twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాక్‌డౌన్‌ ఎఫెక్ట్.. ఆకలి బాధ తట్టుకోలేక కారు అమ్ముకున్న స్టార్ యాక్టర్!

    |

    ప్రపంచం ఒక్కసారిగా ఏదైనా సమస్య వచ్చి ఆగిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో కరోనా వైరస్ లక్షలాది ఉదాహరణలు చూపిస్తోంది. ఈ రేంజ్ లో కష్టాలు ఎదురవుతాయని ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు. పనులు లేక ఆకలి కోసం ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇకపోతే ఒక ప్రముఖ టీవీ యాక్టర్ కూడా తన కారును అమ్ముకోవడం అందరిని షాక్ కి గురి చేసింది.

    షూటింగ్స్ లేక..

    షూటింగ్స్ లేక..

    లాక్‌డౌన్‌ ప్రభావం అందరికంటే ఎక్కువగా సినిమా పరిశ్రమలపై పడినట్లు అర్థమవుతోంది. షూటింగ్స్ లేకపోవడంతో వేలాదిమంది నటీనటులు అలాగే సినీ వర్కర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది వారికి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నప్పటికీ ఆ సహాయం కొన్నిరోజులకే పరిమితమైంది. ప్రస్తుతం మళ్ళీ ఆకలి బాధలు కనిపిస్తున్నాయి.

    దారుణమైన పరిస్థితి..

    దారుణమైన పరిస్థితి..

    మొన్న ఒక నార్త్ యాంకర్ లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తనువు చాలించింది. మరో నటుడు కుటుంబం కోసం పండ్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. పరిస్థితులు ఎంత దుర్బరంగా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా జూనియర్ ఆర్టిస్ట్ లు, సినీ వర్కర్స్ ఆకలి బాధలను చూస్తున్నారు.

    కారు అమ్ముకున్న నటుడు..

    కారు అమ్ముకున్న నటుడు..

    ఇక రీసెంట్ గా ఒక టెలివిజన్ యాక్టర్ గా కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల తన కారును అమ్ముకోవాల్సి వచ్చింది. బాలీవుడ్ కి చెందిన మానస్ షా హమారి బహు సిల్క్' అనే టీవీ షో ద్వారా పాపులర్ అయ్యాడు. అలాగే హమారీ దేవ్రాణి, సంకత్మోచన్ మహాబలి హనుమాన్ వంటి షోలు చేస్తున్నాడు.ఇటీవల ఈ నటుడు కూడా డబ్బులు లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.

    భవిష్యత్తు ఇంకా ఎలా ఉంటుందో?

    భవిష్యత్తు ఇంకా ఎలా ఉంటుందో?

    గతంలో షూటింగ్స్ పూర్తిచేసినప్పటికీ చాలా వరకు పేమెంట్స్ రాలేవట. ఉన్న డబ్బులతో కొన్నాళ్ల వరకు సర్దుబాటు చేసుకున్న మానస్ ఇటీవల తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా ఇబ్బందులు రావడంతో కష్టపడి కొనుక్కున్న కారును ఆకలి కోసం అమ్ముకున్నడు. ఇలాంటి పరిస్థితులను త ఆ జీవితంలో ఎన్నడు ఎదుర్కోలేదని చెప్పిన మానస్ భవిష్యత్తు ఇంకా ఎలా ఉంటుందో అని భావోద్వేగానికి లోనయ్యారు.

    English summary
    Many actors life's have taken unexpected turns due to the corona virus. the lack of shooting stopped due to the lockdown, it became difficult for the poor artists to spend the day. Cine adults are providing help but it is not useful for most days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X