‘హీన’మైన కామెంట్స్: మహేష్-వెంకీ ఫ్యాన్స్ కొట్టుకునేవారు, హీరోయిన్ల ఎక్స్‌ఫోజింగ్!

హిందీ బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న హీనా ఖాన్ సౌత్ సినిమా పరిశ్రమపై హీనమైన కామెంట్స్ చేశారు.

By Bojja Kumar

హిందీలో ప్రసారం అవుతున్న 'బిగ్ బాస్ 11' రియాల్టీ షోలో పాల్గొన్న నటి హీనా ఖాన్.... సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి చాలా హీనమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై సౌత్ సినిమా అభిమానులు మండి పడుతున్నారు.

Recommended Video

Filmibeat Today's Top 10 ఫిల్మి బీట్ టాప్ 10

హీనా ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.... సౌత్ సినిమా ప్రేక్షకలు బొద్దుగా ఉండే హీరోయిన్లను ఇష్టపడతారని, బొద్దుగా ఉంటూ చీర కట్టి ఎక్స్ ఫోజింగ్ చేసే వారికే అక్కడ అవకాశాలు అంటూ ఆమె కామెంట్ చేశారు. హీనా ఖాన్ సౌత్ సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన లేకుండా ఎంత అవివేకంగా కామెంట్స్ చేసిందో కింద చూడండి.

 అవకాశాలను వదులుకున్నాను

అవకాశాలను వదులుకున్నాను

సౌతిండియా ప్రేక్షకులు బొద్దుగా ఉండే హీరోయిన్లను ఇష్టపడతారు. నాకు కూడా గతంలో రెండు ఆఫర్లు వచ్చాయి. కానీ బరువు పెరగాలని షరతు పెట్టారు. అవి రెండుకూడా పెద్ద బ్యానర్లో వచ్చే సినిమాలే..... అని హీనా ఖాన్ చెప్పుకొచ్చారు.

డబ్బులు బాగా ఇస్తారు

డబ్బులు బాగా ఇస్తారు

సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు డబ్బులు బాగా ఇస్తారు, తనకు వెంకటేష్-మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు చిత్రంలో అవకాశం వచ్చిందని, తాను ఆవకాశాన్ని మిస్ చేసుకున్నానని హీనా ఖాన్ తెలిపారు.

వెంకీ, మహేష్ అభిమానులు కొట్టుకునే పరిస్థితి

వెంకీ, మహేష్ అభిమానులు కొట్టుకునే పరిస్థితి

దాదాపు 15, 20 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు, వెంకటేష్ కలిసి ఆ సినిమా చేశారని.... మహేష్ బాబు, వెంకటేష్ అభిమానులు ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి ఉండేది, ఆ పరిస్థితిని అదుపు చేయడానికే ఇద్దరూ కలిసి సినిమా చేశారంటూ.... హీనా ఖాన్ అన్నారు. సౌత్ సినిమా ఇండస్ట్రీ మీద ఏ మాత్రం అవగాహన లేకుండా ఆమె కామెంట్స్ చేస్తున్నారు అనడానికి హీనా ఖాన్ చేసిన ఈ హీనమైన కామెంట్సే నిదర్శనం.

నేను ఛాన్స్ వదులుకున్నా, పెద్ద హిట్టయింది

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో నాకు ఒక హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ చాన్స్ మిస్సయ్యాను. అది పెద్ద హిట్టయింది. అది మిస్సయ్యాననే బాధ ఏమీ లేదని, తన జీవితంలో తనకు దక్కిన దానితో సంతోషంగా ఉన్నానని హీనా ఖాన్ తెలిపారు.

 హీనా ఖాన్ వ్యాఖ్యలపై మండిపడ్డ హన్సిక

హీనా ఖాన్ వ్యాఖ్యలపై మండిపడ్డ హన్సిక

హీనా ఖాన్ వ్యాఖ్యలపై హన్సిక మండిపడింది. హన్సిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా హీనాఖానాకు గట్టిగా క్లాస్ పీకింది. బాలీవుడ్ కు చెందిన పలువురు నటీమణులు దక్షిణాది చిత్ర పరిశ్రమలో పనిచేశారని, ప్రస్తుతం పనిచేస్తున్నారనే విషయం హీనాఖానాకు తెలియదా అని ప్రశ్నించింది.

 సిగ్గులేదా? అంటూ ఘాటుగా

సిగ్గులేదా? అంటూ ఘాటుగా

ఈ విధమైన వ్యాఖ్యలు చేసిన హీనా ఖాన్ సిగ్గు పడాలని, ఆమె చెప్పిన మాటలన్నీ పనికిమాలిన మాటలేనని పేర్కొంది. తాను దక్షిణాది నటిని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని హన్సిక ట్వీట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X