తేజస్వి, భానుశ్రీ దిమ్మతిరిగింది.. నాని పిచ్చక్లాస్.. గోగినేని సూపర్.. సస్సెన్స్‌లో ముంచెత్తిన..

By Rajababu

బిగ్‌బాస్ షోలో శనివారం ఏమౌతుందో అని ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రేక్షకులకు హ్యాపీ ఎండింగ్‌తో నాని సరిపుచ్చారు. దీప్తి, గణేష్, భానుశ్రీలో ఎవరు సేఫ్, ఎవరు బయటకు వెళ్తారనే విషయంపై ఆందోళన పడిన ప్రేక్షకులకు బిగ్‌బాస్ సస్పెన్స్‌లో పెట్టారు. ఇక ఈ వారం ఇంటి సభ్యులకు క్లాస్‌లు పీకడంతోనే నాని సమయమంతా గడిచిపోయింది. చివరిక గణేష్ బర్త్‌డే సెలబ్రేషన్‌తో హ్యాపీగా కార్యక్రమాన్ని ముగించి ఉత్కంఠను రేపటికి వాయిదా వేశారు.

రొటీన్ వ్యవహారమే

రొటీన్ వ్యవహారమే

ఎప్పటిలానే తేజస్వి, సామ్రాట్, దీప్తి సునైన, తనీష్ మధ్య గుసగుసలతోనే కార్యక్రమం మొదలైంది. పెద్దగా శుక్రవారం జరిగిన సంఘటనలు పైపైనే చూపించి ఇక ఇంటి సభ్యులతో ముచ్చటించేందుకు నాని తొందరపడినట్టు కనిపించింది.

క్లాసు పీకడమే హైలెట్

క్లాసు పీకడమే హైలెట్

టాస్కుల్లో తప్పులు దొర్లాయని భానుశ్రీ, తేజస్విని క్లాస్ పీకడం ఈ ఎపిసోడ్స్‌లో ప్రధాన అంశాలుగా మారాయి. ఎప్పటి మాదిరిగానే గతవారం ఇంటిలో అత్యుత్సాహం ప్రదర్శించిన తేజస్విని నాని చేతిలో బుక్కైపోయింది.

భానుశ్రీకి దిమ్మతిరిగేలా

భానుశ్రీకి దిమ్మతిరిగేలా

భానుశ్రీ ఇప్పటికే చేసిన తప్పుకు సారీ చెప్పినప్పటికీ మళ్లీ ఆ ఎపిసోడ్‌ను తెరపైకి తెచ్చి నాని మళ్లీ దానిపై చర్చ చేపట్టాడు. ఇక ఇంటి సభ్యుల మధ్య పుల్లలు పెట్టేందుకు నాని చర్చ మొదలుపెట్టాడా అనే ప్రశ్న తలెత్తింది. బోనులో నిలబెట్టకపోయిన మంచి, చెడు టాస్కులో నిందితురాలిగా భానుశ్రీని నాని ఉతికి పారేశాడు.

గణేష్ నీకేమైనా పిచ్చిపట్టిందా

గణేష్ నీకేమైనా పిచ్చిపట్టిందా

రోల్ రైడా కోసం త్యాగం చేయడాన్ని ఎత్తి చూపుతూ గణేష్‌ను పిచ్చపిచ్చగా క్లాస్ పీకాడు. నామినేట్ అయితే రోల్ రైడాకు ఒక సమస్య. అతడిని నామినేషన్ నుంచి తప్పించడానికి నీవు రెండు రకాల ఇబ్బందుల్లో ఇరుక్కుపోయావు. నీవు ఏమైనా పిచ్చోడివా అంటూ గణేష్‌ను నాని దులిపేశాడు. త్యాగాలు చేసి మంచి వాళ్లుగా మారేందుకు రాలేదు. చివరకు గెలిచేది ఈ గేమ్‌లో ఒక్కరే అంటూ వాస్తవాన్ని చెప్పేందుకు ప్రయత్నించారు.

గీతామాధురికి నేను ఫ్యాన్

గీతామాధురికి నేను ఫ్యాన్

బాబు గోగినేని కోసం గీతా మాధురి టాటు వేసుకొన్న గీతా మాధురిని ప్రశంసలతో ముంచెత్తాడు. శాశ్వతంగా పచ్చబొట్టు వేసుకొన్న నీకు పెద్ద ఫ్యాన్ అయ్యాను అని గీతాకు నాని చెప్పడం గమనార్హం. అలాగే కౌశల్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన భానుశ్రీకి వ్యతిరేకంగా నిలువడంతో గీతా మాధురిని అభినందించారు. న్యాయం కోసం సొంత టీమ్ సభ్యురాలిని కూడా ఎదురించడం ఆకట్టుకొన్నదని నాని చెప్పాడు.

డీసెంట్ లుక్‌తో అదుర్స్

డీసెంట్ లుక్‌తో అదుర్స్

బిగ్‌బాస్ షోలో కొత్త లుక్‌లో కనిపించి బాబు గోగినేని ఆకట్టుకొన్నాడు. డీసెంట్ లుక్‌తో బాబు ఆకట్టుకొన్నాడు. హెయిర్ స్టయిల్‌తో పోష్‌గా కనిపించాడు. బిత్తిరి బిత్తిరిగా కనిపించే బాబు గోగినేని యంగ్‌గా, రిచ్‌గా ఆకట్టుకొన్నాడు. సామ్రాట్ డ్రస్, హెయిర్ కట్ చేశాడు. తనీష్ డీసెంట్‌గా తయారు చేశాడు. తేజస్విని ఇన్సిపిరేషన్ నన్ను ఇలా తయారు చేసిందని అని బాబు గోగినేని చెప్పాడు.

తనీష్‌కు చెమటలు పట్టించిన

తనీష్‌కు చెమటలు పట్టించిన

దీప్తి సునైనకు షాడోగా మారిన తనీష్‌ను కూడా నాని వదల్లేదు. నీ వల్లనే దీప్తి సునైన ఏమీ నేర్చుకోలేకపోతున్నది. నీవల్లనే తాను వెలుగులోకి రాలేకపోతున్నది. ఇలానే సాగితే ఇంట్లోకి ఎలా వచ్చిందో అలానే ఆమె వెళ్లిపోతుంది అని నాని అన్నాడు. ఇకనైనా దీప్తి సునైనాను తన గేమ్‌ను ఆమెనే ఆడుకోనివ్వమని తనీష్‌కు సూచించాడు.

బర్త్ డే సెలబ్రేషన్స్

బర్త్ డే సెలబ్రేషన్స్

చివరకు గణేష్ బర్త్ డే సెలబ్రేషన్‌తో శనివారం కార్యక్రమాన్ని ముగించారు. బర్త్ డే సెలబ్రేషన్‌లో రోల్ రైడా ర్యాప్ సాంగ్ హైలెట్‌గా నిలిచింది. ఈ హ్యాపీ మూడ్‌లో నామినేషన్ ప్రక్రియను ఆదివారానికి వాయిదా వేస్తూ షోను ముగించాడు. ఈ వారాంతంలో నాని క్లాస్ పీకడం తప్ప ప్రేక్షకులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X