twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పున్ను ఎలిమినేషన్.. హిమజ తీన్మార్.. చిల్లర వేశాలంటూ నెటిజన్లు ఫైర్

    |

    మనం పోయినా పర్లేదు.. పక్కవారు పోతే ఇంకా ఎక్కువ సంబర పడే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి లిస్ట్లో హిమజ చేరింది. పునర్నవి ఎలిమినేట్ అయిందని హిమజ ఎగిరి గంతులేసింది. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది.

    మొదట్నుంచీ ఇలాంటి డిఫరెంట్ మెంటాల్టీతో హిమజ ఉంది. అందరూ ఒక మూడ్లో ఉంటే.. ఈమె మాత్రం ప్రత్యేకంగా ఉండేది. అందరూ శ్రద్దగా వింటుంటే.. మధ్యలో రియాక్షన్ ఇస్తూ లేచి క్లాప్స్ కొట్టింది. ఏంటి అని అడిగితే అది నా ఎమోషన్ అని చెబుతుంది. కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చర్చిస్తున్నప్పుడు కూడా ఇలానే చేసింది. అందరూ వింటూ ఉంటే.. ఈమె మాత్రం ఎగ్జైట్ అయిపోయి.. ఓవరాక్షన్ చేసింది. ఇలా ప్రతీసారి ఏదో ఒక విషయంలో అందరి కంటే భిన్నంగానే ప్రవర్తించేంది.

    Himaja Dance On Punarnavi Elimination Goes Viral Netizens Trolling Himaja

    హౌస్మేట్స్ కూడా ఈమెతో ఉండటానికి, మాట్లాడటానికి భయపడేవారు. ఎప్పుడు ఎలా ఉంటుందోనని. అయితే పునర్నవి కూడా కొంచెం ఇలాంటి మైండ్ సెట్తోనే ఉంటుంది. వీరిద్దిరికీ హౌస్లో ఢీ అంటే ఢీ అనేలా ఉండేది. నామినేషన్ విషయం వచ్చేసరికి ఇద్దరూ ఒకేలానే ఉంటారు. ఏదీ ఓ పట్టాన ఒప్పుకోరు. ఎదుటివారు చెప్పేది వినరు. తమకు నచ్చిందే చేస్తామనే టైపు. దీంతో వీరిద్దరికి అంత సఖ్యత ఏర్పడలేదు.

    అయితే అదంతా హౌస్లో ఉండేవరకే అనుకుంటారు. కానీ ఇక్కడే హిమజ అంటే ఏంటో అందరికీ అర్థమవుతుంది. పునర్నవి ఎలిమినేట్ అయిందని నాగార్జున ప్రకటించిన వెంటనే.. టీవీ ముందుకు వచ్చి మరీ తీన్మార్ డ్యాన్సులు వేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ఛేసంది. ఇక దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇవి చిల్లర వేశాలంటూ కొందరు కామెంట్లు చేయగా.. అవును దాంట్లో తప్పేముందంటూ ఇంకొంత మంది మద్దతు తెలుపుతున్నారు. ఎంత కోపం ఉంటే మాత్రం అలా పిచ్చిదానిలా గంతులు వేయాలా? ఒకరు ఎలిమినేట్ అయితే అంత పైశాచిక ఆనందమా? ఆ కోపాలన్నీ బిగ్ బాస్ హౌస్లోనే వదిలేయాలి కానీ బయట కూడా అలానే ఉంటే ఎలా అంటూ ఇంకొంత మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై హిమజ అభిమానులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

    English summary
    Himaja Is So Happy And She Danced On Punarnavi Elimintaion. She Posted That Video On Social Media. Netizens Trolls Her On It. Himja Fans Defending Her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X