బిగ్ బాస్2: పిన్నీ కథ ముగిసిందా.. అతడికి కూడా గండం, ఈ వారం ఎలిమినేషన్!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Who Will Eliminate This Week..?

బిగ్ బాస్ హౌస్ లో వ్యవహారం హీట్ ఎక్కింది. విజేత ఎవరో తేలడానికి మరి కొన్ని వారాలు మాత్రమే ఉండడంతో ఇంటి సభ్యుల మధ్య పోటీ పెరిగింది. ఎవరి వారు సొంత స్ట్రాటజిలతో గేమ్ మొదలు పెట్టారు. బిగ్ బాస్ మొదటినుంచి ఒకే పంథాలో వెళుతున్న కౌశల్ ని పక్కన పెడితే మిగిలిన ఇంటి సభ్యుల గేమ్ ప్లానింగ్ లో స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. గీత మాధురి ఎక్కువగా కౌశల్ ని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అవకాశం దొరికినప్పుడు తనీష్ కూడా చెలరేగిపోతున్నాడు. ఈ వారం ఎలిమినేషన్ గురించి ఆసక్తికరమైన ఊహాగానాలు మొదలయ్యాయి.

 ఊహకు అందని విధంగా

ఊహకు అందని విధంగా

బిగ్ బాస్ లో ఎవరూ ఊహించని విధంగా పరిణామాలు ఉంటాయని చెబుతూ వస్తున్నారు. కానీ ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో దాదాపుగా ఆడియన్స్ ఊహించినట్లుగానే జరుగుతోంది. బిగ్ బాస్ నుంచి లీకులు వస్తున్నాయనే ప్రచారం కూడా ఉంది.

ఈ వారం

ఈ వారం

గత వారం డబుల్ ఎలిమినేషన్ తో షాక్ ఇచ్చిన నేచురల్ స్టార్ నాని.. గణేష్, నూతన్ ఇద్దరినీ ఇంటినుంచి సాగనంపారు. ఇకపై మీరు ఊహించని విధంగా బిగ్ బాస్ ఉండబోతోందంటూ ఉత్కంఠ పెంచేశాడు. దీనితో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి ఆడియన్స్ లో ఎక్కువవుతోంది.

నామినేషన్‌లో ఉన్నది

నామినేషన్‌లో ఉన్నది

గీత మాధురి వల్ల కౌశల్ ఈ సీజన్ మొత్తానికి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. కౌశల్ తో పాటు అమిత్, శ్యామల, దీప్తి ఈ వారం నామినేట్ అయ్యారు. ఏ నలుగురిలో హౌస్ నుంచి వెళ్లిపోయేది ఎవరు అనే ఆసక్తి ఆడియన్స్ లో నెలకొని ఉంది.

కౌశల్ ఆర్మీ

కౌశల్ ఆర్మీ

కౌశల్ ఆర్మీ, ఆడియన్స్ నుంచి కౌశల్ కు బలమైన మద్దత్తు లభిస్తోంది. అందుకే గత రెండు వారాలుగా కౌశల్ నామినేషన్ లో ఉన్నా.. ప్రొటెక్టెడ్ జోన్ లోకి వెళ్ళబోతున్న వ్యక్తి అంటూ నాని మొదట కౌశల్ పేరే చెబుతున్నాడు. దీనితో ఈ వారం కూడా కౌశల్ నామినేషన్ నామమాత్రమే అని అంటున్నారు.

 వాళ్ళిద్దరిలోనే

వాళ్ళిద్దరిలోనే

ఈ వారం ఎలిమినేషన్ కు సంబంధించి బలంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో పిన్నిగా పేరు గాంచిన శ్యామల, అమిత్ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శ్యామల ఇప్పటికే హౌస్ నుంచి ఎలిమినేట్ అయి రీ ఎంట్రీ ఇచ్చింది.

అమిత్‌కు గండం

అమిత్‌కు గండం

శ్యామల ఎలిమినేషన్ కు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు అమిత్ కు కూడా గండం పొంచి ఉంది. రెండు వారాల క్రితం వరకు నామినేషన్ నుంచి అమిత్ లక్కీగా తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా నామినేట్ అవుతూ వస్తున్నాడు.

దీప్తి పోరాటం

దీప్తి పోరాటం

దీప్తి బిగ్ బాస్ హౌస్ లో ప్రతి టాస్క్ లోనూ చివరి వరకు పోరాడుతుంది. ఇది ఈమెకు ప్లస్ పాయింట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో ఈ వారం ఎలిమినేషన్ లో దీప్తికి ఉండకపోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X