ఆ పనిచేస్తూ హీరోకి దొరికిన హీరోయిన్.. అందరిముందు దారుణమైన పనిష్‌మెంట్
వీకెండ్ వచ్చిందంటే చాలు... తెలుగు నుంచి హిందీ వరకు దేశంలో ఉన్న టాప్ ఛానెల్స్‌లో వినోద కార్యక్రమాలు సిద్ధమవుతాయి. ఆ వారానికి ఏదైనా ప్రత్యేకత ఉంటే మరింత కొత్తగా కంటెంట్ సిద్ధం చేస్తారు. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మాలోనూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులు నచ్చే ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అవుతుంటాయి. వీటిలో ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమం కూడా ఒకటి. తెలుగు బుల్లితెర సెలబ్రిటీలతో వారం వారం ఈ షో ముస్తాబవుతుంది. శ్రీముఖి ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఈ వారానికి సంబంధించిన ప్రోమో ఆసక్తికరంగా సాగింది. ఈ వివరాల్లోకి వెళితే..
శ్రీముఖి యాంకరింగ్‌లో వారం వారం వినోదాన్ని పంచుతోంది ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమం. ఎప్పటిలాగే ఈ వారం కూడా ముస్తాబైంది. అయితే హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త కాన్సెప్ట్‌తో వచ్చింది. ఆదివారం నాటి ఎపిసోడ్‌కు సంబంధించి కొద్దిరోజులుగా ప్రోమోలను విడుదల చేస్తూ వస్తున్నారు. యాంకర్ శ్రీముఖి వీరందరికీ రంగుపూసి సరదాగా గేమ్స్ ఆడించింది. ఫిబ్రవరి 26 నాటి ప్రోమోలో మన సెలబ్రిటీలంతా తమ బ్రేకప్ లవ్‌స్టోరీలను, తమ ప్రేమ జీవితంలో రాధిక లాంటి పార్ట్‌నర్స్ ఎవరున్నారో బయటపెట్టారు.

ముందుగా ఎక్స్‌ప్రెస్ హరి మాట్లాడుతూ.. నా లైఫ్‌లో ముగ్గురు ఉన్నారని చెప్పాడు. అసలు ఫస్ట్ అంతమందిని ఎలా ప్రేమించావాంటూ ఇమ్మాన్యుయేల్ పంచ్ విసురుతాడు. నాకైతే ఏ రాధిక లేదని ఇమ్ము చెబుతుండగా వీడే రాధిక అని రోహిణి సెటైర్ పేల్చింది. బిగ్‌బాస్ ఫేమ్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. డబుల్ జరిగిందని, ఆ టైంలో నాకు లవ్ అనేది కరెక్ట్‌గా అర్దం కాలేదని చెప్పాడు. ఆ తర్వాత అమ్మాయిలను కూడా మీ జీవితంలో రాధిక లాంటి అబ్బాయిలు ఉన్నారా అని అడగ్గా.. బుల్లితెర నటి ప్రిన్సీ తన అనుభవాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. వీరితో పాటు రోహిణి, శ్రీముఖిలు కూడా తమ జీవితంలో రాధిక లాంటి అబ్బాయిల్ని బయటపెట్టారు కానీ ఆ వివరాల్ని మాత్రం ఫుల్ ఎపిసోడ్‌లో చూడాలి అన్నట్లు పూర్తిగా చూపించలేదు.
తాజాగా ఫిబ్రవరి 27వ తేదీన ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో 4ను విడుదల చేశారు. ఇందులో ఓ డైస్ ఇచ్చి.. 6వ నెంబర్ వస్తే సేవ్ అయినట్లు, దాని కంటే తక్కువ నెంబర్ పడినవాళ్లకు రంగునీటితో స్నానం చేయించే టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. తొలుత యాదమ్మరాజుకు 5వ నెంబర్ రాగా.. చచ్చినట్లు 6 వస్తేనే గెలిచినట్లు ఓడిపోయినందుకు బకెట్ రంగు నీళ్లు నీ మీద పోస్తామని చెప్పడంతో యాదమ్మరాజు టెన్షన్ పడతాడు. ఆ వెంటనే రోహిణి, కావ్యలు కలిసి యాదమ్మ రాజుని రంగు నీళ్లలో తడిపేస్తారు.
ఆ తర్వాత రౌడీ రోహిణికి 5, ఇమ్మాన్యుయేల్‌కు 5 వస్తుంది. మీరు తడపాలని డిసైడ్ అయిన తర్వాత మేం అనుకున్న నెంబర్ పడదని రోహిణి పంచ్ విసురుతుంది. తక్కువ నెంబర్ రాకపోవడంతో ఇద్దరికీ రంగు నీళ్లతో అభిషేకం చేస్తారు. ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పండి.. వెళ్లిపోతామ్, హెయిర్ ఫాల్ అవుతుంది దీని వల్ల అని ఇమ్మాన్యుయేల్ అంటాడు. అది హెయిర్ ఉన్నవాళ్లకు మాత్రమే నీకెందుకు అని హరి సెటైర్లు వేస్తాడు. అనంతరం సుహాసినీ, శ్రీకర్ కృష్ణల కోసం నెంబర్ వేస్తుండగా.. సుహాసినీ భయపడి పారిపోతుంది. అది శ్రీకర్‌కి అని చెప్పి నాకెందుకు వస్తున్నారు, ఇది చీటింగ్ అంటూ స్టేజ్ దిగి వెళ్లిపోతుండగా మానస్ వెళ్లి ఆమెను ఎత్తుకుని తీసుకొచ్చేస్తాడు.
దానికి పనిష్మెంట్ కింద ఏకంగా రెండు బకెట్ల రంగు నీళ్లతో సుహాసినీ మీద పోసేస్తారు. నీళ్లు పోయడంతో రగిలిపోతున్న సుహాసినీని మరింత రెచ్చగొట్టేలా.. సుహాసినీ ఎక్కడుంది అని అడుగుతాడు అవినాష్. రెడ్ శారీలో అదిరిపోతోంది కదా అని శ్రీముఖి చెప్పగా.. తను వైట్ శారీ కదా అని అంటాడు. దాంతో ఇమ్మాన్యుయేల్‌ను కోపంగా చూస్తుంది సుహాసినీ. ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి కరెక్ట్ నెంబర్ ఎవరికి పడింది? ఎవరు రంగు నీళ్ల పనిష్మెంట్ నుంచి తప్పించుకున్నారు? అనేది తెలియాలంటే ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











