దారుణంగా మారిన సీరియల్ నటి పరిస్థితి.. కరోనా లక్షణాలతో నరకం...
రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య వేలల్లో పెరుగుతోంది. ప్రపంచం వ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్ నాలుగవ స్థానానికి చేరుకుంది. ఇక నెంబర్ వన్ స్థానం కూడా కాయమేనని పలువురు ప్రముఖులు కామెంట్ చేస్తుండడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఇకపోతే ఇటీవల ఒక సీరియల్ నటి తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.అలాగే ఒక లేఖ కూడా విడుదల చేస్తూ ఎవరు ఊహించని విషయాలని బయటపెట్టింది.

సీరియల్ నటి..
ప్రముఖ సీరియల్ నటి ఇటీవల విడుదల చేసిన ఒక లెటర్ నార్త్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అందులో ఆమె తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని చాలా క్లియర్ గా బయటకు చెప్పడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఆ నటి మరేవరో కాదు. బాలీవుడ్ సిరియల్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న చార్వీ సరాఫ్.

అనుమనంగానే ఉంది..
ఆమె ప్రముఖ పాత్రలో నటించిన కసౌటి జిందాకి కే సీరియల్ అప్పట్లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఏడేళ్లు కొనసాగిన ఆ సీరియల్ లో చార్వీ ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఆ ఒక్క సీరియల్ తో ఈ బ్యూటీ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. చాలా వరకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక మంచి ఆఫర్స్ ని కూడా వదిలేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సీరియల్ బ్యూటీ కరోనా భారిన పడినట్లు అనుమనంగా ఉందని ఒక లేఖ విడుదల చేసింది.

కరోనా లక్షణాలు..
ఆ లేఖలో ఏముందంటే.. నాలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. కానీ ఢిల్లీలో టెస్టులు చేయించుకోవడం కష్టంగా ఉంది. లాక్ డౌన్ నుంచి నేను నా కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడం లేదు. కేవలం నిత్యావసర వస్తువుల కోసమే ఎప్పుడైనా ఒకసారి వెళుతున్నాం. అయితే గత కొన్ని రోజుల నుంచి నా ఆరోగ్యంపై అనుమానాలు వస్తున్నాయి. తీవ్రంగా జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు.. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది.
Recommended Video

దారుణమైన పరిస్థితి..
ప్రభుత్వ హాస్పిటల్స్ కి ఫోన్ చేస్తున్నా గాని ఎవరు కణికరించడం లేదు. టెస్ట్ లు చేయడానికి మా వద్ద సరైన కిట్స్ లేవని చేతులెత్తేస్తున్నారు. నిజంగా ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఒక సెలబ్రెటీగా ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని, వారు ఈ వైరస్ ని ఎలా ఎదుర్కుంటారో తలచుకుంటేనే భయంగా ఉందని చార్వీ సరాఫ్ లేఖలో పేర్కొంది. అలాగే తన ఆరోగ్యం కుదుటపడే వరకు తాను స్వీయ నిర్బంధంలోనే ఉంటానని కూడా ఈ నటి వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











