Hey Balwanth Day 2 Collections: హే బలవంత్ రెండో రోజు కలెక్షన్స్.. సుహాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
యంగ్ హీరో సుహాస్ తాజాగా నటించిన మూవీ హే బలవంత్. ఫిబ్రవరి 20వ తేదీన వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బీ నరేంద్ర రెడ్డి ఈ హే బలవంత్ సినిమాను నిర్మించగా.. గోపీ అచ్చెర దర్శకత్వం వహించారు. హే బల్వంత్‌లో లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివానీ నాగారం హీరోయిన్‌గా నటిస్తుండగా.. వీకే నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్, అన్నపూర్ణమ్మ, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీత దర్శకత్వం వహించగా.. మహీరెడ్డి పాండుగుల సినిమాటోగ్రాఫర్‌గా, విప్లవ్ నైషదం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో హే బలవంత్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు సుహాస్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? అనేది పరిశీలిస్తే..
హే బలవంత్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి హే బల్వంత్ మూవీకి 10 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సుహాస్ ట్రాక్ రికార్డ్, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా హే బలవంత్ మూవీపై చిత్ర పరిశ్రమలో హైప్ నెలకొంది. దానికి తగినట్లుగానే ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు.

హే బలవంత్ ప్రీ రిలీజ్ బిజినెస్
హే బలవంత్ మూవీ శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ 5 సంస్థలు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి 8 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో హే బలవంత్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని విశ్లేషకులు వాల్యూ కట్టారు. సుహాస్ మూవీని తెలుగు రాష్ట్రాల్లో 350 థియేటర్స్‌లోనూ, ఓవర్సీస్‌లో 300 థియేటర్స్ చొప్పున వరల్డ్ వైడ్‌గా 750 థియేటర్స్‌లో విడుదల చేశారు.
హే బలవంత్ తొలిరోజు కలెక్షన్స్
ప్రీమియర్స్ + డే 1 కలెక్షన్స్ కలిపి సుహాస్ మూవీకి తొలిరోజున ఇండియాలో 80 లక్షల రూపాయల నెట్.. 95 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఇక ఓవర్సీస్‌లో మాత్రం సుహాస్ మూవీ దూసుకెళ్తోంది. అమెరికాలో ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్‌లో 162 సెంటర్స్‌లో 254 షోలకు గాను 1317 టికెట్లు అమ్ముడై.. 18,300 డాలర్లు (16.60 లక్షల రూపాయలు) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇతర దేశాలలో కలిపి మొత్తంగా ఓవర్సీస్ నుంచి తొలిరోజున 1,10,777 డాలర్లు (కోటి రూపాయలకు పైగా) రాబట్టింది. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా హే బలవంత్ మూవీ తొలిరోజున 2 కోట్ల కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.
హే బలవంత్ రెండో రోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌కి తోడు వీకెండ్ కావడంతో సుహాస్ మూవీకి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. రెండో రోజైన శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు హే బలవంత్ మూవీకి ఇండియాలో 16 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కడపటి వార్తలు అందేసరికి హే బలవంత్ మూవీకి ఇండియాలో రెండో రోజు 20 లక్షల రూపాయలు వసూలైంది. రెండో రోజు ఈ చిత్రం భారత్‌లో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు చొప్పున రాబడుతుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











