twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాహసం చేయర డింభకా అంటున్న హోస్ట్ ఓంకార్.. 7 ఏళ్ల తర్వాత మాయాద్వీపంతో.. కళ్లు చెదిరే సెట్స్‌తో

    |

    జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) విభిన్నమైన సీరియల్స్, షోలతో దక్షిణాదిలో అగ్రస్థానంలో దూసుకెళ్తున్నది. సుమారు 75 మిలియన్ల ప్రేక్షకులకు ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అలరిస్తున్నది. గతంలో ఎంతో మంది ప్రేక్షకులను హోస్ట్ ఓంకార్ రూపొందించిన మాయదీపం ఆకట్టుకొన్నది. పిల్లమర్రిరాజు, ఒంటి కన్ను రాక్షసుడు లాంటి విశేషాలతో ఉన్న మాయదీపం మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ఓంకార్ సిద్దమయ్యారు. మాయాద్వీపం చిత్రం తాజా సీజన్ కోసం ఓంకార్ టీమ్ అద్భుతంగా సెట్‌ను తీర్చిదిద్దింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 100 మంది టెక్నీషియన్స్ 50 రోజులు పైగా పగలు రాత్రి కష్ట పడి ఎంతో వైవిధ్యమైన సెట్స్‌ని రూపాందించారు.

    మాయాద్వీపం ప్రారంభం కాబోతున్న సందర్భంగా హోస్ట్, ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ... మాయాద్వీపం నా డ్రీమ్ ప్రాజెక్ట్. నేను ఫస్ట్ టైం నిర్మాతగా మారాను. మాయాద్వీపం షో ఇచ్చిన ధైర్యంతోనే ఎన్నో బుల్లితెర కార్యక్రమాలను నిర్మించాను. ఏడేళ్ల తర్వాత మళ్లీ మాయాద్వీపం షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంతకుమించి, అందరికి ఎంతో ఇష్టమైన పిల్లమర్రిరాజు, ఒంటి కన్ను రాక్షసుడుని మరోసారి అందరి ముందుకు తీసుకొస్తున్నందుకు హ్యపీగా ఉంది. అభిమానులందరినీ మరోసారి మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు అద్భుతమైన సెట్స్‌ని డిజైన్ చేయడం జరిగింది. ఇలాంటి సెట్స్ ఇప్పటివరకు ఏ తెలుగు టెలివిజన్ నాన్-ఫిక్షన్ షో‌లో చూసి ఉండరు. అలాగే, ప్రోమో చూసిన తర్వాత వచ్చిన స్పందన చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ షో అందరికి నచ్చుతుందని, ఇప్పుడున్న పిల్లలకి కూడా మేము ఇంకా దగ్గరవుతామని భావిస్తున్నాను అని అన్నారు.

    Host Omkar coming with Mayadweepam after 7 years on ZEEL

    మాయాద్వీపం షోకి కంటెస్టెంట్స్‌గా 6 నుంచి 12 ఏళ్ళ చిన్నారులు రావడం జరుగుతుంది. ఈ పిల్లలని డిజిటల్ ఆడిషన్స్ పద్థతిలో సెలక్ట్ చేయడం జరిగింది. మాయాద్వీపం ఆడిషన్స్ అనగానే 12000లకు పైగా ఎంట్రీస్ పంపారు. ఆడిషన్స్ ఈ లెవెల్లో ఉంటే మరి ఆట ఎలా ఉంటుందో ఊహించండి. ప్రతి ఎపిసో‌డ్‌కి నలుగురు కొత్త కంటెస్టెంట్స్. ఆ నలుగురిలో ఎవరు చాకచక్యంగా, వారి తెలివితేటలతో, జ్ఞాపకశక్తితో పాతాళలోకం చేరుకొని ఒంటి కన్ను రాక్షసున్ని సంహరిస్తారో వారికే 'అద్భుతదీపం' దక్కుతుంది. చదువుతుంటే చూడాలి అనిపిస్తుంది కదా? మరి ఇంకా ఎందుకు ఆలస్యం, జీ తెలుగులో ఈ ఆదివారం 'మాయాద్వీపం' చూసేయ్యండి అంటూ నిర్వాహకులు ఓ ప్రకటనను రిలీజ్ చేశారు.

    అయితే సాహసం చేయరా డింభకా అంటూ ఓంకార్ రిలీజ్ చేసిన మాయాద్వీపం ప్రోమోకు భారీగా స్పందన కనిపించింది. దీంతో ఈ పాపులర్ షోపై ఆసక్తిని పెంచింది. ఈ క్రమంలో వస్తున్న పిల్లల షో కోసం అన్ని వర్గాల వారు వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో జీ నిర్వాహకులు ఓ ప్రకటనను రిలీజ్ చేశారు. మాయాద్వీపం షోకు వస్తున్న స్పందనపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీన జీ తెలుగు ఛానెల్‌లో ప్రతీ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానున్నది.

    Read more about: omkar ఓంకార్
    English summary
    Popular Host Omkar on Telugu Television, is coming with Mayadweepam after 7 years on ZEEL. This show is going to telecast on october 3rd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X