For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ ఉదయభాను పై ఈ వార్త నిజమేనా? ఎక్కడ చూసినా ఇదే మరి

  By Srikanya
  |

  హైదరాబాద్:యాంకర్ గా ఉదయభాను హై సక్సెస్. ఆమె ఎవరో తెలియని తెలుగు వాళ్ళు లేరేమో అన్నంతగా ఓ తరాన్ని ఏలింది. అయితే ఈ మధ్యన ఆమె జోరు పూర్తిగా తగ్గింది. ఎందుకో ఏమిటో తెలియకపోయినా ఆమె లేని లోటుని తెలుగు టీవి ఇండస్ట్రీ మాత్రం బాగా ఫీలవుతోంది. అయితే తాజాగా ఆమె గురించి ఓ వార్త మీడియాలోకు హఠాత్తుగా ప్రచారంలోకి వచ్చింది.

  అదేమిటంటే....ఇంతకాలం తర్వాత ఉదయభాను తల్లి కాబోతోందంటూ వెబ్‌ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. పిల్లలు అంటే ఎంతో ఇష్టపడే ఆమె.. కెరీర్ కారణంగా మాతృత్వానికి దూరంగా వుందని, ఇప్పుడు ఆ కోరిక తీరబోతోందంటూ రాసుకొస్తున్నాయి.

  మరి ఈ వార్తలల్లో నిజముందా? కావాలనే ఇలాంటి రూమర్లు క్రియేట్ చేశారా? గతంలో ఇలాంటి రాతలు రాసిన వెబ్‌సైట్లపై దుమ్మెత్తిపోసింది ఈమె. ఈ వార్తలకు ఉదయభాను ఎలా ఫుల్‌స్టాప్ పెడుతుందో చూడాలి. నిజం కాకపోతే ఇలాంటి వార్తలను మొదట్లోనే తుంచేయటం మంచింది. ఎందుకంటే పర్శనల్ లైప్ ఎప్పుడూ అన్ని విషయాలకన్నా గొప్పది.

  ఇక టీవీల్లో ఒక వెలుగు వెలిగిన ఉదయభాను..తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మళ్లీ బుల్లి తెరపైకి వచ్చేసింది. అప్పట్లో ఈటీవిలో ప్రసారమయ్యే హృదయాంజలి పోగ్రాం ఉదయభానుకు లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి.

  ఆ తర్వాత జెమినీ టీవిలో ప్రసారం అయిన సాహసం చేయరా డింబకా, ఒన్స్ మోర్ ప్లీజ్ పోగ్రామ్స్ ఉదయభానుని మరింతగా ప్రేక్షకులకు దగ్గర చేసాయి. హాట్ యాంకర్ గానే కాకుండా తెలుగుని స్పష్టంగా పలికగలిగే అరుదైన యాంకర్ గా ఉదయభానుకు మంచి పేరుంది.

  ఉదయభాను పర్శనల్ లైఫ్ గురించి స్లైడ్ షోలో

  పుట్టింది

  పుట్టింది

  ఉదయభాను పుట్టింది తెలంగాణలో కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో పుట్టింది.

  తల్లి,తండ్రి

  తల్లి,తండ్రి

  ఆమె తండ్రి ఎస్.కె.పాటిల్ ఒక డాక్టర్..తల్లి అరుణ ఆయుర్వేద డాక్టర్.

  వాస్తవానికి...

  వాస్తవానికి...

  ఉదయభానుకి సినిమా బ్యాగ్ గ్రౌండ్ లాంటిది లేకపోయినా...సినిమాల్లో నటించాలని చిన్పప్పటి నుంచి బాగా కోరిక ఉండేది.

  నారాయణమూర్తితో ఎంట్రీ

  నారాయణమూర్తితో ఎంట్రీ

  ఇదే సమయంలో 1990 లో ఆర్ నారాయణమూర్తి తీసిన విప్లవ చిత్రం ఎర్రసైన్యం లో ఆయన కూతురుగా నటించింది.

  చిన్నవయస్సు

  చిన్నవయస్సు

  ఎర్రసైన్యం చిత్రంలో నటించే సమయానికి ఉదయభాను పదవ తరగతి చదువుతుంది..అందుకే డీ గ్లామర్ గా కనిపిస్తుంది.

  తర్వాత

  తర్వాత

  ఉదయభాను తర్వాత ఉదయభాను కొన్ని తెలుగు సినిమాలు చేసింది, కానీ పెద్దగా గుర్తింపు రాలేదు

  హీరోయిన్ గానూ..

  హీరోయిన్ గానూ..

  మరికొన్ని కన్నడ సినిమాలు లో హీరోయిన్ పాత్రలలో చేసింది .

  యాంకర్ గా

  యాంకర్ గా

  ఆ తరువాత బుల్లి తెర మీద యాంకర్ గాను మంచిగానే సెటిల్ అయ్యింది.

  వ్యక్తిగత విషాదం

  వ్యక్తిగత విషాదం

  ఆమె జీవితంలో కొన్ని విషాదలు కూడా చోటు చేసుకున్నాయి..తన నాల్గవ ఏటనే తండ్రిని కోల్పోయింది.

  చిన్నవయస్సులోనే

  చిన్నవయస్సులోనే

  ఆమె తల్లి అరుణ ప్రోద్బలంతో చిన్న వయస్సులో నే ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది

  మనస్పర్దలుతో

  మనస్పర్దలుతో

  ఆ భర్తతో వచ్చిన మనస్పర్దలతో విడాకులు తీసుకుని,కెరీర్ పై దృష్టిపెట్టింది

   మరో వివాహం

  మరో వివాహం

  కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే విజయ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

  ఆ మధ్యవరకూ

  ఆ మధ్యవరకూ

  సినిమా ఆడియో ఫంక్షన్స్ కు , సినిమా ఈవెంట్స్ కు యాంకరింగ్ చేస్తూ పాపులర్ అయ్యింది. ఆ మధ్యన జులాయి, లీడర్ చిత్రాల్లో ఐటం సాంగ్ లు చేసింది

  అప్పటినుంచీ

  అప్పటినుంచీ

  2013 లో మధుమతి అనే చిత్రం లో హీరోయిన్ గా నటించి అభిమానులను అలరించింది. ఈ చిత్రం అనుకున్న విజయం సాదించకపోవడం తో ఆ తర్వాత ఎక్కడ కూడా ఆమె కనిపించలేదు.

  అక్కడ కూడా

  అక్కడ కూడా

  ప్రొఫెషినల్ లైఫ్ లో సక్సెస్ అయినట్లే ఉదయబాను పర్శనల్ లైఫ్ లో కూడా సక్సెస్ కావాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటోంది.

  English summary
  Web Meida says Uday Bhanu is pregnant. Some others say that she is simply enjoying some rest after working in hectic schedules for years together. Should we believe?
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X