లింగ మార్పిడి తర్వాత పెళ్లి... ఇప్పుడేమో విడాకుల గొడవ.. వార్తల్లో బిగ్‌బాస్ కంటెస్టెంట్!
హిందీ బిగ్ బాస్ 1 కంటెస్టెంట్, నటి బాబీ డార్లింగ్ తన భర్త రమ్నిక్ శర్మ నుంచి విడాకులు కోరుతూ పిటీషన్ వేసింది. అతడిపై గృహ హింస కేసు కూడా పెట్టింది. పలు హిందీ టీవీ షోలతో పాటు చిత్రాల్లో నటించిన ఆమె... లింగ మార్పిడి చేసుకుని తన బాయ్ ఫ్రెండ్ రమ్నిక్ శర్మను ఫిబ్రవరి 2016లో పెళ్లాడింది. అయితే పెళ్లయిన ఏడాదికే ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
రమ్నిక్ శర్మ గృహ హింసకు పాల్పడుతున్నాంటూ బాబీ డార్లింగ్ కేసు పెట్టింది. తమ వివాహంలో అసహజ శృంగారం ఉందంటూ ఆరోపిస్తోంది. అయితే రమ్నిక్ శర్మ వాదన మరోలా ఉంది. లింగ మార్పిడి తర్వాత తాను గర్భం దాల్చుతాను అని అబద్దం చెప్పి తనను పెళ్లి చేసుకుందని ఆరోపిస్తున్నాడు.

నాకు విడాకులు కావాల్సిందే.
ముంబైకి చెందిన ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం... బాబీ డార్లింగ్ తమ వివాహం రద్దు చేయాలని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. దీంతో పాటు తన భర్త నుంచి రూ. 2 కోట్ల భరణం కావాలని, అతడికి గిఫ్టుగా ఇచ్చిన ఫ్లాట్ తనకు తిరిగి చెందేలా చేయాలని కోరుతోంది. భూపాల్‌లో తమ ఇద్దరి పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తి కూడా తనకే దక్కాలని, అది తన డబ్బుతోనే కొనుగోలు చేశామని తన లాయర్ ద్వారా మరో పిటీషన్ వేయించినట్లు సమాచారం.

సంతోషంగా లేము
తమ వైవాహిక జీవితం సినిమాల్లో కంటే ఫేక్‌గా సాగిందని, బయటి ప్రపంచం మేము సంతోషంగా ఉన్నామని నమ్మింది. కానీ లోపల అలాంటి దేమీ లేదని వాదిస్తున్నారు. అందుకే తాను విడాకులు కోరుకుంటున్నట్లు బాబీ డార్లింగ్ తెలిపారు.

లింగమార్పిడి వివాహం చెల్లదు
అయితే రమ్నిక్ శర్మ తన లాయర్ ద్వారా కొన్ని ప్రశ్నలు రేజ్ చేశారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఈ వివాహం చెల్లదని, బాబీ డార్లింగ్ మగాడిగా పుట్టి... లింగ మార్పిడి చేసుకుని స్త్రీగా మారాడని, అందుకే ఈ వివాహం చెల్లదని వాదిస్తున్నాడు.

చివరకు ఏం జరుగుతుందో...
తాను దాడి చేసినట్లు, గృహ హింసకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలను రమ్నిక్ శర్మ ఖండించారు. బాబీ డార్లింగ్ తన ఆస్తి పత్రాలు, డబ్బు, బంగారం తీసుకుని పారిపోయిందని తెలిపారు. వీరి విడాకుల గొడవ చివరకు ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











