదైనా ఇష్యూ వస్తే గతంలో ఎన్టీఆర్ చాలా చక్కగా డీల్ చేసేవారు. నాని కూడా ఫర్వాలేదు. నాగార్జున విషయానికి వస్తే హోస్ట్‌గా కాకుండా మన్మథుడిలా బిహేవ్ చేస్తున్నాడు. ఇంటిలో అనాగరికంగా టాస్కులు జరుగుతున్నాయి. వాటిని భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోగా సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి చర్యలు సరికావు. నాగార్జున లాంటి హీరో అలాంటి వాటిని సమర్ధిస్తే ఆయన ఫ్యాన్స్ కూడా ఆచరించే ప్రమాదం ఉంది అంటూ మాధవీలత ఆందోళన వ్యక్తం చేశారు.

కంటెస్టెంట్‌ మెడలో బోర్డు వేసి..

కంటెస్టెంట్‌ మెడలో బోర్డు వేసి..

పాతకాలంలో కొన్ని శిక్షలు అత్యంత అనాగరికంగా ఉండేవి. ఏదైనా తప్పు చేస్తే మెడలో బోర్డు వేసి ఊరేగించే వారు. అలాంటి శిక్షనే ఇటీవల బిగ్‌బాస్ షోలో ఓ వ్యక్తికి వేశారు. జాతీయ ఛానెల్ అని చెప్పుకొనే టెలివిజన్‌లో ఇలాంటి శిక్షలు సమర్ధనీయమా? అప్పడం అనే వివాదంపై నాగార్జున చాలా సిల్లీగా వ్యవహరించారు. కంటెస్టెంట్‌కు నేను పాపిని అనే విధంగా దారుణమైన శిక్ష విధించారు అంటూ మాధవీలత విరుచుకుపడ్డారు.

జడ్జిమెంట్ లేకపోతే హోస్ట్‌గా ఎందుకు?

జడ్జిమెంట్ లేకపోతే హోస్ట్‌గా ఎందుకు?

హీరోగా ఏదైనా సినిమా చేయాల్సి వస్తే.. స్క్రిప్టును డిసైడ్ చేసే నాగార్జున.. ఒకవేళ బిగ్‌బాస్ నిర్వాహకులు స్క్రిప్టు ఇస్తే చదివేసి వెళ్తారా? అలా స్క్రిప్టు చదవడానికి ఆయన న్యూస్ రీడర్ కాదుగా.. ఒకవేళ అలా స్క్రిప్టు చదువుకోవాల్సి వస్తే టీవీలకు వచ్చి న్యూస్ చదువుకోండి. ఏదైనా వివాదం వస్తే దానిని ఎపిసోడ్ ఉంటే.. దానిని పక్కాగా చూసి జడ్జిగా వ్యవహరించాలి. అలాంటి జడ్జిమెంట్ ఉంటేనే హోస్ట్‌గా కొనసాగాలి అంటూ నాగార్జునకు మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

బిగ్‌బాస్‌లో మితిమీరుతున్న ముద్దులు

బిగ్‌బాస్‌లో మితిమీరుతున్న ముద్దులు

బిగ్‌బాస్ తెలుగు 5లో ముద్దులు, హగ్గులు మితిమీరి పోతున్నాయి. ఇద్దరు కంటెస్టెంట్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇంటిలో ఫ్యామిలీతో కలిసి చూడటానికి ఇబ్బందిగా ఉంది. అలాంటి వాటిపై నాగార్జున చర్య తీసుకోవాలి. కానీ అలాంటి చర్యలు తీసుకొంటున్నట్టు కనిపించడం లేదు అని మాధవీ లత అన్నారు.

Recommended Video

VJ Sunny కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి బెదిరింపులు Madhavi Latha ఫైర్| Rowdy Rohini| Filmibeat Telugu
వారి నోరు మూయించిన నాగ్ అంటూ

వారి నోరు మూయించిన నాగ్ అంటూ

గతవారం వారాంతం ఎపిసోడ్‌లో నాగార్జున హోస్ట్‌గా ఉండి ఇంటి సభ్యులతో ఒక గేమ్ ఆడించారు. ఇంటిలో తప్పు చేసిన వారిని జైల్లో పెట్టేందుకు ఒకరిని దోషిగా, మరొకరిని పోలీసులగా వ్యవహరించమని కోరారు. పోలీసు చేసిన అభియోగాలను తప్పు అని చెప్పుకోవడానికి దోషికి తన తరుఫున వాదించుకొనే విధంగా డిఫెన్స్ లాయర్‌ను పెట్టుకోమన్నారు. అయితే దోషికి మద్దతుగా వాదనలు వినిపించే లాయర్‌ను హోస్ట్ నాగార్జున నోరు మూయించారు. దాంతో నాగార్జున తీరును నెటిజన్లు భరించలేకపోయారు. అందుకే ఆయనను దారుణంగా ట్రోల్ చేశారు అని మాధవీలత అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X