twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుమ సాక్షిగా తన ఫ్రస్ట్రేషన్ బయటపెట్టిన హిమజ.. మొత్తానికి ఉతికేసింది.. వీడియో వైరల్

    |

    Recommended Video

    #Himaja reaction for #BiggBossTelugu3 housemates

    ఈ మధ్యకాలంలో బుల్లితెర షోలకు పాపులారిటీ భారీగా పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఇంటిల్లిపాదికి వినోదాల విందిస్తున్నారు బుల్లితెర హేమాహేమీలు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు యాంకర్ సుమ. ప్రతీ రోజు ఎన్నో ఛానళ్లలో ఎన్నో షోస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూ మాటల తూటాలు పేల్చుతుంటుంది సుమ. ఈ కోవలోనే తాజాగా ఓ కార్యక్రమంలో బిగ్ బాస్ కంటిస్టెంట్ హిమజలోని ఫ్రస్ట్రేషన్ బయటపెట్టే ప్రయత్నం చేసింది. ఆ సంగతులు చూద్దామా..

     ట్రెండ్ మారింది.. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు

    ట్రెండ్ మారింది.. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు

    ఒకప్పటిలా లేవు రోజులు. టెక్నాలజీ విస్తరిస్తుండటంతో ఏ రోజు కారోజు ట్రెండ్ మారుతూ వస్తోంది. సోషల్ మీడియా వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. సో దీన్ని క్యాచ్ చేసుకుంటూ తమ తమ షోస్‌కి పాపులారిటీ తెచ్చుకుంటున్నారు బుల్లితెర షో నిర్వాహకులు. రాబోయే షో తాలూకు ప్రోమోలు విడుదల చేస్తూ ఆడియన్స్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.

    తోటి బిగ్ బాస్ కంటిస్టెంట్స్‌పై హిమజ ఫీలింగ్స్

    తోటి బిగ్ బాస్ కంటిస్టెంట్స్‌పై హిమజ ఫీలింగ్స్

    ఈ మేరకు తాజాగా విడుదల చేసిన F3 షో ప్రోమోలో బిగ్ బాస్ సీజన్ 3 కంటిస్టెంట్ హిమజ లోని ఫీలింగ్స్ చూపించారు. ఇటీవలే బిగ్ బాస్ నుంచి ఈమె ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో తోటి బిగ్ బాస్ కంటిస్టెంట్స్ పై ఆమెకున్న ఫీలింగ్ బయటపెట్టేలా ఓ టాస్క్ రూపొందించి కిక్కిచ్చారు F3 షో నిర్వాహకులు. ఈ షోకి యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

    ఆ ముగ్గురినీ ఉతికి ఆరేసిన హిమజ..

    ఆ ముగ్గురినీ ఉతికి ఆరేసిన హిమజ..

    ఎవరిపై అయితే కోపం ఉంటుందో వారిని ఓ బొమ్మ రూపంలో అక్కడ పెట్టేసి లోపలున్న ఫ్రస్ట్రేషన్ బయటపెట్టడంతో ఆ కిక్కే వేరుంటుంది. తాజాగా విడుదలైన ఈ ప్రోమో వీడియోలో సరిగ్గా అదే కనిపిస్తోంది. సుమ సాక్షిగా శ్రీముఖి, పునర్నవి, వితిక ముగ్గురినీ ఉతికి ఆరేసింది హిమజ. ఈ రకంగా వారిపై ఉన్న కోపాన్ని అందరికీ తెలియజేసింది.

    చితకబాదేసిన హిమజ.. కోపాన్ని బయటపెట్టింది

    సుమ కనకాల హోస్టుగా ఉన్న F3 షోకి హాజరైన హిమజ..బిగ్ బాస్ కంటెస్టెంట్లపై మీకున్న ఫీలింగ్స్ చూపించండి అనగానే రెచ్చిపోయింది. ఒక్కొక్కరితో ఓ ఆట ఆడేసుకుంది. ముఖ్యంగా పునర్నవి, వితిక, శ్రీముఖి పేర్లు చెప్పగానే ఆ బొమ్మలను ఓ రేంజ్‌లో చితకబాది వాళ్లపై ఉన్న కోపాన్ని బయటపెట్టింది హిమజ. దీంతో ఈ వీడియో ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.

    అనుకున్న దానికి భిన్నంగా

    అనుకున్న దానికి భిన్నంగా

    బిగ్ బాస్ సీజన్ 3 లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది హిమజ. చివరి వరకు ఉంటుందేమో అనుకుంటే ముందుగానే ఎలిమినేట్ అయిన ఈమె.. బయటికి వచ్చాక బిగ్ బాస్ కంటిస్టెంట్లపై సంచలన కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.

    English summary
    Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna. Recently Himaja eliminated from this show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X