Karthika Deepam ఆ రాక్షసి మోసంతో.. హృదయం ముక్కలైంది.. శౌర్య ఎమోషనల్

హిమతో పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగితే అమ్మవారికి ముడుపు కడుతానని మొక్కుకున్న నిరుపమ్ గుడికి చేరుకొన్నాడు. ముడుపు కడుతానని మొక్కుకున్న నిరుపమ్‌ను చూసి హిమ ఆశ్చర్యపోయింది. అయితే ఇంకా పెళ్లి కాలేదు బావా.. అప్పుడే ముడుపు కడుతున్నావు అని హిమ అంటే.. అయినట్టే భావిస్తున్నాను అని నిరుపమ్ సమాధానం ఇచ్చారు. అయితే జ్వాలాతో నీ పెళ్లి జరుగాలని కోరుకొంటూ ముడుపు కడుతాను బావ అంటూ హిమ అనడంతో నిరుపమ్ షాక్ తిన్నాడు. ఇంకా నీ మనసు నుంచి ఆ విషయాన్ని తీసేయలేదా? అంటూ అడిగితే.. అలా చేయడం జరగదు అని హిమ సమాధానం ఇచ్చారు. అయితే కార్తీకదీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్ 1392లో ఇంకా ఏం జరిగిందంటే..

గుడిలో ముడుపులు కడుతూ..

గుడిలో ముడుపులు కడుతూ..

హిమ మాటలకు నొచ్చుకొన్న నిరుపమ్.. పక్క నుంచి వెళ్తున్న పూజారిని పిలిచి మా ఇద్దరికి పెళ్లి జరగబోతున్నది. మమ్మల్ని దీవించండి అంటూ నిరుపమ్ కోరితే.. పూజారి గారు.. నా మనసులో ఒకటి అనుకొంటున్నాను.. అది జరిగేలా నన్ను ఆశీర్వదించండి అంటే.. శుభం అని అన్నారు. అయితే మేమిద్దరం వేర్వేరు ఆలోచనలతో కోరుకొంటున్నాం అంటే..ప్రాప్తం ఎలా ఉంటుందో అలానే జరుగుతుంది అని పూజారి అన్నారు. దాంతో ప్రాప్తం ఎవరికి ఉంటుంది. నీకు నాకు మాత్రమే అని నిరుపమ్ అని అన్నాడు.

నా కోరికే గెలుస్తుందని..

నా కోరికే గెలుస్తుందని..

అయితే గుడిలో నిరుపమ్, హిమ ముడుపు కడుతుండగా అక్కడికి వచ్చిన జ్వాలా అలియాస్ శౌర్య చూసింది. అయితే నేను ముందు ముడుపు కడుతాను అంటూ ఇద్దరు వాదులాడుకొన్నారు. అయితే నా కోరికే గెలుస్తుందని హిమ.. నేను కోరుకొన్నది నిజమైంది అని నిరుపమ్ ముడుపు కట్టడానికి సిద్దమయ్యారు. అయితే హిమ ముడుపు కడుతున్న తీరు చూసి.. భలే నటించావే అని మనసులో ఆగ్రహం చెందింది. ఇద్దరు కలిసి ముడుపుకట్టేందుకు పోటీ పడ్డారు. ఈ సంఘటన చూసి జ్వాలా మరింత కోపంతో ఊగిపోయింది.

నేను పేషెంట్‌నే కదా..

నేను పేషెంట్‌నే కదా..

నిరుపమ్ బావతో శౌర్య పెళ్లి చేస్తానని చెప్పాను. వారిద్దరి పెళ్లి చేయడానికి క్యాన్సర్ సోకిందని నాటకం ఆడాను. నాకు క్యాన్సర్ లేదనే విషయం నిరుపమ్ బావకు ఏదో ఒకరోజు తెలుస్తుంది. ఇదే జరిగితే శౌర్య ప్రేమకు ఎలా న్యాయం చేయగలను. పెళ్లి ఇంకెన్నో రోజులు లేవు. ఎలా ప్లాన్ చేయాలి అంటూ హిమ మనసులో మదనపడిపోయింది. నిరుపమ్‌ను కలిసేందుకు హిమ వెళ్లింది. హాస్పిటల్‌లో పేషెంట్‌ను పిలిచినట్టు తన పేరుతో పిలువడంతో హిమ ఆశ్చర్యపోయింది. అయితే నన్ను ఎందుకు పేషెంట్‌లా ట్రీట్ చేశారు హిమ అంటే.. నీవు పేషెంట్ మాదిరిగా అక్కడ కూర్చొంటే.. అలా పిలిచి జోక్ చేశాను అని నిరుపమ్ అంటే.. నేను పేషెంట్‌నే కదా అని హిమ అంది.

అసలు జ్వాలా ఎవరు?

అసలు జ్వాలా ఎవరు?

అయితే జ్వాలా గురించి ఎక్కువగా ఆలోచిస్తూ.. డిస్ట్రబ్ అవుతున్నావు. అసలు జ్వాలా ఎవరు? ఆమె గురించి ఇంత ఎందుకు చేస్తున్నావు. ఆమెతో నాకు పెళ్లి చేయాలని ఎందుకు చూస్తున్నావు అంటూ నిరుపమ్ ప్రశ్నల వర్షం కురిపించారు. జ్వాలా మంచి అమ్మాయి. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నది అని హిమ అంటే.. నేను ప్రేమించడం లేదని చెప్పాను అని నిరుపమ్ సమాధానం ఇచ్చాడు. అయితే నేను ఇంకా ఎక్కువ రోజులు బతకలేను. నీవంటే జ్వాలాకు ప్రాణం అని హిమ అంటే.. నీవంటే నాకు ప్రాణం. ఈ మాట కూడా జ్వాలాకు చెప్పాను. నాలుగు రోజులు బాధపడుతుంది. ఆ తర్వాత మరిచిపోతుంది అని నిరుపమ్ సమాధానం ఇచ్చాడు.

సానుభూతితో పెళ్లి చేసుకొంటాడా?

సానుభూతితో పెళ్లి చేసుకొంటాడా?

జ్వాలా కోసం పెళ్లిని త్యాగం చేయడానికి సిద్దపడిన హిమను రకరకాల ప్రశ్నలతో విసిగించాడు. అయితే జ్వాలా ఎవరు? ఇంతలా ఆమె గురించి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని నిరుపమ్ అంటే.. జ్వాలా నా ఫ్రెండ్. నన్ను పిరికితనం నుంచి బయటకు తీసుకొచ్చింది అని చెప్పింది. అయితే ఒకదశలో జ్వాలానే శౌర్య అని చెప్పేయాలా? ఒకవేళ అలా చెబితే.. సానుభూతితో పెళ్లి చేసుకొంటాడేమో. ఒకవేళ చేసుకోకపోతే..ఇదంతా నానమ్మ వల్లే సాధ్యమవుతుంది అని నిరుపమ్ తెలిపారు.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
నా హృదయం ముక్కలైంది అంటూ

నా హృదయం ముక్కలైంది అంటూ

ప్రేమ విఫలమైందనే బాధలో ఉన్న జ్వాలాను ఓదార్చేందుకు ఆనందరావు, సౌందర్య వచ్చారు. అయితే తనను మోసగించి.. నిరుపమ్‌ను పెళ్లి చేసుకొనేందుకు హిమ గుడిలో ముడుపులు కట్టింది. ఆ రాక్షసి నన్ను మోసం చేసింది. నా హృదయం ముక్కలైంది. ఎన్నో విషాదాలను తట్టుకొన్నాను. ఇలాంటి నాకు పెద్ద సమస్య కాదు అని జ్వాలా అంటే.. నీకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అని ఆనందరావు అనగానే.. ఆపండి.. నాకు పెళ్లి చేయాల్సిన అవసరం మీకు లేదు. పెద్ద వారు మీపై అరవడం తప్పే అని జ్వాలా ఆవేదన చెందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X