కార్తీక దీపం సీరియల్‌పై టాలీవుడ్ డైరెక్టర్ సెటైర్లు.. రోడ్డు మీద పడేసి తన్నాలంటూ కామెంట్.!

By Manoj Kumar P

తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రసారం అయ్యాయి.. అవుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందనను దక్కించుకుంటున్నాయి. అప్పట్లో 'అంతరంగాలు', 'ఎండమావులు' మొన్నామధ్య 'చక్రవాకం', 'మొగలిరేకులు' వంటి సీరియల్స్ విజయవంతంగా ప్రదర్శితమయ్యాయి. ఇక, ఈ మధ్య కాలంలో ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న 'కార్తీక దీపం' ఎంతో పాపులర్ అయిపోయింది. ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేయడంతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన ఓ డైరెక్టర్ ఆ సీరియల్‌పై సెటైర్లు విసిరాడు. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

‘కరుతముత్తు'.. ‘కార్తీక దీపం'గా మారింది

‘కరుతముత్తు'.. ‘కార్తీక దీపం'గా మారింది

అందంగా లేని యువతిని పెళ్లి చేసుకున్న డాక్టర్.. ఆ తర్వాత అనుమానంతో ఆమెను పక్కన పెట్టేస్తాడు. ఈ క్రమంలోనే ఇద్దరు పిల్లలతో తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఆ మహిళ చేసే ప్రయత్నాలతో రూపొందిన సీరియల్ ‘కార్తీక దీపం'. ఈ సీరియల్ మలయాళంలో 2014లో ప్రసారమై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కరుతముత్తు'కు రీమేక్‌గా తెరకెక్కుతోంది.

‘కార్తీక దీపం' వంటలక్క వెరీ ఫేమస్ గురూ

‘కార్తీక దీపం' వంటలక్క వెరీ ఫేమస్ గురూ

ఈ సీరియల్‌లో హీరోయిన్‌గా చేస్తోంది ప్రేమి విశ్వనాథ్. మాతృకలో అద్భుతమైన నటనను కనబరచడంతో తెలుగులోనూ ఆమెనే తీసుకున్నారు. ఇందులో దీప అలియాస్ వంటలక్కగా ఆమె బాగా పాపులర్ అయిపోయింది. సినిమా హీరోయిన్లకు పోటీగా ఈమెకు కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సీరియల్ వల్ల ప్రేమి.. తెలుగు వారి కుటుంబ సభ్యురాలు అయిపోయింది.

ఇండియాలోనే నెంబర్ వన్ స్థానం కైవసం

ఇండియాలోనే నెంబర్ వన్ స్థానం కైవసం

కార్తీక దీపం సీరియల్ తెలుగులో 2017 అక్టోబర్‌లో ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఇది విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అంతేకాదు, ప్రతి వారం విడుదల చేసే టీఆర్పీ రేటింగ్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటోంది. ఇలా ఎక్కువ వారాల పాటు నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఏకైక సీరియల్‌గా ‘కార్తీక దీపం' ఇండియన్ టీవీ రికార్డుల్లో చరిత్ర సృష్టించింది.

మొదటి నుంచి వేసినా.. మళ్లీ చూస్తున్నారు

మొదటి నుంచి వేసినా.. మళ్లీ చూస్తున్నారు

కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీంతో టీవీ సీరియల్ షూటింగులు నిలిచిపోయాయి. ఈ కారణంగా అవన్నీ కొత్త ఎపిసోడ్స్ నిలిపివేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ‘కార్తీక దీపం' సీరియల్‌ను మొదటి నుంచి ప్రసారం చేస్తున్నారు. రెండోసారి వేసినా ఈ సీరియల్‌కు మంచి టీఆర్పీ వస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కార్తీక దీపంపై టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సెటైర్లు

తాజాగా కార్తీక దీపం సీరియల్‌పై టాలీవుడ్‌కు చెందిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఫన్నీ సెటైర్లు వేశాడు. మదర్స్ డేను పురస్కరించుకుని తన ట్విట్టర్‌లో ‘అమ్మ కార్తీక దీపం ఫ్యాన్. రోజూ టిఫిన్ చేసేటప్పుడు సీరియల్ డిస్కర్షన్స్ విని లైట్‌గా అర్థం చేసుకున్నా. అప్పటి నుంచి వెదవ కామెంట్లు చేసి తిట్టు పడుతున్నా. హ్యాపీ మదర్స్ డే అమ్మా' అని పోస్ట్ చేశాడు.

 రోడ్డు మీద పడేసి తన్నాలంటూ కామెంట్.!

రోడ్డు మీద పడేసి తన్నాలంటూ కామెంట్.!

శైలేష్ ఈ పోస్టులో ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. అందులో ‘నన్ను అడిగితే.. దీపను వదిలేసి.. మోనితతో హీరో సెట్ అయిపోవడం కరెక్ట్' అని అతడు కామెంట్ చేశాడు. దీంతో పక్కనే ఉన్న వాళ్ల అమ్మ కలగజేసుకుని ‘ఛీ.. దరిద్రం.. దాన్ని ఎవరూ ఒప్పుకోరు. రోడ్డు మీద పడేసి తంతారు అందరినీ. జనాలందరూ పోయి డైరెక్టర్‌ను కొడతారు' అంటూ రిప్లై ఇచ్చారు.

Recommended Video

Karthika Deepam Vantalakka Live Video || కార్తీక దీపం సీరియల్‌ నుంచి తప్పుకోవడం పై దీప క్లారిటీ !
హిట్ అంటూ వచ్చి.. పెద్ద హిట్ కొట్టేశాడు

హిట్ అంటూ వచ్చి.. పెద్ద హిట్ కొట్టేశాడు

శైలేష్ కొలను.. ఇటీవల విడుదలైన భారీ విజయాన్ని అందుకున్న ‘హిట్' సినిమా డైరెక్టర్. న్యూ సౌత్ వేల్స్‌లోని ఓ యూనివర్శిటీలో ప్రొఫెసర్ అయిన అతడు.. సినిమాలపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి ఇక్కడకు వచ్చాడు. ఈ క్రమంలోనే స్టార్ హీరో నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా ‘హిట్' అనే మూవీని తెరకెక్కించాడు. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడీ యంగ్ డైరెక్టర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X