For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu వసుధార, రిషి మధ్య ఏదో ఉంది.. సాక్షితో కలిసి దేవయాని మరో కుట్ర

  |

  క్లాస్ రూమ్‌లో ఎంగేజ్‌మెంట్ రింగుపై VR అక్షరాలు చెక్కించేందుకు వసుధార ఆలోచిస్తుంటే.. గుర్తించిన రిషి.. బ్లాక్ బోర్డుపై ఒక ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమని అడిగాడు. అయితే ఒక గ్రామ్ బంగారం ధర గురించి ఆలోచిస్తూ ఆ లెక్కలను బోర్డు రాయడంతో ఏమిటి ఈ లెక్కలు అంటూ రిషి ప్రశ్నించాడు. అయితే క్లాస్ రూమ్‌లో అరిస్తే బాగుండదు అని సరే.. మీరు వెళ్లండి అంటూ వసుధారను కూర్చోమని పంపించాడు. తనను అదోలా వసుధార చూస్తుంటే రిషి కంగారు పడ్డాడు. గుప్పెడంత మనసు సీరియల్‌లో 534 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

   రిషి మూడ్ ఎలా ఉంటుందో

  రిషి మూడ్ ఎలా ఉంటుందో


  కారు డ్రైవింగ్ గురించి గౌతమ్, జగతి, గౌతమ్ మధ్య భారీ చర్చ జరిగింది. డ్రైవింగ్‌లో ఊహకు అందని జోష్ ఉంటుందంటూ మహేంద్ర ఏదో చెప్పబోతుండగా.. జగతి వారించింది. దాంతో కారు డ్రైవింగ్ టాపిక్ అంతటితో ఆగింది. ఆ తర్వాత రిషి మూడ్ ఎలా ఉంటుందో అనే విషయంపై గౌతమ్, మహేంద్ర మధ్య చర్చ జరిగింది. అయితే రిషి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం అంటూ మహేంద్ర ఏదో చెప్పబోతుండే.. మహేంద్ర అంటూ మధ్యలోనే జగతి ఆపేసింది. అయితే ఫైనలియర్ ఎగ్జామ్స్ జరుగుతండగా.. రిషి మూడ్ దాని గురించే ఆలోచిస్తుంటుంది అని జగతి చెప్పింది.

   ఫైనలియర్ ఎగ్జామ్స్ కోసం అంటూ

  ఫైనలియర్ ఎగ్జామ్స్ కోసం అంటూ


  రిషితో మీటింగ్‌ కోసం జగతి, మహేంద్ర, గౌతమ్ వెళ్లారు. ఫైనలియర్ ఎగ్జామ్స్ కోసం పిల్లల్ని ప్రిపేర్ చేయాలని. అందరూ పాస్ అవ్వాలి. ర్యాంకులు, మార్కులు అంటూ ఒత్తిడి పెట్టవద్దు అని రిషి అంటే.. అవును మేధస్సును మార్కులతో కొలవలేం అని జగతి అంది. ఎగ్జామ్స్ కోసం ఓ ప్లాన్ రాశాను. ఏదైనా అనుమానం ఉంటే జగతి మేడమ్‌ను అడగండి.. ఈ రోజుకు మీటింగ్ అయిపోయింది. జగతి మేడమ్ మీరు ఉండండి మీతో మాట్లాడాలి అంటే.. మహేంద్ర నేను ఉండాలా అంటే.. మీరు వెళ్లండి డాడ్ అంటూ రిషి చెప్పాడు.

   వసుధార యూత్ ఐకాన్ అంటూ

  వసుధార యూత్ ఐకాన్ అంటూ


  జగతి మేడమ్‌తో రిషి మాట్లాడుతూ.. మీ స్టూడెంట్‌కు మీరు ఒక మాట చెప్పాలి. వసుధారకు గతంలో మాదిరిగా ఏకాగ్రత ఉండటం లేదు అని రిషి అంటే.. రిషి సార్.. అంటూ జగతి అంటే.. సార్ అనవద్దు అని చెప్పానుగా అని రిషి అన్నాడు. అయితే వసుధారకు ఏం చెప్పాలి రిషి అని జగతి అంటే.. వసుధార యూత్ ఐకాన్. ఈ కాలేజికి మంచి పేరు తెచ్చింది. కానీ తన చేతిపై ఏదేదో రాసుకొంటున్నది. తాను యూనివర్సిటీ టాప్ ర్యాంకర్‌ కావాలి. ఆమె లక్ష్యాన్ని గుర్తు చేయండి అని రిషి అంటే.. రిషి టాప్ స్టూడెంట్ అయినా ఆమె ఒక అమ్మాయి మాత్రమే అని గుర్తించాలి. జీవితం పట్ల ఆశలు ఉంటాయి. ఆ విషయంలో ఆమె డిస్ట్రబ్ అయిందేమో అని జగతి చెప్పింది. అలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికితే వసుధార ప్రశాంతత లభిస్తుందేమో. వసుధార విషయంలో ఇది నా అభిప్రాయం మాత్రమే అని జగతి చెప్పింది.

  రిషిని దారిలోకి తెచ్చుకొందాం అంటూ దేవయాని

  రిషిని దారిలోకి తెచ్చుకొందాం అంటూ దేవయాని


  పెళ్లి నిశ్చితార్థం బ్రేకప్ తర్వాత మళ్లీ దేవయానిని సాక్షి కలిసింది. నిశ్చితార్థం ఉంగరంపై V అనే అక్షరం ఏలా రాయిస్తాడు అని సాక్షి అంటే.. అయితే ఆ కారణంగా నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకోవడం తప్పు. బంగారు లాంటి అవకాశాన్ని చేజార్చుకొన్నావు. రిషి, వసుధార మధ్య ఏదో జరుగుతుందని అందరికి తెలుసు. నీవు పెళ్లి చేసుకొన్న తర్వాత రిషిని నీ దారికి తెచ్చుకోవాల్సింది. ముందు నీ మీద రిషికి ఉన్న కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేద్దాం. రిషిని పెళ్లి వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ప్రస్తుతం ఫైనలియర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి వారి మధ్య చనువు పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి వారిద్దరి మధ్య నీవు మరోసారి రంగ ప్రవేశం చేయాలి అని సాక్షికి దేవయాని తన ప్లాన్ చెప్పింది.

   వసుధార రెస్టారెంట్‌లో లేకపోవడంతో

  వసుధార రెస్టారెంట్‌లో లేకపోవడంతో


  ఇక వసుధారను కలువడానికి రిషి రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ వసుధార కనిపించకపోవడంతో ఎక్కడ అని అడిగితే.. అర్ధగంట పర్మిషన్ అడిగి వెళ్లిపోయిందని చెప్పడంతో రిషి కంగారు పడింది. ఆరోగ్యం ఏమైనా బాగాలేదా అని అడిగితే.. మీరు ఉండగా.. ఆమెకు ఏమౌతుంది అని రెస్టారెంట్ ఓనర్ అన్నాడు. అయితే వసుధార లేకపోవడంతో రిషి వెళ్లిపోయాడు. ఇక వసుధార ఇంటిలో ఎంగేజ్‌మెంట్ రింగ్ పట్టుకొని చూస్తూ ఉండిపోయింది. అంతలోనే రిషి రావడంతో వసుధార కంగారుపడిపోయింది.

  English summary
  Guppedantha Manasu Episode 534
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X