»   » మిడ్ నైట్ మసాలా టీవీ యాంకర్.. వెండి తెరపై

మిడ్ నైట్ మసాలా టీవీ యాంకర్.. వెండి తెరపై

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Padmini
  హైదరాబాద్: మరో టీవీ యాంకర్ తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. నువ్విలా చిత్రంతో రేష్మి,ఈరోజుల్లో చిత్రంతో రేష్మ ఈ మధ్య కాలంలో తెలుగు తెరపైకి దూసుకు వచ్చారు. అంతకు ముందు టీవీ యాంకర్ కలర్స్ స్వాతి తనదైన ముద్రవేసి తెరపై దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో పద్మిని కూడా తెరపై కనిపించనుంది. మిడ్ నైట్ పోగ్రాం లో చిన్న స్కర్ట్ వేసుకుని పజిల్ పోగ్రాంలో ఎస్.ఎమ్ ఎస్ లు పంపమనే ఆమె ఇప్పుడు డైరక్ట్ గా యూత్ హృదయాలను కొల్లగొడతానంటోంది. విచక్షణ అనే టైటిల్ తో తయారయ్యే చిత్రంలో ఆమె హీరోయిన్ గా పరిచయం అవుతోంది.

  ఆషా రామ్ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న చిత్రం 'విచక్షణ'. దీపక్ దర్శక నిర్మాత. ధీరజ్, పద్మిని జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని డెక్కన్‌పార్కులో జరుగుతోంది. దీపక్ మాట్లాడుతూ "టాకీ, రెండు పాటలు పూర్తయ్యాయి. నాలుగు పాటల్ని తెరకెక్కించాలి. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం. ఓ ప్రేమజంట తమ సహచరులతో కలిసి చేసిన మిషన్ ఎలా పూర్తయింది? దానివల్ల ప్రజలకు ఎలాంటి మంచి జరిగిందన్నది కథాంశం'' అని తెలిపారు.

  తమ తొలి చిత్రం చక్కగా వస్తోందని ధీరజ్, పద్మిని అన్నారు. పోలీస్ కమిషనర్‌గా నటిస్తున్నట్టు ముఖేష్ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పాటకు తాను నృత్యరీతుల్ని సమకూరుస్తున్నట్టు రాజేష్ అన్నారు. జయలక్ష్మి, పద్మజయంతి, ఉషారాణి, సురేందర్ గౌడ్, రిజ్వాన్, రాహుల్, ఆకాష్, వంశీ, సుప్రీమ్, దివిజ, శ్రీదేవి, కొర్రపాటి, ధర్మేంద్ర, మాస్టర్ విశోధన్, జయప్రద తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సహ నిర్మాత: రాజేంద్ర, కెమెరా: డి.కె.నాగరాజ్, నృత్యాలు: నిక్సన్, రాజేష్, శ్రీనివాస్, సంగీతం: జగన్నాధ్ సెంధి, కూర్పు: మోహన్ రామారావు.

  English summary
  Hot small screen anchor Padmini who caught the attention of all with short skirts in mid night puzzle program where viewers used to send sms from their mobiles and lost entire mobile balance, is all set to make her Tollywood debut. Buzz is she will be seen in a film titled 'Vichakshana'. Let us wait and see what impact she will make on movie lovers.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more