Bigg Boss Non Stop సూసైడ్ చేసుకొంటానని వార్నింగ్.. హౌస్ అరెస్ట్ అంటూ స్రవంతి చొక్కారపు ఎమోషనల్

బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోలో మార్నింగ్ టాస్క్‌లో తలుపుతట్టిన తొలి ప్రేమ అనే అంశాన్ని ఇంటి సభ్యులకు ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా తమ తొలి ప్రేమ అనుభవాలను చెప్పడానికి అవకాశం ఇచ్చారు. తొలి ప్రేమ ఇచ్చిన మధురస్మృతులు భవిష్యత్ జీవితానికి ఆధారంగా ఉంటాయి అని చెప్పారు. తమ ఫస్ట్ లవ్ అనుభవాలను, అవి జీవితంలో తెచ్చిన మార్పుల గురించి చెప్పాలని ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ లేఖ ద్వారా వివరించాడు. ఇంటి సభ్యులకు హార్ట్ ఆకారంలో ఉన్న ఓ బొమ్మను ఇచ్చి తమ తొలి ప్రేమ ఎవరితో జరిగిందనే విషయం చెప్పాలని సూచించాడు. ఆ టాస్క్‌లో భాగంగా స్రవంతి చొక్కారపు తన జీవితంలో చోటు చేసుకొన్న ప్రేమ కథ గురించి ఎమోషనల్‌గా చెప్పింది. స్రవంతి చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

అమీర్‌పేట గల్లిలో లవర్‌కు ప్రపోజ్

అమీర్‌పేట గల్లిలో లవర్‌కు ప్రపోజ్

నా ఫస్ట్ లవ్ నా భర్త ప్రశాంత్.. అమీర్ పేటలో హాస్టల్‌లో ఉండేదానిని. నా రూంమేట్‌కు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్లిద్దరు జ్యూస్ తాగడానికి వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్లారు. అప్పుడు ప్రశాంత్‌ను తొలిసారి అమీర్‌పేట గల్లిలో చూశాను. ఆ తర్వాత ప్రశాంత్‌కు ప్రపోజ్ చేశాను. కానీ అతడు రిజెక్ట్ చేశాడు. అలా ఆర్నెళ్లు వెంటపడ్డాను. దాంతో ఆయన ఓకే చెప్పాడు. అయితే నా ఫ్రెండ్ నా ప్రేమ గురించి మా ఇంట్లో చెప్పింది. కానీ మా ఇంటిలో ఒప్పుకోలేదు. ఆ తర్వాత నన్ను హౌస్ అరెస్ట్ చేశారు అని స్రవంతి చొక్కారపు తెలిపింది.

ప్రియుడితో ఏడాది గ్యాప్

ప్రియుడితో ఏడాది గ్యాప్

మా ఇంటి వాళ్లు నాపై కోపంతో ఇంటికే పరిమితం చేశారు. ప్రశాంత్‌కు నాకు మధ్య ఒక సంవత్సరంపాటు ఎలాంటి కనెక్షన్ లేదు. మా ఇంటి వాళ్లు నాకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ సమయంలో కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి ప్రశాంత్‌కు పరిస్థితి వివరించాను. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకొంటే నిన్ను మాత్రమే చేసుకొంటాను. లేకపోతే నేను సూసైడ్ చేసుకొంటానని చెప్పాను. దాంతో వారం రోజులు మేనేజ్ చేయమని చెప్పి నాకు ధైర్యం చెప్పాడు అని స్రవంతి చొక్కారపు చెప్పింది.

యాదగిరి గుట్టలో పెళ్లి చేసుకొని..

యాదగిరి గుట్టలో పెళ్లి చేసుకొని..


ప్రశాంత్‌తో మాట్లాడిన తర్వాత నేను 500 రూపాయలు పట్టుకొని బస్సులో హైదరాబాద్‌కు వచ్చాను. ఆ తర్వాత యాదగిరిగుట్టకు వెళ్లి పెళ్లి చేసుకొన్నాం. ఓ సంవత్సరం తర్వాత ప్రశాంత్ వాళ్ల ఇంట్లో ఒప్పించాడు. దాంతో మరోసారి మేము పెళ్లి చేసుకొన్నాం. ప్రశాంత్‌ బట్టల వ్యాపారం చేసేవాడు. అయితే కొన్ని కారణాల వల్ల నష్టపోయాం. అప్పుడు ఇద్దరం కష్టపడుదాం అని ధైర్యం చెప్పాను అని స్రవంతి చొక్కారపు తెలిపింది.

అమ్మ మరణవార్తతో అంటూ స్రవంతి ఎమోషనల్

అమ్మ మరణవార్తతో అంటూ స్రవంతి ఎమోషనల్

ఆర్థికంగా కుదుట పడే వరకు నేను మా అమ్మ వద్దకు వెళ్తానని చెప్పాను. దాంతో ప్రశాంత్ సరే అన్నాడు. కానీ ఉదయమే నాకు ఊహించని ఫోన్ వచ్చింది. ఆ ఉదయమే మా అమ్మ చనిపోయిందని ఫోన్ వచ్చింది. పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు నా భర్త, నా బాబు మాత్రమే నా ప్రపంచం. అదే నా ఫస్ట్ లవ్ అని స్రవంతి చొక్కారపు ఎమోషనల్ అయింది.

టాప్ కంటెస్టెంట్‌గా స్రవంతి చొక్కారపు

టాప్ కంటెస్టెంట్‌గా స్రవంతి చొక్కారపు

ప్రస్తుతం డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ తెలుగు నాన్ స్టాప్ టెలివిజన్ షోలో స్రవంతి చొక్కారపు టాప్ కంటెస్టెంట్‌గా కొనసాగుతున్నారు. తనదైన శైలిలో ఈ షోలో రాణిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. టైటిల్ రేసులో ముందుకు వెళ్తూ తన తోటి కంటెస్టెంట్లకు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X