For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షేక్ హ్యాండ్ ఇస్తే ఇక అంతే.. సుధీర్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

  |

  కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది టాలెంట్ ఉన్న నటీనటులు ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా మంది జబర్ధస్త్ షో ద్వారానే ఇండస్ట్రీకి అడుగులు పెట్టారు. అలాంటి వారిలో టాప్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఒకడు. సాదాసీదాగానే ఆ షోలో అడుగు పెట్టిన అతడు.. చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లను చూపించి స్టార్‌గా ఎదిగిపోయాడు. అదే సమయంలో సినిమాల్లోనూ నటిస్తూ సత్తా చాటాడు. ఇక, ఇటీవలే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోతో యాంకర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా సుడిగాలి సుధీర్ క్యారెక్టర్‌పై సీనియర్ హీరోయిన్ మహేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  అలా పరిచయం.. జబర్ధస్త్ ఎంట్రీ

  అలా పరిచయం.. జబర్ధస్త్ ఎంట్రీ

  మ్యాజిక్‌లు చేసుకుంటూ సుధీర్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఛానెళ్లలో మెజీషియన్‌గా కనిపించాడు. అలాంటి సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడడంతో అందులోకి ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. అలా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే సత్తా చాటాడు. దీంతో షో నిర్వహకులు అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు.

  RRR First Review: విడుదలకు ముందే లీకైన రిపోర్టులు.. అసలు పాయింట్ అదే.. సినిమా ఎలా ఉంటుందంటే!

  ఆమె వల్ల మరింతగా పాపులారిటీ

  ఆమె వల్ల మరింతగా పాపులారిటీ

  తన టాలెంట్లు అన్నింటినీ చూపిస్తూ సుడిగాలి సుధీర్ భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అదే సమయంలో యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాడు. చాలా కాలంగా ఆమెతో వ్యవహారం నడుపుతున్నట్లు కనిపిస్తున్నాడు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ వీళ్లిద్దరూ లవర్సే అని అంతా భావిస్తూనే ఉన్నారు.

  టీవీల్లోనే కాదు.. మూవీల్లోనూ రచ్చ

  టీవీల్లోనే కాదు.. మూవీల్లోనూ రచ్చ

  తనదైన శైలి కామెడీతో బుల్లితెరపై తిరుగులేని ఆర్టిస్టుగా వెలుగొందుతున్నాడు సుధీర్. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించాడు. అలాగే హీరోగానూ మారి చేసిన 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' మాత్రం నిరాశ పరిచాయి. ఇప్పుడు సుధీర్ హీరోగా 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' చేస్తున్నాడు.

  Akhanda OTT: బాలయ్య సినిమా స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్.. పండుగ కానుకగా ఆరోజే.. మరి టీవీలో ఎప్పుడంటే!

  మరోసారి యాంకర్‌గా మారాడుగా

  మరోసారి యాంకర్‌గా మారాడుగా

  కొన్నేళ్ల క్రితం సుడిగాలి సుధీర్ 'పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారిన విషయం తెలిసిందే. హోస్టుగానూ తన మార్క్‌ను చూపించి ఆకట్టుకున్నాడు. కానీ, ఆ షోతో యాంకరింగ్‌ను ఆపేశాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో మరోసారి యాంకర్‌గా ఎంట్రీ మారాడు. అందులో తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తున్నాడు.

  వచ్చే ఆదివారం మరింత ఫన్‌తో

  వచ్చే ఆదివారం మరింత ఫన్‌తో

  వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. గతంలో జరిగిన వాటి మాదిరిగానే ఈ ఎపిసోడ్ కూడా ఎంతో సందడిగా సాగినట్లు ప్రోమోలో చూపించారు. ఆర్టిస్టులు ఆటపాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. దీనికి 'పెళ్లి' హీరోయిన్ మహేశ్వరి ముఖ్య అతిథిగా విచ్చేసి మరింత మజాను పంచారు.

  భర్తతో టాలీవుడ్ హీరోయిన్ లిప్‌లాక్: ఆ ఫొటోను షేర్ చేసిన కాజల్.. పర్సనల్ పిక్ లీక్ చేయడంతో రచ్చ

  మహేశ్వరి సంచలన వ్యాఖ్యలు

  షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హోస్ట్ సుడిగాలి సుధీర్.. హీరోయిన్ మహేశ్వరిని మేడం హాయ్ అంటూ చేయి ఇవ్వబోయాడు. దీంతో ఆమె షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం చేసింది. దీంతో సుధీర్ 'ఏంటి మేడమ్.. నమస్కారం పెడుతున్నారు' అంటూ ప్రశ్నించాడు. దీనికి మహేశ్వరి 'వద్దు బాబూ.. నేను చేతులు కలిపితే.. నువ్వు ఏ పులిహోరో కలుపుతావు' అని పంచ్ వేసింది.

  నాకు దూరంగా ఉండు అంటూ

  నాకు దూరంగా ఉండు అంటూ


  మహేశ్వరి వేసిన పంచ్‌కు రాజా సినిమాలోని 'అదంతా అప్పుడండీ.. ఇప్పుడు నేను మారిపోయాను' అనే డైలాగ్‌ను వేశారు. ఇక, పక్కనే ఉన్న రాకెట్ రాఘవ 'నువ్వు అంత మంచి పేరు సంపాదించావు' అని సెటైర్ వేశాడు. అనంతరం సుధీర్ 'మేడమ్.. ఇంతకీ నన్ను ఎక్కడ ఉండమంటారు' అని అడగ్గా.. 'నాకు మాత్రం దూరంగా ఉండు' అని బదులిచ్చింది మహేశ్వరి.

  English summary
  Telugu Actor and Comedian Sudigali Sudheer Paticipated in Sridevi Drama Company. In Upcoming Episode.. Heroine Maheswari Sensational Comments on Him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X