బిగ్ బాస్ ఉత్సవం.. నాల్గో సీజన్ కంటెస్టెంట్లు కూడా.. లీక్ చేసిన హిమజ

ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం బిగ్ బాస్ కంటెస్టెంట్ల రచ్చే కనిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్లందరూ ఒకే చోటకు చేరుకున్నారు. బిగ్ బాస్ ఉత్సవం పేరిట అదిరిపోయే ఈవెంట్‌ను ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మొదటి మూడు సీజన్ల కంటెస్టెంట్ల అల్లరి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇందులో నాల్గో సీజన్ కంటెస్టెంట్లు పాల్గొనడం లేదా? అని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు.

బిగ్ బాస్ ఉత్సవం..

బిగ్ బాస్ ఉత్సవం..

మూడు సీజన్ల కంటెస్టెంట్లు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. బిగ్ బాస్ ఉత్సవం పేరిట నిర్వహిస్తోన్న ఈవెంట్‌లో కంటెస్టెంట్లందరూ రచ్చ చేశారు. బిగ్ బాస్ రీ యూనియన్‌లా కనిపిస్తున్నా కూడా కొంతమంది మాత్రం హాజరు కానట్టు కనిపిస్తోంది. ప్రతీ సీజన్‌లో ఇద్దరుముగ్గురు గౌర్హాజరైనట్టున్నారు.

వారెవ్వరూ లేరు..

వారెవ్వరూ లేరు..

బిగ్ బాస్ మొదటి సీజన్ కంటెస్టెంట్లలో చాలా మంది ఈ ఈవెంట్‌కు రాలేదు. నవదీప్, సమీర్, జ్యోతి, అర్చన, ముమైత్ ఖాన్, మధుప్రియ, సంపూర్ణేశ్ బాబు ఇలా ఎవ్వరూ కూడా ఈ ప్రోగ్రాంకి రాలేదు. ఇక రెండో సీజన్ నుంచి తనీష్, దీప్తి సునయన, అమిత్, తేజస్వీ వంటి వారు రాలేదు. ఇలా మొత్తంగా కొంత మంది మాత్రం ఈవెంట్‌కు దూరంగానే ఉన్నారు.

ఒకే ఫ్రేంలో విజేతలు..

ఒకే ఫ్రేంలో విజేతలు..

అయితే ఈ ఈవెంట్‌లో బిగ్ బాస్ విజేతలు బాగానే హల్చల్ చేశారు. మొదటి సీజన్ విజేత శివ బాలాజీ, రెండో సీజన్ విజేత కౌశల్, మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌లు ఒకే ఫ్రేంలో కనిపించి సందడి చేశారు. ఇక వీరే కాకుండా బిగ్ బాస్ ఫ్యామిలీ అంతా కూడా ఒకే ఫ్రేంలో కనిపించడంతో ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎంత మందిని ట్యాగ్ చేయాలి..

ఎంత మందిని ట్యాగ్ చేయాలి..

ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ ఒకే ఫోటోలు ఉండటంతో ఎంత మందిని ట్యాగ్ చేయాలంటూ హిమజ ఫన్నీ కామెంట్ చేసింది.అయితే వీలైనంత మంది కంటెస్టెంట్ల పేర్లను ట్యాగ్ చేసింది. ఆ ఫోటోను షేర్ చేస్తూ అందరినీ ట్యాగ్ చేయడమే కాకుండా ఇంకో అనుమానాన్ని కూడా తీర్చేసింది.

Recommended Video

KGF Chapter 2 : Yash & Prashant Neel Plans For a Powerful Climax
నాల్గో సీజన్ కూడా..

నాల్గో సీజన్ కూడా..

ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఫోటోల్లో కేవలం మూడు సీజన్ల కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. అయితే ఇందులో నాల్గో సీజన్ కంటెస్టెంట్లు లేరా? అనే అనుమానం అందరిలోనూ కలిగింది. నాల్గో సీజన్ కంటెస్టెంట్లు కూడా త్వరలోనే జాయిన్ కాబోతోన్నారని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X