Don't Miss!
- Sports DC vs SRH: ట్రావిస్ హెడ్ అన్‌స్టాపబుల్.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
హిమజ ఎమోషనల్ పోస్ట్.. ఫ్రెండ్‌తో కలిసి రెస్టారెంట్లో రచ్చ చేస్తోందిగా..
బిగ్ బాస్ మూడో సీజన్లో టిపికల్ కoటెస్టెంట్గా పేరు సంపాందించుకుంది హిమజ. వచ్చిన రోజే ఏడ్చేసిన మొదటి హౌస్ మేట్.. తొమ్మిది వారాలు సక్సెస్ ఫుల్ గా బిగ్ బాస్ హౌస్‌లో జర్నీ చేసింది. ఫైనల్ వరకు ఉండాలని కోరుకున్న హిమజ.. అర్థాంతరంగా ఎలిమినెట్ అయింది. తాజాగా బయటి ప్రపంచంలోకి ప్రవేశించిన ఆమె ఇప్పుడు స్వేచ్ఛగా జీవితాన్ని అనుభవిస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టింది. ఇంతకీ ఎమోషనల్ పోస్టు ఏమిటంటే..
అందరితో గొడవలు..
బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే హేమ తో గొడవ పడింది. మానిటర్ గా ఉన్న హేమ నిర్ణయాన్ని ధిక్కరించి.. రచ్చ చేసింది. ఇలా ప్రతీ వారం ఎవరితో ఒకరితో పొట్లాడుతూనే ఉంది. తన స్వభావమే అంత అంటూ చెప్పుకునే హిమజకు.. లోపల ప్రాణ స్నేహితులంటూ ఒక్కరు కూడా దగ్గర కాలేకపోయారు.
అలీ కాళ్ళ పై పడి ఏడవడం.. పున్నుతో వాగ్వాదం
టాస్క్‌లో భాగంగా అలీ తన జేబులోంచి డబ్బులు తీసుకునే ప్రయత్నంలో.. కాలి తో మొహంపై తన్నింది. న బాడీ లాంగ్వేజ్ అంతే అంటూ బుకాయించింది. ఎంతో పెద్ద మాటల యుద్ధం తరువాత కాళ్లపై పడి ఏడుస్తూ క్షమించమని అడిగింది. ఇక నామినేషన్ విషయంలో పునర్నవి-హిమజలు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు.
హిమజకు ఆప్యాయంగా పిలిచే ఒకే వ్యక్తి వరుణ్..
రాఖీ పండగ రోజు వరుణ్ చేతికి హిమజ రాఖీ కట్టింది. వరుణ్ అన్న అని పిలిస్తూ ఉంటుంది. వరుణ్ కూడా కొన్ని సందర్భాల్లో హిమజకు తోడుగా నిలిచాడు. చివరకు ఆమె కోసం పేడ తొట్టె లో పడుకున్నాడు. కానీ వరుణ్ కష్టం వృథా ఐపోయిందనుకోండి అది వేరే విషయం.
ఎలిమినెట్ అయిన అనంతరం భావోద్వేగ పోస్ట్.. ఫ్రెండ్ తో కలిసి హల్చల్..
ఎలిమినెట్ అయిన తరువాత.. బయటకు వచ్చిన హిమజ తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఇన్ని రోజులు తనకు సపోర్ట్ చేసి.. ఇంత దూరం తనను నడిపించిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఇక తన రోజాతో కలిసి రెస్టారెంట్ కు వెళ్ళింది. ఇన్ని రోజులు మిస్ అయిన వంటకాలన్ని ఆరగించింది. కొన్ని ఐటమ్స్ అందడం లేదంకుంటా.. అయితే అందుకుని తినడానికి హిమజ ప్రయత్నిస్తుంటే.. తన స్నేహితురాలు రోజా వెనక్కు లాగుతోంది. దీంతో.. ఆమెను ఎవరైనా ఆపండి అంటూ పిక్ ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది.