For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ అమ్మాయికి "కండోమ్" ఎలావాడాలో నేర్పించారు: బిగ్‌బాస్ హౌస్‌లో సెక్స్ ఎడ్యుకేషన్ టాస్క్

  |

  బిగ్ బాస్ ఇంతకుముందంటే మనదగ్గర ఎక్కువ పాపులర్ కాలేదు గానీ ఈ సెలబ్రిటీ షో బాలీవుడ్ నుంచి తెలుగు ఫార్మేట్ లో కూడా మొదలయ్యి జనాలని ఆకట్టుకునే సరికి ఇప్పుడు బాలీవుడ్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 11 మీద మనవాళ్ళు కూడా బాగానే దృష్టి పెట్టారు అందుకే కాబోలు సౌత్ స్టార్లమీద కూడా సెతర్లు వేస్తూ కాస్త కాంట్రవర్సీ చేసి మరీ జనాలని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పార్టిసిపెంట్స్. ఇక ఈ షోలో కాంట్రవర్సీ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న హీనా ఖాన్ మరీ రెచ్చిపోతోంది.. పనిలో పనిగా కాస్త మసాలా విషయాలని కూడా కలిపి మరీ షో ని బాగానే రక్తి కట్టిస్తున్నారు...

  కండోం ఎలా వాడాలో నేర్చుకోవటం

  కండోం ఎలా వాడాలో నేర్చుకోవటం

  ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో హాట్ టాపిక్ ఏమిటంటే కండోం ఎలా వాడాలో నేర్చుకోవటం... అదే సెక్స్ ఎడ్యుకేషన్ అన్న మాట ఈ విషయం తెలియని వాళ్ళెవరుంటారు? అన్న అనుమానం మీకే కాదు వాళ్ళకీ వచ్చే ఉంటుంది గానీ అలా మాట్లాడితేనే కదా షో టీఆర్పీలు పెరిగి పోయేది.

  సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవేర్‌నెస్

  సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవేర్‌నెస్

  అందుకేనేమో ఈ వారం అంతా సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవేర్‌నెస్ తేవాలంటూ సల్మాన్ టాస్క్ ఇచ్చాడు. అందుకే బయటకూడా ఫ్రెండ్సే అయిన హీనా ఖాన్, శిల్పా షిండే ఇద్దరూ కలిసి ఇంకో కంటెస్టెంట్ సప్నా చౌదురీ కి కాండోం ఎలా వాడాలో చెప్పారన్న మాట..

  కండోమ్స్ ఎందుకు వాడతారో, ఎవరు వాడతారో తెలియదట

  కండోమ్స్ ఎందుకు వాడతారో, ఎవరు వాడతారో తెలియదట

  హర్యాణాలోని రోహ్‌తక్ కి చెందిన సప్నా ప్రస్తుతానికి డెల్లీలో స్థిరపడింది. ఈ అమ్మాయి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని హీనా, శిల్పా ఎలా ఆడేసుకుంటున్నారో జనాలకు కూడా బాగానే అర్థమవుతోంది. సప్నాకి అసలు కండోమ్స్ ఎందుకు వాడతారో, ఎవరు వాడతారో తెలియదట.. పాపం ఈ ఇద్దరూ ఆ అమ్మాయిని "ఎడ్యుకేట్" చేసారు.

  అసలు కండోం ఎలా వాడతారు

  అసలు కండోం ఎలా వాడతారు

  హీనా ఖాన్ అసలు కండోంస్ ఎంత ముఖ్యమో సేఫ్ సెక్స్ కీ కండోం కీ ఉన్న సంబందం ఏమిటో చక్కగా వివరించేసింది. అప్పటిదాకా అంతా తెలిసినట్టే మొహం పెట్టిన సప్నా "అసలు కండోం ఎలా వాడతారు?" అని అడగటంతో ఇద్దరూ షాకయ్యారు.

   ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడ లేదా?

  ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడ లేదా?

  ఇంతవరకూ అసలు ఎప్పుడూ ఈ విషయం ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడ లేదా? అసలు పుస్తకాల్లో కూడా చదవలేదా..?? అంటూ బోలెడు ఆశ్చర్యపడిపోయింది. పాపం సప్నా అసలు కండోం ఎలా వాడతారూ అన్నది కూడా ఇంతకాలం పెరిగిందన్న మాట..

  తిక్క రేగిపోవటం ఖాయం

  తిక్క రేగిపోవటం ఖాయం

  ఈ విషయాలు పక్కన పెడితే వీళ్ళు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలమీదా, టాలీవుడ్ మీదా వేస్తున్న సెటైర్లు చూస్తూంటే మాత్రం తిక్క రేగిపోవటం ఖాయం, మన డైరెక్టర్లు హీరోయిన్లని బాగా లావుపెరగమని ఒత్తిడి చేసి, గంతులేయిస్తారనీ, ఇక్కడ అభిమానుల కొట్లాటలు మత ఘర్షణలకన్నా ధారుణం అనీ హీనం గా మాట్లాడింది.

  వెంకటేష్ పక్కన చేయమని అడిగితే

  వెంకటేష్ పక్కన చేయమని అడిగితే "నో" చెప్పాను

  అసలు ఒక సినిమాలో వెంకటేష్ పక్కన చేయమని అడిగితే "నో" చెప్పాననీ, ఉత్తరాది హీరోయిన్లకు తమిళ, తెలుగు రాకపోతే నేర్పిస్తారు. అయినా రాకపోతే డైలాగులకు బదులు వన్ టూ త్రీలు చెప్పమంటారు అంటూ తిక్క తిక్కగా మాట్లాడింది హీనా ఖాన్... దక్షిణాది వాళ్ళ టీఆర్పీలకోసం వాళ్ళనే కించపరచటం వీళ్ళ స్ట్రాటజీ అన్న మాట. ఇంకో బాహుబలి పడితే గానీ ఈ తరహా వాగుడు ఆపరేమో.

  English summary
  This season is all about sex education in Bigg Boss Hina, Shilpa teach Sapna how to use a condom.., Hina Khan and Shilpa Shinde were seen giving a lesson to Sapna Choudhary on 'how to use a condom'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X