‘ఢీ’ కంటెస్టెంట్‌తో హీరోయిన్ పూర్ణ నిశ్చితార్థం.. అందరి ముందు ఉంగరం తొడిగేశాడు.!

By Manoj

బుల్లితెర చరిత్రలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు పొందింది ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న 'ఢీ'. ఇప్పటికి పదకొండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుందీ షో. మొదటి సీజన్ నుండి కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సాగుతుంది ఈ అల్టిమేట్ డ్యాన్స్ షో. 'ఢీ' ద్వారా శేఖర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ ఇలా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందుకే ఈ షో అంత పాపులర్ అయింది. తాజాగా ఈ షోలో ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దీంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఇంతకీ ఏంటా పరిణామం.? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య మరొకటి మొదలైంది

ఈ మధ్య మరొకటి మొదలైంది

ఇప్పటికే పదకొండు సీజన్లు పూర్తి చేసుకున్న ‘ఢీ' షో.. పన్నెండో సీజన్‌ను కూడా ప్రారంభించింది. ‘ఢీ చాంపియన్స్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో ఈ షో ద్వారా పాపులర్ అయిన డ్యాన్సర్స్, కొందరు ఛాంపియన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతోంది. అందుకే గతంలో ఉన్న ఫ్యాన్స్ కంటే ఈ సీజన్‌కు మరింత మంది అభిమానులు వచ్చి చేరుతున్నారు.

ప్రదీప్ వెళ్లాడు.. వాళ్లు వచ్చారు

ప్రదీప్ వెళ్లాడు.. వాళ్లు వచ్చారు

‘ఢీ' అంటే డ్యాన్స్ షో అనుకుంటే పొరపాటే. ఈ రియాలిటీ షోలో యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, రష్మీ సహా జడ్జులు అందరూ కలిసి స్టేజ్‌పై నవ్వులు పూయిస్తుంటారు. అందుకే ఇది ఆల్‌రౌండ్ షో అయిపోయింది. ముఖ్యంగా యాంకర్ ప్రదీప్ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. అయితే, ఇటీవల అతడు ఈ షోకు దూరం అయ్యాడు. దీంతో అతడి స్థానంలో మరో యాంకర్ రవి, వర్షిణి షోలోకి ఎంటర్ అయ్యారు.

 ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతోంది

ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతోంది

‘ఢీ చాంపియన్స్' మొదలైన తర్వాత దీనికి కూడా గత సీజన్ల వలే భారీ స్పందన వస్తుంది అనుకున్నారు. కానీ, తర్వాత పరిస్థితి అలా కనిపించడలేదు. దీనికి కారణం కంటెంట్‌తో పాటు యాంకర్ ప్రదీప్ గైర్హాజరు అవడం కూడా. అలా అలా నెట్టుకుంటూ వచ్చిన ఈ షో.. ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతోంది. దీంతో ప్రేక్షకులు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు.

రష్మీ - సుధీర్‌ను వాడుకుంటున్నారు

రష్మీ - సుధీర్‌ను వాడుకుంటున్నారు

ఎప్పటి లాగే ఈ సీజన్‌లో కూడా రష్మీ - సుధీర్‌ను షో నిర్వహకులు బాగా వాడుకుంటున్నారు. వీళ్లిద్దరిపై ఏదో రకమైన స్కిట్టులు రాయడంతో పాటు రొమాంటిక్ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి కూడా పెడుతున్నారు. దీంతో వీళ్లిద్దరి అభిమానులు ఈ షో వైపు ఎంతగానో ఆకర్షితులు అవుతున్నారు.

వాళ్లందరినీ ఆడుకున్న సుధీర్

రవి ఇచ్చిన టాస్క్‌ కారణంగా సుధీర్ జడ్జ్‌ల కుర్చీలో కూర్చున్నాడు. వర్షిణి, రవి డ్యాన్స్ చేయడం.. వాళ్లకు ముగ్గురు జడ్జ్‌ల్లాగ జడ్జ్‌మెంట్ ఇవ్వడం చేశాడు. ముందుగా శేఖర్ మాస్టర్‌ను అచ్చు గుద్దినట్లు దింపేసిన సుధీర్.. ఆ తర్వాత ప్రియమణి, పూర్ణలను మాత్రం ఆడుకున్నాడు. వీళ్లిద్దరూ బ్రేక్ సమయాల్లో ఏం చేస్తారో అన్నది సుధీర్ చూపించాడు. దీంతో ఈ టాస్క్ మొత్తం నవ్వులు వెల్లి విరిశాయి. దీంతో ఈ ఎపిసోడ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది.

కంటెస్టెంట్‌తో పూర్ణ ఎంగేజ్‌మెంట్

కంటెస్టెంట్‌తో పూర్ణ ఎంగేజ్‌మెంట్

ఢీ షో వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోను సదరు చానెల్‌ విడుదల చేసింది. ఇందులో జడ్జ్‌ల్లో ఒకరైన హీరోయిన్ పూర్ణకు.. ఢీ కంటెస్టెంట్ రాజుతో ఎంగేజ్‌మెంట్ అయినట్లు చూపించారు. ఇందులో రాజు.. మోకాళ్లపై కూర్చుని పూర్ణ వేలికి ఉంగరం తొడగాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

Recommended Video

Title : #CineBox : #SarileruNeekevvaruTeaser | #OMGDaddy Song | Ragala 24 Gantallo Movie Review
పూర్ణ అసలు పేరు ఇదే

పూర్ణ అసలు పేరు ఇదే

పూర్ణ అలియాస్ షామ్నా కాసిం శాస్త్రీయ నృత్య కళాకారిణిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత సినీ రంగంలోకి ప్రవేశించింది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు ‘అవును', ‘అవును 2' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. వీటికి ముందూ తర్వాత ఆమె ఎన్నో సినిమాలు, రియాలిటీ షోలలో పాల్గొనడం ద్వారా పాపులర్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X