తమిళనాడు సీఎం అల్లు అర్జున్‌‌.. దళపతి విజయ్ ఎవరో తెలియదంటున్న హీరోయిన్

తమిళనాడు సీఎం దళపతి విజయ్ కదా? మీరేంటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటున్నారు. అయినా తమిళ సూపర్ స్టార్ విజయ్ తెలియకపోవడమేంటీ? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ, ఓ నటికి మాత్రం విజయ్ తెలియదంట. తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్‌ దళపతి రాజకీయ రంగప్రవేశం చేసి, తొలి ఎన్నికలోనే అధికారాన్ని దక్కించుకున్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదు చేశారు. ఈ మార్పు కేవలం తమిళ రాజకీయ వర్గాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అలాంటి సీఎం దళపతి విజయ్ ఎవరో తెలియదనడం నిజంగా ఆశ్చర్యకరమే. ఇంతకీ హీరోయిన్ ఎవరు? అసలేం జరిగింది?

హిందీ టెలివిజన్‌లో ప్రసారమవుతున్న ప్రముఖ కామెడీ-ఎంటర్‌టైన్‌మెంట్ షో 'లాఫ్టర్ చెఫ్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ సీజన్ 3'(Laughter Chefs Unlimited Entertainment Season 3)లో జరిగిన ఓ ఫన్నీ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా తెలుగు సినీ అభిమానుల దృష్టిని ఈ వీడియో బాగా ఆకర్షిస్తోంది. షోలో పాల్గొన్న బాలీవుడ్ నటి నందిని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

Hindi Actress Doesn t Recognize Tamil Nadu CM Vijay Mentions Allu Arjun Vijay Deverakonda Instead

ఈ షోలో భాగంగా సెలబ్రిటీల పేర్లను గుర్తించే ఒక ఫన్ గేమ్ నిర్వహించారు. ఆ గేమ్ లో పాల్గొన్న నందినికి 'తమిళనాడు సీఎం ఎవరు?'అనే ప్రశ్న వచ్చింది. అయితే ఆమెకు సమాధానం తెలియకపోవడంతో వెంటనే 'తెలియదు'అని చెప్పింది. ముందుగా అక్కడి వారు అవాక్కయారు. ఈ సమయంలో ఇతర కంటెస్టెంట్స్ కొన్ని క్లూలు ఇవ్వడం ప్రారంభించారు. అలా మొదటగా 'సూపర్ స్టార్'అనే క్లూ ఇవ్వగా నందిని వెంటనే 'అల్లు అర్జున్?'అంటూ షాకింగ్ సమాధానమిచ్చింది. ఆమె సమాధానం విన్న వెంటనే అక్కడున్నవారు ఒక్కసారి నవ్వుకున్నారు. 'కాదు'అని హోస్ట్ చెప్పడంతో నందిని కూడా ఆశ్చర్యపోయి.. 'మీరే సూపర్ స్టార్ అన్నారు'అంటూ బిత్తరపోయింది.

ఇక ఈ సమయంలో మరో కంటెస్టెంట్ ఆ తర్వాత మరో క్లూ రూపంలో 'విజయ్'అని చెప్పాడు. ఈ సారి కచ్చితంగా సరైన సమాధానం ఇస్తుందని అందరూ భావించారు. కానీ, నందిని వెంటనే 'విజయ్ దేవరకొండ?'అని చెప్పేసింది. అయితే అది కూడా సరైన సమాధానం కాదని, అసలు సమాధానం తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ దళపతి అని వివరించారు. అక్కడివరకూ ఫన్నీగా ఉన్నా... ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు నందినిపై సరదాగా కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం ఇందులో మరో కోణాన్ని చూస్తున్నారు. నార్త్ లో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

వాస్తవానికి గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాల మార్కెట్ పెరిగింది. నార్త్ లో కూడా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2 సినిమాలతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. హిందీ బెల్ట్‌లో కూడా ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తనకంటూ స్పెషల్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు అల్లు అర్జున్. అందుకే.. "సూపర్ స్టార్" అనే పదం వినగానే నందినికి అల్లు అర్జున్ గుర్తుకు రావడం ఆయన పాన్-ఇండియా క్రేజ్‌కు నిదర్శనమని అభిమానులు చెబుతున్నారు.

అదేవిధంగా విజయ్ దేవరకొండ కూడా నార్త్ లో గుర్తింపు ఉంది. అర్జున్ రెడ్డి, గీతా గోవిందాం సినిమాలతో పాటు రష్మిక మందన్నాను పెళ్లి చేసుకోవడంతో కూడా తనకి ఉత్తరాదిలో క్రేజ్ పెరిగింది. ఆయన సినిమాలు హిందీలో డబ్ అయి యూట్యూబ్, టెలివిజన్ వేదికలపై కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే 'విజయ్'అనే పేరు వినగానే నందినికి మొదట విజయ్ దేవరకొండ పేరు గుర్తుకు వచ్చి ఉండొచ్చని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఇలా ఓ హిందీ ఈవెంట్ లో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ పేర్లు గుర్తుకు చేసుకోవడంతో వారి క్రేజ్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అయితే కొందరు నెటిజన్లు మాత్రం దీనిని సరదాగా తీసుకోవడం లేదు. దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దళపతి విజయ్ గురించి తెలియకపోవడం ఆశ్చర్యకరమని అంటున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీ స్థాపించి తమిళనాడు రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారిన విజయ్‌ను గుర్తుపట్టలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీలకు కేవలం సినిమా నాలెడ్జ్ మాత్రమే కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలపై కూడా అవగాహన ఉండాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X