ధనుష్ తరువాత విడాకులపై స్పందించిన మరో సీనియర్ నటుడు.. విడిపోవడమే మంచిది అంటూ..

కరోనా కష్ట కాలంలో సినీ తారలు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కేవలం కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో వారు వేస్తున్న అడుగులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. గత ఏడాదిలోనే చైతు, సమంత విడిపోవడం అందరిని షాక్ కు గురి చేసింది. అనంతరం అమీర్ ఖాన్ కూడా రెండో భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇక ఇటీవల ధనుష్ - ఐశ్వర్యతో పాటు మరో స్టార్ యాక్టర్ కూడా వివాహా బంధానికి ఎప్పుడో ముగింపు పలికినట్లు చాలా ఆలస్యంగా క్లారిటీ ఇచ్చాడు.

ధనుష్ విడాకులు..

ధనుష్ విడాకులు..

సౌత్ ఇండస్ట్రీలో టాలెంటెట్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ధనుష్ తన భార్య ఐశ్వర్య నుండి విడిపోతున్నట్లు సోమవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వార్త అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబంలో అది రెండో విడాకులు కావడంతో విషయం నేషనల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

'మహాభారతం' నటుడు కూడా..

'మహాభారతం' నటుడు కూడా..

ఇక 'మహాభారతం' నటుడు నితీష్ భరద్వాజ్ కూడా విడాకుల కోసం దాఖలు చేసిన వార్త ఇంటర్నెట్ వరల్డ్ లో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. 'మహాభారత' టెలివిజన్ షో అప్పట్లో ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అందులో నితీష్ భరద్వాజ్ శ్రీ కృష్ణుడి పాత్రలో ప్రాణం పెట్టి నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. ఇప్పటికి కూడా ఆ సీరియల్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.

సోషల్ మీడియాలో భారీ క్రేజ్..

సోషల్ మీడియాలో భారీ క్రేజ్..

సోషల్ మీడియాలో కూడా నిత్యం మహాభారతంకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో ఎక్కువగా నితీష్ భరద్వాజ్ కు సంబంధించిన డైలాగ్స్ కు మంచి క్రేజ్ ఉంది అనే చెప్పాలి. ఇక శ్రీకృష్ణుడి పాత్రలో నటించిన వ్యక్తి కూడా తన బంధానికి ముగింపు పలకడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

విడిపోవడమే మేలు..

విడిపోవడమే మేలు..

నటుడు నితీష్ భరద్వాజ్ మంగళవారం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భార్య స్మిత నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. 2019 సెప్టెంబర్ లోనే ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసానని వెల్లడించారు. నితీష్ మాట్లాడుతూ.. అవును, నేను సెప్టెంబర్ 2019లో ముంబైలోని ఫ్యామిలీ కోర్ట్‌లో విడాకుల కోసం దాఖలు చేసాను.

అయితే మేము ఎందుకు విడిపోతున్నాము అనే కారణాల గురించి నేను చెప్పాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది. కొన్నిసార్లు విడాకుల విషయం బాధ కలిగించినప్పటికి మనసు చంపుకొని జీవించడం మరణం కంటే కఠినమైంది.. అని వివరణ ఇచ్చిన నితీష్ అలా జీవించడం కంటే విడిపోవడమే కరెక్ట్ అని తెలియజేశారు.

Recommended Video

Aamir khan Approaches Prabhas For A Role In Mahabharat
స్మితాతో విడాకులు

స్మితాతో విడాకులు

నితీష్ భరద్వాజ్ - స్మితా ఇద్దరు కూడా ఒకేసారి వారి విడాకుల విషయాన్ని బయటకు చెప్పడంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న విడాకుల ట్రెండ్ లిస్ట్ లో మరికొందరు స్టార్స్ కూడా త్వరలోనే షాక్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో టాలీవుడ్ స్టార్ పిల్లలు అలాగే ఒక యువ దర్శకుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ట్రెండ్ కు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X