Priyankaను మేము సపోర్ట్ చేయం.. డబ్బు కోసమే ఆపరేషన్.. అందుకే అంటూ సంచలనం!

ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా కొనసాగుతోంది. ఏ వారం ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు అనేది ముందు ఊహించేస్తున్నారు కానీ లోపల మాత్రం కంటెంట్ ఇవ్వడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నిజానికి హౌస్ లో ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నామో వారు ముందు ఎలిమినేట్ అవుతున్నారు. అయితే తాజాగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ మీద సొంత కమ్యూనిటీ వాళ్ళు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంచలన వ్యాఖ్యలు

సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ప్రస్తుతం ప్రియాంక అనే ఒక ట్రాన్స్ జెండర్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె గతంలో జబర్దస్త్ కామెడీ షో లో లీడ్ క్యారెక్టర్ లు వేసేది. తర్వాత తన లో స్త్రీ ఫీలింగ్స్ ఉన్నాయ్ అని తెలుసుకొని చాన్నాళ్ల తర్వాత ఆమె ఏం చేసే ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఇప్పుడు ఆమె ఆపరేషన్ గురించి హిజ్రాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి బిగ్ బాస్ సీజన్ 5 లో ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ పై బుల్లితెర ప్రేక్షకులు మొదటి నుంచి సానుభూతి చూపిస్తూ వస్తున్నారు. కానీ ప్రియాంక గేమ్ కన్నా మానస్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం ఇప్పుడు ఆమెను సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు సైతం నచ్చడం లేదు. ఆమెను అభిమానించే వారు కూడా మానస్ విషయంలో విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

నామినేషన్ అంటే భయం

నామినేషన్ అంటే భయం

గత సీజన్లో అవినాష్ లగా ప్రియాంక నామినేషన్ అంటే భయపడుతుందనే చెప్పాలి. ఆమెను నామినేషన్ చేయడానికి ఎవరైనా వస్తే ప్రాపర్ రీసన్ చెప్పండి అని పెద్ద ఎత్తున విరుచుకు పడుతుంది. మొత్తం మీద ఎలాగోలా నామినేషన్ ల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న ప్రేక్షకులు ప్రియాంక మీద అసహనం తోనే ఉన్నారు.

షాక్ తగిలింది

షాక్ తగిలింది


బిగ్ బాస్ లో ఉన్న ఏ కంటెస్టెంట్ కైనా తన ఆటతో పాటు బయటి నుంచి కూడా సెలబ్రిటీల సపోర్టు కూడా అవసరం.. వాళ్ల మద్దతుతో ఎంతో కొంత ఓట్లు పడతాయి. ఈమెకు కూడా నాగబాబు, ఇతర జబర్దస్ నటులు కూడా సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రియాంక సింగ్ కి అనుకోని విధంగా షాక్ తగిలింది అనే చెప్పాలి అదేంటి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్‌ చంద్రముఖి ప్రియాంక సింగ్ పై సంచలన కామెంట్లు చేశారు.

రెండేళ్లు చూస్తారు

రెండేళ్లు చూస్తారు

ప్రియాంక ఎవరో తనకు తెలియదని ఆమె తమ కమ్యూనిటీ కాదని అందుకే సపోర్ట్ చేసేది లేదని చంద్రముఖి తెలిపారు. సాధార‌ణంగా పుట్టిన‌ప్ప‌టి నుంచి ఆడ ల‌క్ష‌ణాలు ఉండి ఆ త‌రువాత అమ్మాయిల్లా బ‌ట్ట‌లు వేసుకుని హిజ్రాగా మారితేనే ట్రాన్స్‌జెండ‌ర్ అంటార‌ని, ఆమె అన్నారు. 'ట్రాన్స్ జెండర్‌గా మారడం అనేది చిన్న విషయం కాదన్న ఆమె నాలో అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయని డాక్టర్ దగ్గరకు వెళ్లి చెప్తే అతను ఫస్ట్ ఏం చెప్తాడంటే.. రెండేళ్ల పాటు ఆడపిల్లలాగే బట్టలు వేసుకుని ఉండమంటారని ఆ రెండేళ్లు కౌన్సిలింగ్ ఇస్తారని అన్నారు.

అది వేరు ఇది వేరు

అది వేరు ఇది వేరు

ఆ తర్వాత కూడా నీ బాడీలో ఎలాంటి మార్పులు లేకుండా అమ్మాయిగానే ఉండాలనిపిస్తే అప్పుడు సర్జరీకి ప్రిపేర్ చేస్తారు, అంతే కానీ చీరకట్టుకుని ఫెమినిటీని పెంచుకోవడం వేరని, పుట్టినప్పుడే ఫెమినిటీతో పుట్టడం వేరని అన్నారు. నేను పుట్టినప్పటి నుంచి అమ్మాయిగానే ఉన్నా కానీ కొంతమంది ఆడపిల్ల గెటప్స్‌ని వృత్తిగా ఎంచుకుని డబ్బుకోసం ట్రాన్స్ జెండర్‌గా మారుతున్నారని అంటూ ఆమె సంచలన వ్యాఖలు చేసారు.

Recommended Video

Sound Movie Opening | Arjun Varahi | Nirosha
అందుకే అలా

అందుకే అలా


ఆడపిల్ల గెటప్ వేస్తేనే ఇన్ని డబ్బులు వస్తున్నాయి.. పూర్తిగా ఆడపిల్లగా మారిపోతే ఇంకా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో ట్రాన్స్ జెండర్స్‌గా మారుతున్నారని అంటూ, ప్రియాంక ఆడ‌పిల్లలా మారాల‌నే కోరిక‌తో ఆ విధంగా మారింద‌ని, క‌నుక ఆమె త‌మ క‌మ్యూనిటీ కాద‌ని తెలిపారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ తమన్నా తమ కమ్యూనిటీ కాబట్టి మద్దతు ఇచ్చామని.. ప్రియాంక తమ కమిటీ కానందువల్ల సపోర్ట్ చేయలేమని స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X