Guppedantha Manasu రిషి కారులో జగతి.. వారిని చూసి వసుధార కంగారు.. అసలేం జరిగిందంటే?
రిషి తనను ప్రేమగా పలకరించడంతో జగతి ఆనందంలో మునిగిపోయింది. మీరు నన్ను సార్ అని సంబంధించకండి.. రిషి అంటే చాలూ అని చెప్పడాన్ని చూసిన మహేంద్ర కూడా సంతోషం వ్యక్తం చేశాడు. తల్లిగా ప్రేమను పొందడం వరం కాదు. నీ హక్కు అంటూ జగతికి మహేంద్ర చెప్పాడు. దాంతో ప్రపంచాన్ని గెలిచిన ఆనందం జగతి ముఖంలో కనిపించింది. గుప్పెడంత మనసు సీరియల్ 533 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..
జగతి, మహేంద్ర ఇద్దరు ఆఫీస్‌కు వెళ్లేందుకు బయలుదేరారు. అయితే కారు స్టార్ట్ చేయడానికి సిద్దం కాగా.. టైర్ పంక్చర్ కావడంతో ఎలా అని ఆలోచనల్లో పడ్డారు. అయితే స్టెపిని మార్చమంటూ జగతి చెబితే.. లాస్ట్ టైమ్ టైర్ పంక్చర్ అయితే రిపేర్ షాపులోనే పెట్టి వచ్చాను అని చెప్పి.. క్యాబ్ బుకింగ్ చేయడానికి మహేంద్ర సిద్దమయ్యారు. అంతలోనే రిషి రావడం.. వారిని చూసి ఏం చేస్తున్నారని అడిగాడు. దాంతో కారు టైర్ పంక్చర్ అయిందని క్యాబ్ బుక్ చేస్తున్నానని మహేంద్ర చెప్పాడు.

అయితే కారు టూర్ పంక్చర్ అయితే వేరే మార్గాలు ఉన్నాయి అంటే.. అవును ఎక్స్‌ట్రా టైర్ లేకపోవడం వల్ల క్యాబ్ బుక్ చేస్తున్నాను అంటూ మహేంద్ర సమాధానం ఇచ్చాడు. అయితే క్యాబ్ బుకింగ్‌కు బదులు లిఫ్ట్ కూడా అడగవచ్చు అని రిషి చెప్పాడు. దాంతో అవును కదా.. లిఫ్టు అడగాలనే ఆలోచన రాలేదు అంటూ మహేంద్ర జవాబిచ్చాడు. అయితే తాను కాలేజ్‌కు వెళ్తున్నాను.. నేను మీకు లిఫ్ట్ ఇస్తాను పదండి అనడంతో కారులో ఎక్కేందుకు సిద్దమయ్యారు. అయితే డ్రైవింగ్ మీరు చేయండి అంటే.. జగతి కారు డ్రైవ్ చేసుకొంటూ బయలు దేరింది.
కాలేజ్‌కు వెళ్లడానికి వసుధార ఆటో కోసం వెయిట్ చేస్తుంటే.. జగతి మేడమ్ చూసి కారు ఆపింది. రిషి సార్ కారులో మీరేంటి మేడమ్ అంటే.. రిషి వెనుక ఉన్నాడంటూ చూపించడంతో షాక్ తిన్నది. అయితే వెనుక సీటులో కూర్చొమంటే సందేహించింది. అయితే రిషి కూడా కాస్త సైగ చేయడంతో వెనుక సీట్లో కూర్చొన్నది. అయితే జగతిని డ్రైవింగ్ నుంచి తప్పించి.. మహేంద్ర డ్రైవింగ్‌కు సిద్దమయ్యాడు. అయితే కారును అడ్డదిడ్డంగా డ్రైవ్ చేస్తూ.. వెనుక సీట్లలో రిషి, వసుధార ఒకరిపై మరొకరు పడేలా ప్లాన్ చేశాడు.
ఇక నిశ్చితార్థం ఉంగరంపై V అక్షరంతో రిషి రాయించడంపై ఆలోచన్లో పడింది. V అక్షరంతోపాటు R లెటర్‌ను కూడా డిజైన్ చేసి ఉంగరం చేయిస్తాను.కానీ ఆ ఉంగరం కోసం ఖర్చు బాగానే అవుతుంది. అంతా డబ్బు ఎలా అంటూ ఆలోచనల్లో పడింది. అయితే రిషి సార్‌ను జీతంలో అడ్వాన్స్ అడిగి రింగ్ చేయిస్తాను అని అనుకొన్నది.


Click it and Unblock the Notifications











