twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్... నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో జాయినైన శ్రీయ!

    |

    భారతీయ సినీ చరిత్రలో ఓ సంచలనం 'బాహుబలి' ప్రాజెక్ట్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వేలాది కోట్ల వసూలు చేసింది. ఇండియన్ మూవీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత దక్కించుకుంది.

    త్వరలో 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్' పేరుతో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ రాబోతున్న సంగతి తెలిసిందే. దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రీక్వెల్... నెట్‌ఫ్లిక్స్ సంస్థతో కలిసి బాహుబలి నిర్మాతలు శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.

    ఈ వెబ్ సిరీస్ షూటింగులో హీరోయిన్ శ్రీయ జాయినైనట్లు తెలుస్తోంది. అయితే ఇందులో శ్రీయ పాత్ర ఏమిటి? అనేది సీక్రెట్‌గా ఉంచారు. ఇందులో బాలీవుడ్ నటి మృణాళి ఠాకూర్, రాహుల్ బోస్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. మృణాళి ఠాకూర్ శివగామి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

    Heroine Shriya joins Baahubali Netflix series

    అయితే అరమేంద్ర బాహుబలి పుట్టుక ముందు జరిగిన కథ ఏమిటి? మాహిష్మతి రాజ్యం అంత బలమైన రాజ్యంగా ఎలా ఎదిగింది? శివగామిదేవి ఎక్కడ పుట్టింది? ఎలా ఈ రాజ్యానికి కోడలిగా వచ్చింది. అంత పెద్ద రాజ్యాన్ని తన కను సైగతో ఎలా కంట్రోల్ చేసింది అనే కథతో... ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ఉంటుంది.

    మొత్తం 9 ఎపిసోడ్లుగా ఈ సిరీస్ రాబోతోంది. ఆనంద్ నీలకంఠన్ రాసిన 'ది రైజ్ ఆఫ్ శివగామి' పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతోంది.

    English summary
    Film Nagar source said that, Heroine Shriya Saran has been roped in to play a crucial role in the Baahubali Netflix series. Bollywood actors Mrunal Thakur and Rahul Bose are playing the main leads in the series.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X