‘బిగ్ బాస్’లో సైకో బిహేవియర్.. నాకు దక్కనిది ఎవరికీ దక్కొద్దు అంటూ అన్నీ పగలగొట్టేసింది
Recommended Video
బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'.. మూడు గొడవలు.. నాలుగు ఫైటింగులుగా సాగుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా హౌస్‌లో మరోసారి రచ్చ జరిగింది. అయితే, ఈ సారి ఎవరూ ఊహించని కంటెస్టెంట్ చేయడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్.. ఏం చేశారు..?

సాధారణ కంటెస్టెంట్.. కానీ వివాదాలు ఎక్కువ
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరిలో సాధారణంగా ఉంటుంది హిమజ. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదని, తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. కానీ, వివాదాలు మాత్రం ఆమె చుట్టూనే జరుగుతూ ఉంటాయి. దీంతో నామినేషన్‌ను కూడా ఆమె పలుమార్లు ఎదుర్కొంది. దీంతో హిమజ తరచూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

వివాదాలు ఆమెతోనే మొదలు
బిగ్ బాస్ ప్రారంభ వారంలో హిమజతోనే వివాదాలు ప్రారంభమయ్యాయి. ఆ ఎపిసోడ్‌లో తనను శ్రీముఖి నామినేట్ చేసిందన్న కారణంతో హిమజ ఏడవడం ప్రారంభించింది. అప్పుడు శ్రీముఖితో మానిటర్‌గా ఉన్న హేమతో హిమజ గొడవకు దిగింది. దీనికి వెంటనే శ్రీముఖి సారీ చెప్పేసింది. అయినా.. ఈ గొడవ ఆగలేదు. ‘నిందలు పడడం మీకు ఇష్టమేమే.. నాకు ఇష్టం లేదు' అని హేమను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి.
అలీ కాళ్లు పట్టుకుంది
ఓ వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో అలీ రేజాతో హిమజ గొడవకు దిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అలీ.. హిమజను తాకడం.. అప్పుడు ఆమె అతడిని కాలితో తన్నడం జరిగింది. దీంతో అలీ సీరియస్ అయ్యాడు. హిమజకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఫైర్ అయ్యాడు. అప్పుడు చేసేదేం లేక హిమజ.. అలీకి సారీ చెప్పింది. అయినా అతడు ఆగకపోవడంతో వెళ్లి కాళ్లు పట్టుకుంది. దీన్ని నాగార్జున కూడా ప్రస్తావించడం విశేషం.

ఇప్పుడు పగలగొట్టేసింది
ఇక, శుక్రవారం జరగబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. అందులో హిమజ.. ఆమ్లెట్ తింటుండగా బాబా భాస్కర్ ఏదో అంటాడు. దీంతో వెంటనే హిమజ.. తినే ఆమ్లెట్‌ను పడేస్తుంది. అంతేకాదు, తన ప్లేట్‌నే నేలకేసి కొడుతుంది. ఆ తర్వాత కిచెన్ రూమ్‌లో ఉన్న గుడ్లు అన్నింటినీ ఎత్తేస్తుంది. అప్పుడు అవన్నీ పగలిపోయాయి. ఆ సమయంలో నేను తినకపోతే ఎవరూ తినకూడదు అని అనుకుంటూ వెళ్లిపోయింది.

ఎందుకిలా చేసింది
ఎప్పుడూ కామ్‌గా ఉండే హిమజ ఒకేసారి సైకోలా బిహేవ్ చేయడం ఏంటని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. తనకు దక్కకపోతే మరెవరికీ దక్కకూడదు అని అనడం సైకో ప్రవర్తన కిందికే వస్తుందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే, హిమజ అలా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో బిగ్ బాస్ ఏమైనా సీక్రెట్ టాస్క్ ఇచ్చాడేమోనన్న టాక్ కూడా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











