బిగ్ బాస్2: ముహూర్తం ఖరారైంది ఎవరికి.. సునైనాకా లేక రోల్ రైడకా!

బిగ్ బాస్ 2 షోలో రోజు రోజుకూ మజా పెరుగుతోంది. నాని ప్రతివారం మెరుస్తూ ఇంటి పీకుతున్నాడు. చూస్తుంటే హౌస్ లో ఈవారం వివాదాలు ఎక్కువయ్యేలా కనిపిస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియ కూడా ముగియడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రతివారం నామినేట్ అవుతూ వచ్చిన గణేష్ ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఎలిమినేషన్ రేసులో ఉన్నది ఎవరు అనే విషయంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 66 Highlights...!
నామినేషన్

నామినేషన్

ఈవారం నామినేట్ అయిన సభ్యులని ఒకసారి గమనిస్తే.. గీత, పూజ, సునైనా, శ్యామల, రోల్ రైడ, నూతన్ నాయుడు నామినేషన్ జాబితాలో ఉన్నారు. వీరంతా హౌస్ లో బాగా పెర్ఫామ్ చేస్తున్న వారే కావడం విశేషం.

 వాళ్లిద్దరేనా

వాళ్లిద్దరేనా

మొత్తం ఆరుమంది ఇంటి సభ్యులు హౌస్ లో నామినేట్ అయ్యారు. వారిలో రోల్ రైడ, సునైనాలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు బలంగా వార్తలు వస్తున్నాయి. సునైనాపై చాలా రోజుల నుంచి విమర్శలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇక రోల్ రైడ కూడా ఇటీవల నాని నుంచి స్వీట్ వార్నింగ్ ఎదుర్కొన్నాడు.

సానుభూతి

సానుభూతి

గణేష్ కోసం రోల్ రైడ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. దీనితో అతడిపై ఆడియన్స్ లో సానుభూతి ఏర్పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే సునైనా ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ముహూర్తం ఖరారైనట్లే.

గీత మాధురి

గీత మాధురి

హౌస్ లో ప్రతి అంశంలో చురుగ్గా పాల్గొంటూ గీత మాధురి ఆడియన్స్ లో మంచి అభిప్రాయం ఏర్పరుచుకుంది. గీతామాధురి టైటిల్ రేసులో ఉందని కూడా ఆడియన్స్ నమ్ముతున్నారు. టైటిల్ రేసులో ఉన్న మరో కంటెస్టెంట్ కౌశల్ తో జంటగా పాల్గొనడం వలన గీత నామినేట్ అయింది. గీతామాధురి ఉన్న బలాలు పరిగణలోకి తీసుకుంటే ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు.

 శ్యామల, పూజ

శ్యామల, పూజ

పూజ రామచంద్రన్ హౌస్ లోకి వచ్చి మూడు వారాలు మాత్రమే గడుస్తోంది. ఈ విషయం ఆమెకు కలసి వచ్చే అవకాశం ఉంది. అన్ని టాస్క్ లలో చురుగ్గా పాల్గొంటోంది కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువ. శ్యామల హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయమే అవుతోంది. దీనితో ఆమె కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

నూతన్ నాయుడు

నూతన్ నాయుడు

నూతన్ నాయుడు శ్యామలతో పాటు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. గత తప్పిదాలని సరిచేసుకుని ఆయన హౌస్ లో చురుగ్గా ఉండడంలో వెనుకబడుతున్నారనే విమర్శ ఎదురవుతోంది. బిగ్ బాస్ కాస్త కఠినంగా వ్యవహరిస్తే నూతన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X