Bigg Boss Open the doors.. సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్‌కు షాకిచ్చిన నాగార్జున..

బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో 11వ వారాంతపు ఎపిసోడ్ రంజుగా సాగిందనే విషయం తాజాగా విడుదల చేసిన ప్రోమోలో వెల్లడైంది. ఇంటి సభ్యుల మధ్య వాడివేడిగా గొడవలు జరుగడం ఒక ఎత్తైతే.. సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్‌కు హోస్ట్ నాగార్జున క్లాస్ పీకడం మరో ఎత్తుగా కనిపించింది. అయితే శనివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందంటే..

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మానస్‌తో అనీ మాస్టర్ గొడవ

మానస్‌తో అనీ మాస్టర్ గొడవ

బిగ్‌బాస్ ఇంటిలో ఎవిక్షన్ పాస్ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య అభిప్రాయ బేధాలు స్పష్టంగా కనిపించాయి. సిరి హన్మంతు, అనీ మాస్టర్‌ను సేవ్ చేసే సందర్భంగా మానస్, ఆర్జే కాజల్ మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది సిరిని సేవ్ చేద్దామని అని మానస్ అంటే.. అని మాస్టర్‌ను సేవ్ చేద్దామని కాజల్ ప్రపోజల్ పెడితే.. వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం కనిపించలేదు.

 తొండి గేమ్ అంటూ అనీ మాస్టర్

తొండి గేమ్ అంటూ అనీ మాస్టర్

ఇక తనను సేవ్ చేయకపోవడంతోనో లేదా మరో కారణంగానో.. మీరు తొండి ఆడుతున్నారు.. మీరు తొండి గేమ్ ఆడుతున్నారు అంటూ అనీ మాస్టర్ గట్టిగట్టిగా అరిచింది. అంతేకాకుండా ప్రియాంకతో యాక్టింగ్ చేయకు అని అనీ మాస్టర్ అంటే.. వారిద్దరి మధ్య గొడవ చోటు చేసుకొన్నది.

సిరి హన్మంతు.. ఏం చేస్తున్నావో తెలుసా?

సిరి హన్మంతు.. ఏం చేస్తున్నావో తెలుసా?

ఇక సిరి హన్మంతును హోస్ట్ నాగార్జున గట్టిగా క్లాస్ పీకుతూ కనిపించారు. హౌస్‌లో ఏం జరుగుతున్నది అంటూ నాగ్ ప్రశ్నించాడు. ఎందుకు చేస్తున్నావు? ఏం జరుగుతున్నది అని అడిగితే నాకు అర్ధం కావడం లేదు అంటూ సిరి సమాధానం ఇచ్చింది. కోట్లాది మంది చూస్తూ.. ఇలా చేయకూడదు.. ఇలా ఉండకూడదు అని అనుకోవద్దు కదా.. అని నాగ్ అంటే.. బయట నా స్టోరి తెలుసు. బయట నేను ఏంటో తెలుసు. స్టిల్ నాకు ఎందుకు కనెక్షన్ వస్తుందో తెలియడం లేదు అని సిరి హన్మంతు సమాధానం ఇచ్చాడు.

 మెంటల్‌గా చాలా వీక్ అయ్యాను అంటూ

మెంటల్‌గా చాలా వీక్ అయ్యాను అంటూ

ఇక షణ్ముఖ్‌తో మాట్లాడుతూ.. ఏం జరుగుతున్నది అంటూ నాగ్ ప్రశ్నిస్తే.. ఏమో సార్ ఏం జరుగుతున్నదో అర్ధం కావడం లేదు. మెంటల్‌గా చాలా వీక్ అయిపోయాను అని షణ్ముఖ్ సమాధానం ఇచ్చాడు. దాంతో దీపూను అంతగా మిస్ అయిపోతున్నావా అంటూ నాగ్ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా చాలా మిస్ అవుతున్నాను అంటూ షణ్ముఖ్ జస్వంత్ సమాధానం ఇచ్చాడు.

బిగ్‌బాస్ డోర్లు తెరవండి అంటూ

బిగ్‌బాస్ డోర్లు తెరవండి అంటూ

షణ్ముఖ్ మాటలు విన్న నాగార్జున సీరియస్ అయ్యాడు. బిగ్‌బాస్ మెయిన్ డోర్ తెరవండి.. ఓపెన్ ది డోర్స్ అని అనగానే.. మెయిన్ డోర్ తెరచుకొన్నది. ఒకవేళ నీవు దీప్తిని మిస్ అవుతున్నాయని ఫీల్ అయితే వెంటనే ఈ క్షణమే బయటకు వెళ్లిపో అంటూ నాగార్జున సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు.

 సిరి, షన్నుకు సపోర్ట్ అంటూ

సిరి, షన్నుకు సపోర్ట్ అంటూ

గత కొద్ది రోజులుగా సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్‌కు హోస్ట్ నాగార్జున పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. గతవారం సిరి హన్మంతుతో వీజే సన్నీ వ్యవహారంలో హోస్ట్ పక్షపాతంగా వ్యవహరించారనే విషయంపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేయడం తెలిసిందే.

ఎవరు ఎలిమినేట్ అవుతారంటూ..

ఎవరు ఎలిమినేట్ అవుతారంటూ..


ఇక బిగ్‌బాస్‌లో 11వ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ కావడానికి మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అందరూ టాప్ కంటెస్టెంట్లు నామినేట్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం చర్చనీయాంశమైంది. ఇంటిలో వీక్ కంటెస్టెంట్ అనీ మాస్టర్ ఎలిమినేట్ కావొచ్చనే ఊహాగానాలు జోరందుకొన్నాయి. ఈ వారాంతంలో ఎవరు వెళ్లిపోతారనే విషయం కొద్ది గంటల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X