పల్లవి ప్రశాంత్ కేసులో సంచలనం: నాగార్జునపై అరెస్ట్ వారెంట్.. షాకిచ్చిన హైకోర్ట్ న్యాయవాది
రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతోన్న అంశాల్లో బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసు వ్యవహారం ఒకటి. అంతలా ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. అందుకు అనుగుణంగానే ఈ కేసులో తరచూ ఏదో ఒక మలుపు కనిపిస్తూనే ఉంటోంది.
ఇలా రెండు రోజుల వ్యవధిలోనే ఈ అంశంలో ఎన్నో ట్విస్టులు ప్రశాంత్ అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునకు హైకోర్ట్ న్యాయవాది బిగ్ షాక్‌నే ఇచ్చారు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

ప్రశాంత్‌పై కేసు.. పరారీ: బిగ్ బాస్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన దాడులు, అల్లర్లకు పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సహా మరో మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత అతడిని అరెస్ట్ చేయాలని భావించినా.. పల్లవి ప్రశాంత్ కనిపించకుండాపోయాడని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
వీడియోతో.. అరెస్ట్ చేసి: పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలోనే అతడు ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో తాను ఎక్కడికీ పారిపోలేదని, ఇంట్లోనే ఉన్నానని వెల్లడించాడు. ఇది వచ్చిన కొన్ని గంటల్లోనే జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ నివాసానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు.
రంగంలోకి న్యాయవాది: బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో మొదటి నుంచి వాళ్ల ఫ్యామిలీకి హైకోర్ట్ న్యాయవాది అరుణ్ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే రైతు బిడ్డను అరెస్ట్ చేసిన తర్వాత సదరు లాయర్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు (Telangana State Human Rights Commission) బిగ్ బాస్ నిర్వహకులపైన కూడా ఫిర్యాదు చేశారు.

వాళ్లపై కేసు పెట్టలేదు: హైకోర్ట్ న్యాయవాది అరుణ్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో 'బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. మరి నిర్వహకులు కూడా దీనికి బాధ్యులే కదా. వాళ్లపైన కేసు నమోదు చేయలేదు. దీనిపై చర్యలు తీసుకోవాలి' అని అందులో రాసుకొచ్చారు.

నాగార్జున పేరు కూడా: ఇదే ఫిర్యాదులో హైకోర్ట్ న్యాయవాది అరుణ్ బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునకు సైతం షాక్ ఇచ్చారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చిన కంప్లైంట్‌లో 'బిగ్ బాస్ గొడవ తర్వాత నమోదు అయిన రెండు కేసుల్లో హోస్ట్ నాగార్జున పేరును ప్రస్తావించలేదు. ఈ కేసుల్లో ఆయన పేరు కూడా చేర్చాలి. నాగార్జున కూడా ఈ గొడవలకు బాధ్యులే' అంటూ పేర్కొన్నారు.
నాగార్జునపై వారెంట్: తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులోనే హైకోర్ట్ లాయర్ అరుణ్ 'అంత గొడవ జరుగుతుంటే బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. అందుకే 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టులో పిటిషన్ వేశాను. నాగార్జునను కూడా అరెస్ట్ వారెంట్ మంజూరు చేసి వెంటనే అందులోకి తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











