బిగ్ బాస్2: టెన్షన్ పెట్టి చంపేశాడు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు, ఆమెతో అంటీ అంటనట్లు నాని!
నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోలో రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారిపోతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో సభ్యులంతా టైటిల్ వేట కొనసాగిస్తున్నారు. ప్రధాన పోటీదారులుగా భావిస్తున్న కౌశల్, తనీష్, గీతామాధురి మధ్య ఇటీవల మాటల యుద్ధం పెరిగిపోతోంది. దీనితో టైటిల్ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. ఆదివారం జరగబోయే ఎలిమినేషన్ కోసం ఆడియన్స్ అంతా ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు.
Recommended Video


ఆ నలుగురు
నేడు జరగబోయే ఎపిసోడ్ పై ఆడియన్స్ లో అంతలా టెన్షన్ ఎందుకు ఉందంటే.. నామినేషన్ లో ఉన్నది సామాన్యులు కాదు. కౌశల్, తనీష్, దీప్తి, పూజ నామినేషన్ లో ఉన్నారు. శనివారం ఎపిసోడ్ లో జరిగిన పరిణామాలు ఆడియన్స్ ని కుదురుగా ఉండనీయడం లేదు.

టెన్షన్ పెట్టి
శనివారం నాని ఆడియన్స్ ని టెన్షన్ పెట్టి చంపేశాడు. నామినేషన్ అయిన వారిలో ఎవరిని ప్రొటెక్టెడ్ జోన్ లోకి పంపలేదు. దీనితో ఆదివారం ఎం జరుగుతుందో వేచి చూడాలి.

మాటల యుద్ధం
బిగ్ బాస్ రూల్స్ విషయంలో కౌశల్, తనీష్, గీత మాధురి మధ్య మాటల యుద్ధం పెరిగింది. చివరకు నాని ముందే కౌశల్, తనీష్ వాదులాడుకున్నారు.బిగ్ బాస్ రూల్స్ పాటించని విషయంలో దీప్తి బలైపోయింది. ఆమె కెప్టెన్సీ మటాష్ అయింది. ఈ పరిణామాలన్నీ ఆత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఎలిమినేట్ అయ్యేది
ఈ వారం ఎలిమినేషన్ విషయంలో ముందు నుంచి దీప్తి పేరు బలంగా వినిపిస్తోంది. కానీ ఆమె ఎక్కడా తగ్గకుండా పెర్ఫామ్ చేస్తోంది. తనీష్, కౌశల్ హౌస్ లో బలమైన కంటెస్టెంట్స్. వారు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. దీనితో దీప్తి, పూజ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అంటీ అంటనట్లు
శనివారం నాని ఇంటి సభ్యులందరితో మాట్లాడారు. కానీ పూజతో జరిగిన సంభాషణ మూడు ముక్కల్లో తేలిపోయింది. హౌస్ లోకి వచ్చిన తొలి వారం బాగా పెర్ఫామ్ చేశావు. రెండు మూడువారాలో నీ పెర్ఫామెన్స్ బాగా తగ్గింది. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని నాని పూజని ఉద్దేశించి తెలిపాడు. పూజ ఎలిమినేషన్ ని నాని పరోక్షంగా ఇలా చెప్పాడా అనే ఉహాగానాలు కూడా మొదలయ్యాయి.

దీప్తికి మద్దత్తుగా
దీప్తి కెప్టెన్సీని బిగ్ బాస్ లాగేసుకున్న నేపథ్యంలో ఇక ఆమె ఎలిమినేషన్ అనివార్యం అని అంతా భావించారు. కానీ నాని ఎంట్రీ ఇచ్చి ఆమెకు కెప్టెన్సీ తిరిగి వచ్చేలా బిగ్ బాస్ కు రిక్వెస్ట్ పెట్టానని తెలిపాడు. దీప్తికి నాని మద్దత్తు చూస్తుంటే ఆమె ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్లే అని వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











