ఆ దారి పడుతున్న హీరోయిన్లు
దక్షిణాది సిని పరిశ్రమలో హీరోలకు ఉన్నంత వాల్యూ...హీరోయిన్లకు ఉండటం లేదు. వారిని ఇప్పటికీ కేవలం అందాల బొమ్మలుగానే చూపెడుతున్నారు దర్శకులు. 60, 50 ఏళ్లు దాటినా...ఇప్పటికీ రజనీకాంత్, నాగార్జున లాంటి వారు హీరోలుగా కొనసాగుతూనే ఉన్నాయిరు. అయితే హీరోయిన్ల పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నం. పాతిక... మహా అయితే 30 ఏళ్లు ఇంతకు మించి వయసున్న వారికి హీరోయిన్లు తీసుకున్న సందర్భాలు అసలు లేవనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో సినిమా అవకాశాలు తగ్గానే హీరోయిన్లు తమకు కెరీర్‌కు సురక్షితమైన దారులు వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడి నేపథ్యంలో సినిమాల్లో అవకాశాలు తగ్గగానే టీవీ సీరియల్స్ పై దృష్టి పెడుతున్నారు. ఒకప్పుడు అందాల ఆరబోతతో సెక్సీగా నటించిన హీరోయిల్లు సీరియల్స్‌లో హోమ్లీగా నటిస్తున్నారు.
80, 90ల్లో మెగాస్టార్ లాంటి అగ్రహీరోల సరసన నటించి గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వాణి విశ్వనాథ్.....ఆ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటిస్తున్న 'సముద్రం' సీరియల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.
అప్పట్లో టాప్ హీరోయిన్‌గా రాణించిన నటి రాధిక....ఆ తర్వాత టీవీ సీరియల్స్ నిర్మాతగా, నటిగా రాణిస్తోంది. రాడాన్ అనే టీమీ మీడియా సంస్థ ఏర్పాటు చేసి దానిపై పలు విజయవంతమైన సీరియల్స్ నిర్మిస్తున్నారు. రాధిక నిర్మించిన తొలి సీరియల్ 'చిట్టి'. ఈ సీరియల్స్ మంచి ప్రేక్షకాదరణ పొంది రాధికకు లాభాలను తెచ్చిపెట్టింది.
హీరోయిన్ రమ్యకృష్ణ, మీనా లాంటి వారు పలు రియాల్టీ షోలలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడంతో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తూ బుల్లి తెరపై తమ కెరీర్‌ను పదిలం చేసుకుంటున్నారు. హీరోయిన్ సిమ్రాన్ సుందరకాండ సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా, అపరంజి సీరియల్ ద్వారా 'చంటిగాడు' మూవీ హీరోయిన్ సుహాసిని, ఆటో భారతి సీరియల్ ద్వారా హీరోయిన్ కళ్యాణి, పడమటిగాలి సీరియల్ ద్వారా హీరోయిన్ అతిథి అగర్వాల్ బుల్లితెర ఆరంగ్రేటం చేశారు.


Click it and Unblock the Notifications











