For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్‌తో యాంకర్ ప్రదీప్ ప్రేమాయణం: ఆ వీడియో దెబ్బకు మొత్తం మారిపోయింది.!

  By Manoj
  |

  తెలుగు బుల్లితెరపై తక్కువ సమయంలోనే అత్యంత భారీ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ ప్రదీప్ ఒకడు. అద్భుతమైన టైమింగ్‌తో పాటు వాక్చాతుర్యం ఉన్న అతడు... చాలా కాలంగా తెలుగులో టాప్ యాంకర్‌గా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం ఇప్పుడిప్పుడే హైలైట్ అవుతున్నాడు. ఓ హీరోయిన్ కారణంగానే అతడికి ఈ పరిస్థితి ఎదురవుతోంది. అంతేకాదు, వీళ్లిద్దరి రొమాన్స్ ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. అసలేం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

  ఇలా వచ్చాడు.. అలా ఫేమస్ అయ్యాడు

  ఇలా వచ్చాడు.. అలా ఫేమస్ అయ్యాడు

  ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్‌గా వెలుగొందుతోన్న ప్రదీప్ మాచిరాజు... జీ తెలుగులో ప్రసారం అయిన ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' అనే షో ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అదే చానెల్‌లో ‘గడసరి అత్త సొగసరి కోడలు' అనే కార్యక్రమంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. దీనికి బెస్ట్ యాంకర్‌గా అతడు నంది అవార్డును కూడా అందుకున్నాడు. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకున్నాడు.

  సొంతంగా షో... ఎక్కడ చూసినా అతడే

  సొంతంగా షో... ఎక్కడ చూసినా అతడే


  యాంకర్ ప్రదీప్ వరుస షోలతో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను' అనే కార్యక్రమాన్ని స్వయంగా ప్రారంభించాడు. అంతేకాదు, ఈ షోకు ఎంతో మంది సినీ ప్రముఖులను తీసుకొచ్చి మెప్పించాడు. దీనితో పాటు మరికొన్ని ఛానెళ్లలో సరికొత్త షోలతో సత్తా చాటిన అతడు... ‘పెళ్లి చూపులు' అనే షో కారణంగా విమర్శలను ఎదుర్కొన్నాడు.

  లవ్ గురూగా మారిన యాంకర్ ప్రదీప్

  లవ్ గురూగా మారిన యాంకర్ ప్రదీప్

  బుల్లితెరపై తన మార్క్ చూపిస్తోన్న ప్రదీప్... పలు సినిమాల్లో చక్కని పాత్రలు చేసి మెప్పించాడు. ఈ క్రమంలోనే ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నూతన దర్శకుడు మున్నా తెరకెక్కించిన ఈ మూవీలో ప్రదీప్ లవ్ గురూగా కనిపించనున్నాడు. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం' పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే.

  సొంత గూటికి రీఎంట్రీ.. ఇక్కడ ఒక్కటే

  సొంత గూటికి రీఎంట్రీ.. ఇక్కడ ఒక్కటే

  టాలెంటెడ్ యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్.. చాలా ఛానెళ్లలో పని చేశాడు. అయితే, ఈ మధ్యనే ‘సరిగమప' అనే షో కోసం జీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చాడు. దానితో పాటు మరిన్ని షోలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు, ఈటీవీలో మాత్రం ‘ఢీ' అనే డ్యాన్స్ షోలో చేస్తున్నాడు. ఇందులో ప్రదీప్ ఎంతో హైలైట్ అవుతున్నాడు.

  యాంకర్ ప్రదీప్‌పై ఆ హీరోయిన్ ప్రభావం

  యాంకర్ ప్రదీప్‌పై ఆ హీరోయిన్ ప్రభావం


  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా పేరున్న ప్రదీప్... తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానని తరచూ స్టేట్‌మెంట్లు ఇస్తూ ఉంటాడు. కానీ, కొద్ది రోజులుగా అతడిలోని రొమాంటిక్ యాంగిల్‌ మాత్రం బయటకు వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ‘ఢీ' షో జడ్జ్, ప్రముఖ హీరోయిన్ పూర్ణతో ప్రదీప్ ప్రేమాయణం సాగిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి విధితమే.

  Recommended Video

  Bigg Boss Telugu 4 : Episode 16 Highlights,అరియానా Vs సోహైల్..కత్తులు దూసుకొన్న సెలబ్రిటీలు!

  రొమాన్స్ దెబ్బకు మొత్తం మారిపోయింది.!


  ఇటీవల ‘ఢీ' షోలో ప్రదీప్, పూర్ణ మధ్య రొమాంటిక్ సీన్స్ కనిపించాయి. అంతేకాదు, ఇద్దరూ కలిసి డ్యాన్స్ కూడా చేశారు. అదే సమయంలో ప్రదీప్ అంటే తనకు క్రష్ ఉందని పూర్ణ చెప్పింది. ఈ వ్యవహారం వల్ల ఈటీవీకి టాప్ రేటింగ్ వచ్చింది. తాజా రిపోర్టు ప్రకారం.. ఆ వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగులో ‘ఢీ' షో ఏకంగా టాప్ 3లో నిలిచి రికార్డు సాధించింది.

  English summary
  Pradeep Machiraju is an Indian Telugu television presenter and actor. He won State Nandi award as Best Anchor in 2014 for the show Gadasari Atta Sogasari Kodalu. Pradeep was born in Amalapuram, East Godavari district of Andhra Pradesh, India and brought up in Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X