అవి చెబితే కాపురాలు కూలిపోతాయ్.. ఎఫైర్, బ్రేకప్ పై బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ..

Himaja: బిగ్ బాస్ బ్యూటీ, నటి హిమజ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. టీవీ సీరియల్స్ లలో యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ ఫేమ్ తో వెండితెరపై అడుగుపెట్టింది. అలా చిత్రలహరి, వినయ విధేయ రామా, జంబలకడిపంబ, ఉన్నదే ఒకటే, జిందగీ, స్పైడర్ వంటి తదితర సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హిమజ. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 అడుగుపెట్టి తన డేరింగ్ అండ్ డాషింగ్ ఆటతీరుతో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కాకపోయినా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది ఈ అమ్మడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..హిమజ తన బ్రేకప్ లవ్ స్టోరీ పై గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..?

బిగ్‌ బాస్ సీజన్ 3తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన హిమజ, షో తర్వాత కూడా తన కెరీర్‌ను నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయింది. చాలామంది బిగ్‌ బాస్ తర్వాత మళ్లీ కనిపించకుండా పోయినా, హిమజ మాత్రం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, రెస్టారెంట్‌ ప్రమోషన్లు, రిబ్బన్ కట్టింగులు, యూట్యూబ్ ఛానల్ ఇలా అన్ని వైపులా బిజీగా మారింది. అంతేకాదు.. ఆమె సొంతంగా 'లిటిల్ లేడీస్ బాస్కెట్' అనే బిజినెస్‌ను ప్రారంభించి, రెండు చేతులా సంపాదిస్తూ ముందుకు సాగుతోంది. ఇటీవల హిమజ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాల్యం, లవ్ స్టోరీస్, బ్రేకప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తన ఫోకస్ పూర్తిగా కెరీర్‌పైనేనని తేల్చి చెప్పింది.

Himaja Opens Up About Her Childhood Love Media Misrepresentation and Life After Bigg Boss

హిమజ మాట్లాడుతూ.. 'నాకు పెద్దగా లవ్ లెటర్స్ రావు.. ప్రపోజల్స్ రావు.. ఫ్లవర్స్ మాత్రమే వస్తాయి' అంటూ నవ్వుతూ చెప్పింది. తాను కూడా ప్రేమించానని, తనను చాలామంది ప్రేమించారని అంగీకరించింది. అయితే ప్రేమను 'బ్రేకప్'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 'లవ్ అంటే ఒక రోజు చేసేది కాదు. అది మనసులో ఉండే భావన. ఒకసారి ఎవరో హార్ట్‌లోకి వచ్చారంటే.. అది లైఫ్‌లాంగ్ అలాగే ఉంటుంది. అది సినిమాలో నటించే క్యారెక్టర్ కాదు కదా," అంటూ హిమజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

మీ హార్ట్ లో ఎవరైనా ఉన్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. హిమజ మాట్లాడుతూ.. తన హృదయంలో ఎనిమిదో తరగతిలో ప్రేమించిన ఒక వ్యక్తి ఇప్పటికీ ప్రత్యేక స్థానం కలిగి ఉన్నట్లు చెప్పింది. ఆ సమయంలో జరిగిన అమాయకమైన ప్రేమ తనలో ఒక మధుర జ్ఞాపకంగా ఉందని పేర్కొంది. అలాగే.. ఓ యూట్యూబ్ ఛానల్ తప్పుడు హెడ్డింగ్ పెట్టిన విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది.

"చిన్నప్పుడు ఎవరినైనా లవ్ చేశావా? పేరు చెప్పు అని అడిగారు. కానీ వారు ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవిస్తూ ఉండొచ్చు. వారి పేర్లు బయట పెట్టి, వారి కుటుంబాలను ఎందుకు డిస్టర్బ్ చేయాలి? అనే భావంతోనే మాట్లాడాను. కానీ దాన్ని 'నేను నోరు విప్పితే కాపురాలు కూలిపోతాయి' అనే హెడ్డింగ్ పెట్టారని క్లారిటీ ఇచ్చింది.

ఆ ఇంటర్య్వూ చేసింది తన ఫ్రెండేననీ, వ్యూస్ కోసం అలా చేసింది. కానీ, అందులో మ్యాటర్‌తో హెడ్డింగ్‌కు అసలు సంబంధం లేదు' అని హిమజ ఆవేదన వ్యక్తం చేసింది. తన చిన్ననాటి ప్రేమ గురించిన విషయాన్ని స్పష్టం చేస్తూ హిమజ చెప్పింది. 'అతన్ని ఎనిమిదో తరగతిలో ఒకసారి మాత్రమే చూసా.. అప్పటి నుంచి ఎప్పుడూ కలవలేదు, మాట్లాడలేదు. ఇప్పుడు అతని పేరు కూడా గుర్తు లేదని చెప్పింది. మొత్తానికి సోషల్ మీడియా కోసం తప్పుడు ప్రచారం చేసే యూట్యూబ్ ఛానల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన అసలు భావాన్ని వక్రీకరించి చూపడం సరైంది కాదని, వ్యక్తిగత జీవితాన్ని వ్యూస్ కోసం ఉపయోగించకూడదని ఆమె స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X